కెసిఆర్ ను సభకు రాకుండా చేస్తానని ఈటల రాజేందర్ శపధం

 కెసిఆర్ సభకు రాకుండా చేస్తా నాదే భాద్యత - ఈ టల రాజేందర్ సిఎం కెసిఆర్ విషయంలో  బిజెపి ఎమ్మెల్యే ఈటల రాజేందర్  ఓ శపధం చేశారు.  తనను అసెంబ్లీకి రానివ్వవద్దని కెసిఆర్ ఆనుకున్నాడేమో కాని నేనే కెసిఆర్ ను అసెంబ్లీకి రాకుండా చేస్తానని అన్నారు.కెసిఆర్ను అసెంబ్లీకి రాకుండా చేసే భాద్యత తనదేనని ఖచ్చితంగా కెసిఆర్ కు బుద్ది చెప్పి తీరుతానని  అన్నారు.

పార్టి అధ్యక్షుడు బండి సంజయ్ నాలుగో విడత చేపట్టిన ప్రజాసంగ్రామ యాత్ర సందర్భంగా కుత్బుల్లాపూర్ లో  జరిగిన సభలో ఈటల ప్రసంగించారు. కెసిఆర్ వి శంకిని రాజకీయాలని విమర్శించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని ఇష్టం వచ్చినట్లువిమర్శిస్తున్నాడని ఈటల మండిపడ్డారు. 

ఇంకా ఎన్ని రోజులు మీటర్ల గురించి మాట్లాడుతారని ప్రశ్నించారు. దుబ్బాకలో గెలిస్తే మీటర్లు పెడతారని దుష్ప్రచారం చేశారని అట్లాగే హుజురుబాద్ లో కూడ కేంద్రంపై దుష్ప్రచారం చేశారని రెండు చోట్ల బిజెపి గెలిచిందని అయితే బావులకు మోటార్లు రులేదని కాని కెసిఆర్ మాత్రం  కరెంట్ బిల్లుల రూపంలో మనకు మీటర్లు పెట్టాడని సెటైర్ వేశాడు. మునుగోడు ఉప ఎన్నికల్లో ముమ్మాటికి గెలిచేది బిజెపి అభ్యర్థేనని అన్నారు. కెసిఆర్ కింద మీద తపస్సు చేసినా  మునుగోడులో  బిజెపి అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి గెలుపునవు అడ్డుకోలేడని అన్నారు.

‘‘కేసీఆర్ తో కలిసి 20 ఏళ్లు అడుగులో అడుగు వేసిన వాడిని.. ఆయన బలం ఏందో బలహీనత ఏందో అన్ని విషయాలు తెలిసినవాణ్ని. మునుగోడు ప్రజలు మద్యం సీసాలకు డబ్బులకు కకావికులం అవుతారని కేసీఆర్ భావిస్తున్నడు. కానీ కకావికలం అయ్యేది కేసీఆర్, టీఆర్ఎస్ పార్టీ. వ్యూహాలు నీకే కాదు.. మాకూ ఉంటాయి. ఆ వ్యూహాలు అమలు చేసే సందర్భం ఇప్పుడు వచ్చింది. మా వ్యూహాలను మునుగోడు ఉప ఎన్నికల్లో అమలు చేస్తాం’’ అని ఈటల తెలిపారు.

హుజురాబాద్‌లో నా గెలుపు కోసం ప్రపంచంలోని తెలుగు ప్రజలందరూ ఎదురుచూశారన్నారు.   మునుగోడులో రాజగోపాల్ రెడ్డి గెలుపు కోసం కూడా తెలుగు ప్రజలు ఎదురుచూస్తున్నారన్నారు. ఏ ఆశయం కోసం తెలంగాణ ఉద్యమంలో కొట్లాడినమో.. ఆ ఆశయం ఎనిమిదిన్నరేళ్లుగా అమలు కాలేదన్నారు. తెలంగాణ ఆత్మగౌరవం దేవుడెరుగు కాని బాగుపడ్డది కేసీఆర్ కుటుంబం అన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఆత్మహత్యలు ఎందుకు జరుగుతున్నాయి అని ఈటల రాజేందర్ ప్రశ్నించారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు