లిఫ్ట్ ఇచ్చిన పాపానికి ప్రాణాలు తీసాడు

ఖమ్మం జిల్లాలో దారుణం

లిఫ్ట్ అడిగి ఇంజక్షన్ తో దాడి చేసి హత్య - బైక్ తో ఫరార్లిఫ్ట్ ఇచ్చిన వ్యక్తిపై ఇంజక్షన్ తో దాడి చేసి చంపి బైక్ తో ఫరారీ అయిన ఘటన ఖమ్మం జిల్లాలో జరిగింది. ముదిగొండ మండలం బొప్పారం గ్రామానికి చెందిన షేక్ జమాల్ సాహెబ్(50) ఓ రైతు. 

జమాల్ సాహెబ్ తన మోటర్ సైకిల్ పై వల్లబి గ్రామం  మీదగా గండ్రాయి గ్రామానికి బైక్ పై వెళుతుండగ మార్గ మద్యంలో ఓ  గుర్తు తెలియని వ్యక్తి లిఫ్ట్ అడిగాడు. లిప్ఠ్ అడిగిన వ్యక్తిని బైక్ పై వెనకాల కూర్చోబెట్టుకుని వెళుతుండగా మార్గ మద్యంలో  ఆ వ్యక్తి కొద్ది దూరం వెళ్లిన తర్వాత వెనకాల నుండి ఇంజక్షన్ ఇచ్చాడు. దాంతో జమాల్ సాహెబ్  ఇంజక్షన్ ప్రభావంతో కొద్ది క్షణాల్లోనే  బైక్ నడుపుతూనే కుప్ప కూలి  పడి పోయి చనిపోయాడు.  లిఫ్ట్ అడిగిన వ్యక్తి బైక్ తీసుకుని ఫరార్ అయ్యాడు. నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. నిందితుడు ముఖం కనిపించకుండా మంకి కాప్ పెట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. సిరంజి నీడిల్ సంఘటన స్థలంలో లభించాయని పోలీసులు చెప్పారు. వాటిని వైద్య పరీక్షల కోసం పంపిస్తామన్నారు.

 గుర్తు తెలియని వ్యక్తులకు లిఫ్ట్ ఇస్తే  అనేక రకాలుగా మోసాలు జరిగిన సంఘటనలు ఉన్నాయి. లిఫ్ట్ ఇచ్చే విషయంలో  ఉదారత్వం పనికిరాదని అపరిచితులకు లిఫ్ట్ ఇస్తే ఇలాంటి నేరాలు జరుగుతాయని పోలీసులు హెచ్చరికలు చేశారు. బైక్ పై  ఒంటరిగా  ప్రయాణాలు చేసే వారు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు