మోడీ హాట్రిక్ - జగన్ పదిలం-కెసిఆర్ డౌట్ !

 


దేశంలో ఆ ఇద్దరు ఒకే సారి రాజకీయ అందలాలు అందుకున్నారు. ఒకరు దేశ ప్రధాన మంత్రిగా అత్యున్నత భాద్యతలు చేపడితే  మరొకరు పోరాడి సాధించుకున్న తెలంగాణకు ముఖ్యమంత్రి అయ్యారు.  ఇప్పటికే అర్దం అయి ఉంటుంది ఒకరు నరేంద్ర మోది మరొకరు కెసిఆర్. ఇద్దరు రెండో సారి అధికారాన్ని నిలుపుకో గలిగారు. మూడోసారి హాట్రిక్ సాధించేందుకు  వ్యూహాలు రచిస్తున్నారు. 

జరగనున్న ఎన్నికల్లో వీరి భవిష్యత్ పై సర్వే సంస్థలు ఇప్పటికే పలు దఫాలుగా హడావుడి చేసాయి. ప్రముఖ మీడియా సంస్థ ఇండియా టుడే మూడ్ ఆఫ్ నేషన్ పేరుతో తాజాగా సర్వే చేసింది.  ఇప్పటికి ఇప్పుడు దేశవ్యాప్తంగా ఎన్నికలు జరిగితే ఎవరు గెలుస్తారు అన్నదానిపై నిర్వహించిన సర్వే ఇది. దేశంలో ఇప్పటికప్పుడు లోక్ సభ ఎన్నికలు జరిగితే బీజేపీ ఆధ్వర్యంలో ఎన్డీఏకి 286 స్థానాలు, ఇక కాంగ్రెస్ దాని మద్దతు పార్టీలకు సంబంధించిన 146 స్థానాలు, మిగతా పార్టీలకు మొత్తం కలిపి 111 స్థానాలు వస్తాయని .ఇండియా టుడే సర్వే వెల్లడించింది. ఎన్డీఏకు 21 సీట్లు తగ్గి … కాంగ్రెస్ బలపడే అవకాశం ఉందని లర్వే గణాంకాలు స్పష్టం చేసాయి.  బిజెపీకి గతంలో కన్నా సంఖ్యాబలం తగ్గినా ప్రధానమంత్రిగా నరేంద్ర మోది కొనసాగాలని ఆసక్తి కనబరిచారంటూ సర్వేలో ఇండియాటుడే వెల్లడించింది. 

నరేంద్ర మోదికి హాట్రిక్ ఖాయం అయితే తెలంగాణ సిఎం కెసిఆర్ పరిస్థితి బాగా లేదని సర్వేలో తేలింది. తెలంగాణలోని టీఆర్ఎస్ సర్కార్ పై ప్రజా వ్యతిరేకత భారీగా ఉందని జరుగుతున్న ప్రచారానికి అనుగుణంగానే తాజా సర్వేలో ఫలితాలు వచ్చాయి. 2019 సార్వత్రిక ఎన్నికల కంటే ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే  టీఆర్ఎస్ కు ఏకంగా 8 శాతం ఓట్లు తగ్గుతాయని ఇండియా టుడే సర్వేలో స్పష్టమైంది. టీఆర్ఎస్ కు 31 శాతం మాత్రమే ఓట్లు వస్తాయని సర్వేలో తేలింది. లోక్ సభ సీట్ల విషయానికి వస్తే ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే తెలంగాణలో టీఆర్ఎస్ గతంలో కంటే ఒక సీటు కోల్పోయి 8 స్థానాలు గెలుచుకుంటుందని సర్వేలో వెల్లడైంది. ఇక కమలం పార్టీకి గతంలో ఆరు సీట్లు రాగా ఈసారి రెండు సీట్లు పెరిగి 8 గెలుచుకుంటుందని వెల్లడైంది.  కాంగ్రెస్ పార్టీకి మూడు నుంచి రెండుకు పడిపోతుందని ఇండియా టుడే సర్వేలో స్పష్టమైంది. హైదరాబాద్ సీటును ఎంఐఎం నిలబెట్టుకోనుంది.

ముఖ్యమంత్రుల పనితీరులో కేసీఆర్ గ్రాఫ్ భారీగా పడిపోయింది. టాప్ టెన్ జాబితాలో కేసీఆర్ కు స్థానం దక్కలేదు. ఇండియా టుడే నిర్వహించిన దేశంలో మోస్ట్​ పాపులారిటీ ముఖ్యమంత్రుల సర్వేలో ఈసారి ఒడిశా ముఖ్యమంత్రి నవీన్​ పట్నాయక్​ టాప్ ప్లేస్ లో నిలిచారు. గత ఏడాది సర్వేలో ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆధిత్యనాథ్ టాప్ లో నిలవగా ఈసారి ఆయన టాప్ టెన్ లో కూడా నిలవలేదు. 2020 జనవరిలో నిర్వహించిన సర్వేలోనూ తెలంగాణ సీఎం కేసీఆర్ పేరు టాప్ టెన్ జాబితాలో కనపించ లేదు. ఈ సారి కూడా కేసీఆర్ టాప్ టెన్ లో నిలవలేకపోయారు. గతంలో కంటే కేసీఆర్ గ్రాఫ్ మరింత తగ్గింది. ఇక ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాత్రం తన స్థానాన్ని నిలబెట్టుకున్నారు. గత ఏడాది సరేలో టాప్ ఫోర్ లో నిలిచిన ఏపీ సీఎం జగన్.. ఈసారి ఒక స్థానం కోల్పోయి ఐదో స్థానంలో నిలిచారు. మోస్ట్​ పాపులారిటీ సర్వేలో జగన్ కు 57 శాతం ఓట్లు వచ్చాయి. గత ఏడాది ఆయనకు 40 శాతం ఓట్లే వచ్చాయి. ఈసారి జగన్ కు 17 శాతం ఓట్లు పెరిగాయి.


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు