మార్చాల్సింది చట్టం కాదు...ఇక్కడి సర్కార్ ను - అమిత్ షా

 మార్చాల్సింది చట్టం కాదు ఇక్కడి సర్కార్ ను 
రైతుల భేటీలో కేంద్ర మంత్రి అమిత్ షా



మునుగోడు సభలో పాల్గొనేందుకు వచ్చిన కేంద్ర హోం మంత్రి బిజెపి అగ్ర నేత అమిత్ షా బేగంపేట విమానాశ్రయంలో కొద్ది సేపి రైతులతో భేటి అయ్యారు. ఈసందర్భంగా రైతిలతో వారి సమస్యలు అడిగి తెల్సుకున్నారు. అమిత్ షాకు రైతులు తమ సమస్యలు విన్నవించగా హోం మంత్రి సావదానంగా విన్నారు. అమిత్ షాతో  బేటీ అయ్యే రైతులను బిజెపి నేతలు ఏరి కోరి తీసుకువచ్చినప్పటికి  రైతులు కరెంట్ మీటర్ల విషయం ప్రస్తావించారు. బావుల దగ్గర కరెంట్ వాడకానికి మీటర్లు బిగించవద్దని రైతులు కోరారు. మీటర్లు బిగించే చట్టాన్ని మార్చాలని కోరారు. అయితే  అమిత్ షా తెలివిగా స్పందించారు. మార్చాల్సింది చట్టం కాదని ఇక్కడి ప్రభుత్వాన్ని అంటూ అమిత్ షా సమాధానం ఇచ్చారు. 

తాను కూడా ఆర్గానిక్ వ్య‌వ‌సాయ‌మే చేస్తున్నాన‌ని అమిత్ షా చెప్పారు. త‌న సొంత రాష్ట్రంలో 150 ఎక‌రాల్లో ఆర్గానిక్ ప‌ద్ద‌తిలో సాగు చేస్తున్నాన‌ని ఆయ‌న రైతుల‌కు తెలిపారు.

బేగంపేట విమానాశ్రయంలో వివిధ రైతు సంఘాలతో సమావేశమై వారి యొక్క సమస్యలను విన్నాను. తెలంగాణ రైతాంగం మొత్తం అసమర్థ టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వ తీరు వల్ల మోదీ ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు రైతులకు అందకుండా పోతున్నాయి అంటూ అమిథ్ షా ట్విట్టర్ లో పేర్కొన్నారు.

సికింద్రాబాద్ కు చెందిన పార్టి దళిత నేత సత్యనారాయణ నివాసాన్ని అమిత్ షా సందర్శించారు. సత్యనారాయణ ఇంట్లో వారి కుటుంబ సబ్యులతో కల్సి తేనీటి విందు లో పాల్గొన్నారు. సికింద్రాబాద్‌లోని మా @BJP4Telangana  కార్యకర్త అయిన శ్రీ ఎన్ సత్యనారయణ గారి నివాసాన్ని సందర్శించాను. మాకు ఆతిథ్యమిచ్చిన వారి కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు అంటూ ట్వీట్ చేసారు.

జూనియ‌ర్ ఎన్టీఆర్‌తో భేటీ పై అమిత్‌షా ట్వీట్‌..

జూనియ‌ర్ ఎన్టీఆర్‌తో బేటీ విష‌యాన్ని అమిత్‌షా ట్విట్ట‌ర్‌లో వెల్ల‌డించారు. “అత్యంత ప్ర‌తిభావంఉడైన న‌టుడు.. తెలుగు సినిమా తార‌క‌ర‌త్నం అయిన జూనియ‌ర్ ఎన్టీఆర్‌ను ఈ రోజు మైద‌రాబాద్‌లో క‌లవ‌డం చాలా ఆనందంగా అనిపించింది“ అని అమిత్ షా ట్విట్ట‌ర్‌లో పేర్కొన్నారు.

జూనియ‌ర్ ఎన్టీఆర్‌తో భేటీ పై అమిత్‌షా ట్వీట్‌..
జూనియ‌ర్ ఎన్టీఆర్‌తో బేటీ విష‌యాన్ని అమిత్‌షా ట్విట్ట‌ర్‌లో వెల్ల‌డించారు. “అత్యంత ప్ర‌తిభావంఉడైన న‌టుడు.. తెలుగు సినిమా తార‌క‌ర‌త్నం అయిన జూనియ‌ర్ ఎన్టీఆర్‌ను ఈ రోజు మైద‌రాబాద్‌లో క‌లవ‌డం చాలా ఆనందంగా అనిపించింది“ అని అమిత్ షా ట్విట్ట‌ర్‌లో పేర్కొన్నారు.

కెసిఆర్ పాలన పడగొట్టేందుకు మునుగోడు సభ నాంది

మునుగోడు సభలో కెసిఆర్ పై నిప్పులు చెరిగిన అమిత్ షా



కెసిఆర్ పాలన పడగొట్టేందుకు మునుగోడు సభ నాంది అని అమిత్ షా అన్నారు.  మునుగోడు ఆత్మ గౌరవసభలో సభలో ప్రసంగించిన  అమిత్ షా కెసిఆర్ పై నిప్పులు చెరిగారు. వచ్చే ఎన్నికల అనంతరం రాష్ట్రంలో బిజెపి ముఖ్యమంత్రే ఉంటాడని అన్నారు. ప్రధాని రైతు బీమా పథకాన్ని తెలంగాణలో అమలు చేయడం లేదని ప్రశ్నించారు.  కుటుంబ పాలన వల్ల తెలంగాణ చాలా నష్ట పోయిందన్నారు. తెలంగాణ విమోచన దినోత్సవం విషయంలో కేసీఆర్ మాట తప్పారని విమర్శించారు.

కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ కుటుంబానికి ఏటీఎంలా మారిందని దుయ్యబట్టారు. కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ ధరలను తగ్గించినప్పటికీ... కేసీఆర్ ప్రభుత్వం మాత్రం తగ్గించలేదని అన్నారు. దళితుడిని సీఎం చేస్తానన్న కేసీఆర్... దళితులను మోసం చేశారని మండిపడ్డారు. జిల్లాకో సూపర్ స్పెషాల్టీ ఆసుపత్రిని నిర్మాస్తామని కేసీఆర్ చెప్పారని... నల్గొండకు సూపర్ స్పెషాల్టీ ఆసుపత్రి వచ్చిందా అని ప్రశ్నించారు. పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఇస్తామన్నారు... అందరికీ వచ్చాయా? అని అడిగారు. గిరిజనులకు భూములు ఇస్తామని కేసీఆర్ చెప్పారని... ఒక్క ఎకరా అయినా ఇచ్చారా? అని ప్రశ్నించారు. మునుగోడులో రాజగోపాల్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు