ప్రారంభమైన బండి సంజయ్ మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర

కెసిఆర్ పై విమర్శలు గుప్పించిన బండి సంజయ్ 

యాదాద్రిలో భారి బహిరంగ సభ 

పాల్గొన్న కేంద్ర మంత్రులు గజేంద్ర సింగ్ షెకావత్, కిషన్ రెడ్డి

24 రోజుల పాటు వరంగల్ భద్రకాళి ఆలయం వరకు సాగనున్న యాత్ర

బిజెపి  అధ్యక్షులు బండి సంజయ్ చేపట్టిన మూడో విడత ప్రజా సంగ్రామ  యాత్ర యాదాద్రి నుండి ప్రారంభ మైంది. కేంద్ర మంత్రులు గజేంద్ర సింగ్ షెకావత్, కిషన్ రెడ్డి తో పాటు పార్టి నాయకులు యాదాద్రి ఆలయంలో ప్రత్యేక పూజల అనంతరం బహిరంగ సభలో ప్రసంగించారు.

ఈ సందర్భంగా బండి సంజయ్ సిఎం కెసిఆర్ పై తీవ్ర విమర్శలు చేశారు. కెసిఆర్ రాష్ట్ర ప్రజలకిచ్చిన ఏ ఒక్క హామి నెర వేర్చలేదని అన్నారు. వాసలమర్రి గ్రామానికి ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. గ్రామ సర్పంచ్ తో గ్రామస్థులతో కల్సి  చికెన్ మటన్ కాళ్ల సోర్వా తిన్న కెసిఆర్ పత్తా లేకుండా పోయాండని ఎద్దేవా చేసారు.  అవినీతి ఆక్రమాలతో కెసిఆర్ మూర్ఖ పాలన సాగుతోందని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరిట కెసిఆర్  ప్రజాధనాన్ని దోచుకున్నారని ఆరోపించారు. అడ్డదిడ్డంగా ఇష్టానుసారంగా ప్రాజెక్టు కట్టారని కెసిఆర్ మూర్ఖపు నిర్ణయం వల్లే ప్రాజెక్టు నిండా మునిగిందని ఆరోపించారు. ప్రాజెక్టు అంచనాలను 30 వేల కోట్ల నుండి లక్షా  30 వేల కోట్లకు పెంచారని లక్షలాది ఎకరాలు ముంపుకు గురయ్యాయని ఆరోపించారు. అడ్డగోలుగా కట్టిన  ప్రాజెక్టుకు నిభందనలకు విరుద్దంగా కేంద్ర జాతీయ హోదా ఇచ్చి ఉంటే నీట మునిగిన ప్రాజెక్టుకు ఎట్లా ఇచ్చారని దేశ ప్రజలు బిజెపి ప్రభుత్వాన్ని   ప్రశ్నించే వారని అన్నారు. రాష్ట్రంలో కెసిఆర్ అవినీతి పాలనను ప్రజలకు తెలియ చెప్పేందుకే మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర చేపట్టామన్నారు. ఎక్కడున్నదన్న బిజెపి రాష్ట్రంలో అన్ని జిల్లాలలో విస్తరించిందని అన్నారు. పాలమూరు నుండి నల్గొండ మొదలు ఖమ్మం వరకు పార్టీని బలోపేతం చేస్తామన్నారు. గొల్కొండ కోటపై కాశాయ జెండా ఎగుర వేస్తామని రాష్ట్రంలో బిజెపి అధికారం లోకి రావడం ఖాయమని అన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకం కింద అర్హులైన పేదలందిరికి ఇండ్లు నిర్మిస్తామని అన్నారు.   రైతులు, కూలీలు అన్ని వర్గాల ప్రజలు ఇండ్ల నుండి నిర్భయంగా బయటకి వచ్చి  ప్రజా సంగ్రామ యాత్రలో పాల్గొనాలన్నారు.  ప్రతి ఒక్కరు ఉగ్ర రూపులై కెసిఆర్ సర్కారును దించేందుకు  కంకణ బద్దులు కావాలని అన్నారు. 

తెలంగాణ కోసం బలిదాణాలు చేసిన వారికి నిజమైన నివాళులు ఇవ్వాలంటే కెసిఆర్ అవినీతి ప్రభుత్వాన్ని తరిమి కొట్టాలని కేంద్ర జల శక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ అన్నారు. 

రాష్ట్రంలో హత్యలు, మానభంగాలు పెరిగి పోయాయని నేరాలకు తెరాస ప్రభుత్వం కేరాఫ్ గా మారిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. 

తెలంగాణ "నై" అన్న వాళ్లే సగం మంది మంత్రులు..ఈటల రాజేందర్

ప్రస్తుతం ఉన్న మంత్రుల్లో సగం మంది తెలంగాణ వద్దన్న వాళ్లేనని ఈ టల రాజేందర్ మండిపడ్డారు.  ఎంతమంది తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారో కేసీఆర్ చెప్పాలని డిమాండ్ చేశారు. ఎంతమంది ఉద్యమకారులు టీఆర్ఎస్ పార్టీని వీడి వెళ్లారో.. ఎందుకు వెళ్లారో ప్రజలు ఆలో చించాలన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు బుద్ధి చెప్పే అవకాశం త్వరలో రాబోతోందని  కేసీఆర్‌ పరిపాలన అంతమొందించడమే భారతీయ జనతా పార్టీ  కర్తవ్యమని ఈటల రాజేందర్ స్పష్టం చేశారు.

బహిరంగ సభలో పార్టి ఎంపీలు, ఎమ్మెల్యేలు నాయకులు పాల్గొన్నారు.

యాదాద్రి నుండి వరంగల్ భద్రకాళి ఆలయం వరకు 24 రోజుల పాటు ఆగస్టు 26 వరకు ప్రజా సంగ్రామ యాత్ర సాగ నుంది. చివరి రోజు వరంగల్ లో భారి  బహిరంగ సభ జరగ నుంది.కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు