విపరీత ధోరణులకు అడ్డు కట్ట పడాల్సిందే

 నేరాలు- ఘోరాలు


ఆరేళ్ల బాలిక అత్యాచారానికి గురై హత్యకు గురి అయింది. ఈ ఉన్మాదానికి పాల్పడిన వాడు  ఆత్మహత్య చేసుకున్నాడు. ఇలాంటి విపరీత ధోరణులకు తల్లిదండ్రుల పెంపక లోపం సరైన  పరిస్థితుల్లో పెరగక పోవడం ఇతరత్రా  ఇలా ఎన్నో కారణాలు ఉంటాయి. అయితే వీటన్నిటికి ప్రేరణ మాత్రం తప్పకుండా అంతర్జాలంలో అందుబాటులో ఉండే  అశ్లీల చిత్రాలు. వాటికి తోడుగా జబర్దస్త్, బిగ్ బాస్   లాంటి టీవీ కార్యక్రమాలు. ఈ కార్యక్రమాల్లో నిర్లజ్జగా అతి ఘోరంగా ఈ లైంగిక విషయాల మీద, జోకులు అయినప్పటికీ, రెచ్చగొట్టే ధోరణి లోనే ఉంటున్నాయి. ఒక ఎమ్మెల్యే, ఒక ఉన్నత కుటుంబంలో నుంచి వచ్చినటు వంటి వ్యక్తి ఇలాంటి కుళ్ళు జోకులకు ఉప్పొంగి పోయి చప్పట్లు కొట్టడం వల్ల యువతకు ఈ కుళ్ళు ఆమోద యోగ్యం అనే అభిప్రాయం ఏర్పడే అవకాశాలు ఉంటాయి. సమజాన్ని వక్రమార్గంలోకి నెడుతున్న ధోరణులకు అడ్డు కట్టలు పడాల్సిందే. లేదంటే సమాజానికి పెను ముప్పు తప్పదు.

 ఎంతో చదివి ప్రపంచాన్ని అర్థం చేసుకొని ఎంతో పరిపక్వత చెందినటువంటి రాంగోపాల్ వర్మ సంతోష పడటానికి నీలి సినిమాలు చూస్తాను అని బహిరంగంగా చెప్పడం. ఒక ఆడపిల్ల పిరుదులు నచ్చాయని చెప్పడం. అది వీడియో చేసి పెట్టడం ఏ మాత్రం సభ్యతగా లేదు. ఇలా ఎందుకు చేస్తున్నారు అని ఒక టీవీ ఇంటర్వ్యూలో అడిగితే  పత్రిక అవి నేను పెట్టలేదు కదండీ. నా దగ్గరికి వచ్చి అందరూ అడుగుతున్నారు సమాధానం చెప్తున్నా అంతే అని జవాబిచ్చారు. ఎంతో పేరు గల వ్యక్తి తను. తన అనుచరులు తన సినిమాలు చూసే వాళ్ళు లేక తన మేధాశక్తికి ప్రభావితమైన యువకులు ఉన్నారు.తన యొక్క విశృంఖలత ద్వారా తనను తాను నియంత్రించుకునే సామర్థ్యం ఉన్నప్పటికీ  పరిపక్వత లేని, తల్లిదండ్రుల అదుపులేని, హాస్టల్లో చదువుకుంటూ సహవాస దోషాల వల్ల ఇలాంటి రోల్మోడల్ ఉన్నటువంటి విద్యార్థులు విద్యార్థినులు తప్పుడు ప్రభావానికి లోనయ్యే అవకాశాలు చాలా ఉంటాయి. పెద్దలైన వాళ్ళు ఇటువంటి అభిప్రాయాల్ని కాస్త నియంత్రణతో వ్యక్తం చేస్తే బాగుంటుంది. 

 ఇలాంటి అశ్లీల నీలి చిత్రాలను సంపూర్ణంగా ప్రజలకు అందుబాటులో లేకుండా చేయాలి.  కొంతవరకు ఇలాంటి కార్యక్రమాలు చిత్రాలు నియంత్రణ చేయబడ్డాయి. ఇంకా చేయవలసిన అవసరం ఉంది రెండవది. జబర్దస్త్, బిగ్ బాస్ ఇలాంటి కార్యక్రమాల్ని కూడా నియంత్రించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే నవ్వించే కార్యక్రమాలు చాలా మంచివి ఆరోగ్యానికి ఉపయోగకరం కూడా. కానీ ఆ పనిలో నవ్వించడం వల్ల వచ్చే లాభాలు కన్నా ఈ అశ్లీల అవ లక్షణాల వల్ల నష్టమే ఎక్కువ జరుగుతుంది. విశ్వవిఖ్యాత చార్లెస్ చాప్లిన్, మిస్టర్ బీన్ లాంటి మహామహులు ఎన్నో తరాలు ఎలాంటి అసభ్య చిత్రీకరణక లేకుండా నవ్వులు పూయించ లేదా ?

 ఈ మధ్య అత్యాచారాలకు రెచ్చగొట్టే విధంగా వస్ర్త ధారణ  ఒక కారణం అవుతున్నది.  అలాంటి ప్రవర్తనల వల్ల అత్యాచారాలు జరగవు అని కొందరి వాదన.  అది నిజమే కావచ్చు. వీటిపై అలాంటి ప్రలోభాల వలన ఒక మంచి వ్యక్తి ఉన్మాదిగా మారకపోవచ్చు కానీ ఉన్మాదంతో ఉన్నటువంటి వ్యక్తి మాత్రం అలాంటి వారితో ప్రేరణ పొందే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అన వసరంగా ఎక్స్పోజింగ్ డ్రెస్సులు వేసుకోవడం ఏమాత్రం మంచిది కాదు.  చిన్నచిన్న బట్టలు వేసుకుంటే అవి యువకుల్ని వ్యామోహానికి గురి చేయడం అనేది తప్పకుండా జరుగుతుంది. అది ఉన్మాదానికి దారి తీస్తుంది అని చెప్పలేం కానీ ప్రేరణ మాత్రం తప్పకుండా ఉంటుంది. మొన్నీ మధ్య ఒక అమ్మాయి ఆమె స్నేహితులతో  మత్తు పదార్థాలు అమ్మే క్లబ్ కి వెళ్ళింద ఇది మంచిదా! వారు స్నేహితులే కావచ్చు కానీ అందులో ఎవరికి ఉన్మాధత్వం ఉందో ఆ చిన్న పిల్లకు ఎలా అర్థమవుతుంది. దాంతో ఆమె బలి అయింది. కాబట్టి మరి తాలిబాన్లు చెప్పినట్టు మొత్తం కప్పుకొని పోవాల్సిన బయట తిరగకుండా ఉండడం చదువు కూడా మానివేయడం అవసరం లేకున్నా,ఏ పుట్టలో ఏ పాము ఉందో అనేటువంటి జాగ్రత్తతో మెలగాల్సినటువంటి అవగాహన ఆడపిల్లలకు ఉండవలసిన అవసరం ఉంది.

  సినిమాలలో రెచ్చగొట్టే దుస్తులు వేసుకునే హీరోయిన్లు మాత్రం ఇతర కార్యక్రమాలకు వస్తే మాత్రం ఎంతో సాంప్రదాయికంగా ఉంటారు. ఈ ద్వంద్వ వైఖరి యువకుల్ని తప్పకుండా అయోమయానికి గురిచేసే అవకాశాలున్నాయి. క్రికెట్ వ్యాఖ్యానం చేసే ఆడవాళ్ళు కూడా ప్యాంటు షర్టు వేసుకోవచ్చు కానీ మరి మోకాళ్ళపై వరకు డ్రెస్సులు వేసుకోవాల్సిన అవసరం ఏముంది. 

 మాదకద్రవ్యాల ప్రభావం, ఎక్కడపడితే అక్కడ మద్యం లభ్యం కావడం కొంతవరకు ఈ అఘాయిత్యాలను ప్రేరేపిస్తాయి అనడంలో సంకోచించ వలసిన అవసరం లేదు.

 పిల్లల పెంపకం ఎంత ముఖ్యమో సాంఘిక ప్రవర్తన కూడా అంతే ముఖ్యం కాబట్టి రోల్ మోడల్ గా ఉన్నవారు, ఎంతోమందిని ప్రభావితం చేసే ప్రముఖ వ్యక్తులు, సినిమా టీవీ కార్యక్రమాలు చేసేవారు కాస్త బాధ్యతాయుతంగా సమాజానికి జవాబు దారీగా ఉండాల్సిన అవసరం  ఉంది.


BY 
PRASAD MANDUVA
AUTHOR IS A WRITER AND ACADEMICIAN 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు