అమెరికా అమ్మాయి- తెలంగాణ అబ్బాయి ఒక్కటయ్యారు

 


అమెరికా అమ్మాయి, తెలంగాణ అబ్బాయి ఇద్దరూ మూడుముళ్ల భందంతో ఒక్కటయ్యారు.  ఏడడుగులు నడిచి హిందూ సాంప్రదాయ పద్దతిలో  ఆలుమగలయ్యారు.‌  ఓరుగల్లు వేదికగా ఆదివారం జరిగిన ఖండాంతరం వివాహం అందరికి ఆసక్తి కలిగించింది.  వివాహా వేడుకకు పలువురు విఐపీ లు కూడ హాజరై కొత్త జంటను ఆశీర్వదించారు. 

అమెరికా కు చెందిన యువతి డాక్టర్ జెన్నా బ్లెమర్‌  హనుమకొండకు చెందిన పుట్ట అరవింద్ రెడ్డి  ఇద్దరూ అమెరికాలో ఉండగా ప్రేమించుకున్నారు. హన్మకొండకు చెందిన  అనిత మోహన్‌రెడ్డి (హస్తకళల అభివృద్ది సంస్థ మాజి చైర్మన్) దంపతుల కుమారుడు అరవింద్ రెడ్డి ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్లగా అక్కడ డాక్టర్ జెన్నా బ్లెమర్‌తో ఏర్పడ్డ పరిచయం ప్రేమగా మారింది. పెండ్లి చేసుకునేందుకు ఇద్దరూ నిర్ణయించి తల్లి దండ్రులకు చెప్పారు. వారు ఆంగీకరించడంతో ఇండియాకు వచ్చి  హనుమకొండలోని ఓ ఫంక్షన్‌ హాల్‌లో హిందూ సాంప్రదాయ పద్దతిలో ఇరు కుటుంబ సభ్యులు భందు మిత్రుల  సమక్షంలో  వివాహ వేడుక ఘనంగా నిర్వహించారు.

 అమెరికా అమ్మాయి  పట్టు చీర బంగారు ఆభరణాలు ధరించి అందంగా ముస్తాబు కాగా ఆమె తల్లి దండ్రులు కూడ హిందూ సాంప్రదాయ కట్టు బొట్లతో అలంకరణ చేసుకోవడం చూసి  పెండ్లి మండపంలో అందరు ముచ్చట పడ్డారు. వేద మంత్రోశ్చరణతో జరిగిన హిందూ సాంప్రదాయ వివాహం  ఎంతో నచ్చిందని కన్యాదానం, మాంగళ్య ధారణ, ముత్యాల తలంబ్రాలు హిందూ వివాహ సాంప్రదాయాలను చూసి ఎంతో ఆశ్చర్యం చెందానని  సాంప్రదాయాలు చాలా బాగున్నాయని వదువు జెన్న బ్లెమర్ తెలిపారు. ప్రేమించుకుని పెద్దలను ఒప్పించి అమెరికా నుంచి వచ్చి పెళ్ళి చేసుకున్నామని వరుడు అరవింద్ తెలిపారు.

వివాహ వేడుకలకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుతో పాటు పలువురు ఎమ్మెల్యేలు హాజరయ్యారు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు