భాజపా సభకు భారి జనం - వచ్చేది డబుల్ ఇంజన్ సర్కారేనన్న కమల నాధులు



 సికింద్రాబాద్  పరేడ్ గ్రౌండ్స్ లో  అదివారం సాయంత్రం భారతీయ జనతా పార్టి అధ్వర్యంలో జరిగిన విజయ సంకల్ప యాత్ర సభ కు భారి జనం హాజరు అయ్యారు. జన సమూహాన్ని చూసిన  పార్టి వేతలు జోష్ తో ప్రసంగాలు చేసారు. తెలంగాణ లో వచ్చేది తమ ప్రభుత్వమేనని డబుల్ ఇంజన్ సర్కార్లతోనే ప్రగతి సాధ్యమని స్పష్టం చేశారు.  

 సిఎం కెసిఆర్ సంధించిన ప్రశ్నలను పూర్తిగా పట్టించు కోకుండా ప్రధానమంత్రి నరేంద్ర మోది   తన ప్రసంగంలో ఎలాంటి రాజకీయ అంశాలజోలికి వెళ్లకుండా ప్రగతికార్యక్రమాలకు పరిమితం అయ్యారు. తెలంగాణ అభివృద్ధికి బీజేపీ ప్రథమ ప్రాధాన్యం ఇస్తుందన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం ప్రయత్నిస్తున్నామన్నారు. గత 8 ఏళ్లుగా భారతీయుల జీవనంలో సకారాత్మక మార్పు తీసుకొచ్చామన్నారు. పేదలు, దళితులు, ఆదివాసీల ఆంకాక్షలను బీజేపీ ప్రభుత్వం నెరవేరుస్తోందన్నారు.

తెలంగాణ పేదల పట్ల సేవాభావంతో పని చేస్తున్నామన్న ప్రధాని మోదీ.. అందుకే తెలంగాణ ప్రజల్లోనూ బీజేపీ పట్ల విశ్వాసం పెరుగుతోందన్నారు. మీ ప్రేమ, ఉత్సాహం.. దేశం మొత్తం చూస్తోందన్నారు. 2019 ఎన్నికల నుంచి తెలంగాణలో బీజేపీ పట్ల నమ్మకం పెరుగుతోందన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాషాయ జెండా ఎగిరిందన్నారు. బీజేపీ డబుల్ ఇంజిన్ సర్కారును తెలంగాణలో ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుకుంటున్నారన్నారు.

తెలంగాణలో 5 సాగునీటి ప్రాజెక్టులకు కేంద్రం సహకరిస్తోందని మోదీ తెలిపారు. హైదరాబాద్‌లో ఫ్లైఓవర్ల నిర్మాణం, ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం కోసం కేంద్రం రూ.1500 కోట్లు ఖర్చు చేస్తోందన్నారు. రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణానికి రూ.3 వేల కోట్లు వెచ్చిస్తున్నామని మోదీ తెలిపారు. తెలంగాణలో 5 వేల కిలోమీటర్ల మేర జాతీయ రహదారులను ఏర్పాటు చేశామన్నారు. పీఎం గ్రామీణ్ సడక్ యోజనలో భాగంగా.. తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాల్లో రూ.1700 కోట్లు ఖర్చు చేశామన్నారు. 

తెలంగాణలో మెగా టెక్స్‌టైల్ పార్క్‌ను ఏర్పాటు చేస్తున్నామన్న ప్రధాని మోదీ.. దీని వల్ల వేలాది మందికి ఉపాధి లభిస్తుందన్నారు. దేశ ఆత్మనిర్భరతకు హైదరాబాద్ ప్రధాన కేంద్రమన్నారు. హైదరాబాద్‌లో సైన్స్ సిటీ ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నామని బయో మెడికల్ సైన్స్ కేంద్రాలు ఏర్పాటు అవుతున్నాయని  రామగుండంలో ఎరువుల ఉత్పత్తి తిరిగి ప్రారంభమైందని అన్నారు.

ప్రాచీన సంస్కృతి, పరాక్రమాలకు నిలయమైన  పుణ్యస్థలం తెలంగాణ అంటూ మని ప్రధాని కొనియాడారు.  తెలుగులో తన ప్రసంగం ప్రారంభించిన మోది  ఇక్కడ కళ, కౌశలం, పని తనం పుష్కలంగా ఉన్నాయన్నారు. యాదాద్రి, జోగులాంబ, వరంగల్ భద్రకాళి ఆశీస్సులు ఉంటాయని చెప్పారు. కాకతీయుల వీరత్వం, రామప్ప నంది  శిల్పకళా సాందర్యం ఎంతో గొప్పదని, ఇక్కడి సాహిత్యకారుల కృషి దేశానికి గర్వకారణమని అన్నారు. దళితులు, ఆదివాసీల ఆకాంక్షలను బీజేపీ నెరవేర్చిందని  సబ్‌కా సాథ్.. సబ్‌కా వికాస్ మంత్రంతో తెలంగాణ అభివృద్ధి ఎనిమిది ఏళ్లుగా ప్రజల జీవనప్రమాణాలు పెంచేందుకు ప్రయత్నించామన్నారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం ఎంతగానో సహకరిస్తోందని ప్రధాని వివరించారు. 




కెసీఆర్ గడీలు బద్దలు కొడతాం..బండి సంజయ్

భాగ్యలక్ష్మీ అమ్మవారి సాక్షిగా చెబుతున్నాం.. తెలంగాణలో కేసీఆర్ గడీలు బద్దలు కొడతాం. కేసీఆర్ గడీల్లో బందీ అయిన తెలంగాణ తల్లిని రక్షించుకునే బాధ్యతను తీసుకుందాం.. అని బండి సంజయ్ విజయ సంకల్ప సభ లో ప్రధాన మంత్రికిస్వాగతం పలుకుతూ  ఉద్వేగ ప్రసంగం చేసారు.

ప్రధాని మోదీ ని దేవుడిగా అభివర్ణించాడు. పులి వస్తుందంటే గుంట నక్కలు పారిపోతాయన్నారు. ప్రధాని మోదీని పులిగా అభివర్ణించారు.  ప్రపంచ వ్యాప్తంగా  ఎక్కడికి వెళ్లినా స్వాగతిస్తున్నారని   కాని కేసీఆర్ లాంటి మూర్ఖులకు ఆయన విలువ తెలియడం లేదన్నారు.

బీజేపీ విజయ సంకల్ప సభకు హాజరైన ప్రజలను చూస్తే ఆనందంగా ఉందన్నారు. ప్రధాని మోదీని ఉద్దేశించి టీఆర్ఎస్ నాయకుల వ్యాఖ్యలు చూస్తే బాధగా ఉందన్నారు. కరోనా టీకాలను ఉచితంగా అందించినందుకు మోదీని తిడుతున్నారా.? పేద ప్రజలకు ఉచితంగా బియ్యం ఇస్తున్నందుకు తిడుతున్నారా? ఉక్రెయిన్‌లో యుద్ధాన్ని ఆపి మరీ తెలుగు రాష్ట్రాల విద్యార్థులను కాపాడినందుకు నరేంద్ర మోదీని తిడతారా అంటూ ప్రశ్నలు సంధించారు.   

ఎన్నికల తర్వాత మేమే సచివాలయానికి వెళ్తాం..అమిత్ షా

కొడుకును సీఎం చేసేందుకు కేసీఆర్ వ్యూహాలు రచిస్తున్నారని కేంద్ర మంత్రి అమిత్ షా  విమర్శించాడు.  ఈ సందర్భంగా టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని ఆయన విమర్శలు గుప్పించారు. టీఆర్ఎస్ స్టీరింగ్ ఎంఐఎం చేతిలో ఉందని ఆరోపించారు. నీళ్లు, నిధులు, నియామకాలే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని, మరీ రాష్ట్ర ప్రజలకు నీళ్లు, నిధులు, నియామకాలు అందాయా అడిగారు. కెసిఆర్ ఎన్నికలకు ఎప్పుడు వెళ్లినా విజయం తమదే నన్నారు.

తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఎందుకు జరపడం లేదని సిఎం కెసిఆర్ ను  అమిత్ షా నిల దీసారు. ఓ వైసీకి భయపడే కేసీఆర్ విమోచన దినోత్సవం జరపడం లేదని విమర్శించారు. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం వస్తే.. విమోచన దినోత్సవాన్ని జరుపుతామన్నారు. అలాగే కొడుకు కేటీఆర్‌ను సీఎం చేసేందుకు కేసీఆర్ వ్యూహాలు పన్నుతున్నారని, ఆయన చింత అంతా అదేనని అమిత్ షా ఎద్దేవ చేశారు. ఎవరో మంత్రగాడు చెప్పిన మాటలు విని కెసిఆర్ సచివాలయానికి వెళ్లలేదన్నారు. సచివాలయానికి వెళ్లని ముఖ్మమంత్రి దేశంలో ఎవరూ లేరని అన్నారు. ఎన్నికల తర్వాత తామే సచివాలయానికి వెళ్తామని అమిత్ షా అన్నారు.

కిషన్‌రెడ్డి 

టీఆర్ఎస్ ఫ్లెక్సీల వార్ చేస్తోందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి మండిపడ్డారు. బీజేపీ ఫ్లెక్సీలను కావాలని తొలగించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ ఫ్లెక్సీలకు భారీగా జరిమానాలు వేశారని ఆరోపించారు. టీఆర్ఎస్ ఫ్లెక్సీలపై నామమాత్రపు ఫైన్లు వేశారని చెప్పారు. ఇంత చౌకబారు రాజకీయాలు తాము ఎన్నడూ చూడలేదన్నారు. ఓవైసీ, కేసీఆర్ తెలంగాణను దోచుకుంటున్నారని ఆయ ఆరోపించారు. తెలంగాణ సర్కార్ ఎలా పనిచేస్తుందో రెండ్రోజులుగా మీరే చూస్తున్నారని అని పేర్కొన్నారు. 8 ఏళ్లుగా సచివాలయానికి సీఎం కేసీఆర్ రానేలేదన్నారు. సచివాలయానికి రాని సీఎం దేశంలో కేసీఆర్ ఒక్కరేనని మండిపడ్డారు. వాస్తు పేరుతో సచివాలయం కూలగొట్టి వందల కోట్లు వృథా చేశారని ఆరోపించారు.

యోగి ఆదిత్య నాథ్ 

తెలంగాణలో కేంద్ర పథకాలు అమలు కావడం లేదని, కేంద్ర పథకాలపై టీఆర్ఎస్ ప్రభుత్వం తమ స్టాంప్ వేసుకుంటుందని సీఎం యోగి ఆదిత్య నాథ్ విమర్శించారు. హైదరాబాద్‌లో బీజేపీ విజయ సంకల్ప సభకు బీజేపీ అగ్రనేతలు కదలి వచ్చారు. రెండు రోజుల పాటు హెచ్‌ఐసీసీలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరిగాయి. ఈ సమావేశాలకు ముగింపుగా పరేడ్ గ్రౌండ్‎లో ఆదివారం భారీ బహిరంగ సభ జరిగింది. ఈ సందర్భంగా యూపీ సీఎం యోగి ఆదిత్య నాథ్ తెలంగాణ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు.

సికింద్రాబాద్​ పరేడ్​ గ్రౌండ్​లో జరుగుతున్న బహరింగ సభకు వచ్చిన మోదీ వంగి వంగి సలామ్​ చేయడం అందరినీ ఆశ్యర్యపరిచింది. గతంలో ఏ సమావేశాలకు వెళ్లినా, సభలో ప్రసంగించినా కూడా మోదీ ఇట్లా చేయలేదని పరిశీలకులు అంటున్నారు. పెద్ద ఎత్తున వచ్చిన ప్రజలను చూసి బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్​ భుజం తట్టి అభినందించారు మోదీ.

బిజెపీలో చేరిన మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి

చేవేళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి బీజేపీలో చేరారు. పరేడ్‌ గ్రౌండ్స్‌లో నిర్వహిస్తున్న విజయ సంకల్ప సభలో బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి తరుణ్‌ చుగ్‌ కొండా విశ్వేశ్వరరెడ్డి చేయి పట్టుకుని కార్యకర్తలకు అభివాదం చేయించారు.  

సభా ప్రాంగణంలోగద్దర్

ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ ప్ర‌సంగం విన‌డానికే తాను బిజెపి విజ‌య సంక‌ల్ప స‌భ‌కి వ‌చ్చిన‌ట్లు తెలిపారు ప్ర‌జా గాయ‌కుడు గ‌ద్ద‌ర్.సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో ఈ స‌భ జ‌రుగుతోంది. చాలా కాలం వామపక్షాల తరఫున నిలిచిన గద్దర్.. వాటికి విరుద్ధంగా ఉండే బీజేపీ సభా ప్రాంగణానికి రావడం గమనార్హం. తాను ప్రధాని మోదీ ప్రసంగాన్ని వినడానికే సభకు వచ్చానని.. ఆయన ఏం సందేశం ఇస్తారన్నది విన్నాక తాను మీడియాతో మాట్లాడుతానని చెప్పారు. ఇటీవల కొంతకాలంగా రాజకీయ నేతలను కలుస్తున్న గద్దర్.. గతంలో రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో జరిగిన ప్రతిపక్షాల సభకూ హాజరయ్యారు. 

జనమే జనం

విజయ సంకల్ప యాత్రకు జనం భారి సంఖ్యలో హాజరయ్యారు. జనాలను చూసి భాజపా కేంద్ర మంత్రులు వివిద రాష్ట్రాల నుండి వచ్చిన ముఖ్యమంత్రులు సంభ్రమాశ్చర్యాలు వ్యక్తం చేశారు. 


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు