ఏపి ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం



 ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇక ముగిసిన అధ్యాయమే. ప్రత్మేక హోదా సాదించి పెడతామని గతంలో చంద్రబాబు నాయుడు ఎపి ప్రజలను బాగా నమ్మించి అధికారంలోకి రాగలిగాడు. ఆ తర్వాత ఇదే అంశాన్ని జగన్ మోహన్ రెడ్డి అస్ర్తంగా చేసుకుని అధికారంలోకి రాగలిగాడు. ఎపిప్రజల ఆశలపై నీళ్లు చల్లుతూ మరోసారి కేంద్రం ప్రత్యేక హోదా వల్ల లాభం లేదంటూ స్పష్టత ఇచ్చారు. 

 లోక్ సభలో మంగళవారం  జులై 19 న   టీడీపీ ఎంపీ రామ్మోహన్‌ నాయుడు అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి నిత్యానందరాయ్‌ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ప్రత్యేక హోదా వల్ల ఒరిగేదేమీ లేదని. విభజన చట్టం ప్రకారం ఏపీకి చేయాల్సిదంతా చేస్తున్నామని తేల్చి చెప్పారు. ప్రత్యేక హోదా ఇచ్చిన రాష్ట్రాలకు, ఇవ్వని రాష్ట్రాలకు అభివృద్ధి విషయంలో తేడా ఏమీ లేదని చెప్పుకొచ్చారు.

‘14వ ఆర్థిక సంఘం ప్రత్యేక హోదాకు ప్రాధాన్యం ఇవ్వలేదు. కేంద్రం పన్నుల్లో రాష్ట్రాల వాటా 42 శాతానికి పెంచాం. రెవెన్యూ లోటున్న రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం అదనపు నిధులు ఇస్తోంది. 15వ ఆర్థిక సంఘం కూడా అవే సిఫార్సులను కొనసాగించింది’ అని కేంద్ర మంత్రి నిత్యానందరాయ్‌ అన్నారు.

విభజన చట్టం హామీలను చాలా వరకూ నెరవేర్చామని మంత్రి తెలిపారు. కొన్ని మాత్రమే పెండింగ్‌లో ఉన్నాయన్నారు. ఏపీ, తెలంగాణ మధ్య నెలకొన్న వివాదాల పరిష్కారానికి ఇరు రాష్ట్రాల మధ్య ఇప్పటికే 28 సమావేశాలు ఏర్పాటు చేశామని నిత్యానందరాయ్ వివరించారు.

ఎన్నికల సమయలో రాజకీయ పార్టీలకు అస్త్రంగా మారిన ప్రత్యేక హోదా విషయంలో ఇప్పడు అధికార పార్టి అయిన వైఎస్ ఆర్ కాంగ్రేస్ పార్టీతో పాటు తెలమగు దేశం పార్టీల స్పందన ఏమిటన్నది చూడాలి. కేంద్రం ప్రత్యేక హోదాకు ససేమి అన్నట్లుగానే ఉంది. చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి ఇద్దరూ ఈ అంశంపై ప్రజల్లో ఆశలు చెల రేపి అధికారం లోకి వచ్చి చేతులు ఎత్తి వేసిన వారే. వీరిద్దరూ ఇప్పుడు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి చేదోడు వాదోడుగా ఉంటున్నారు. కేంద్రాన్ని ఎదిరించి  ప్రత్యేక హోదా విషయంలో ఇరువురూ పోరాటాలకు కాలుదువ్వే పరిస్థితులులేవు. ఇప్పుడు ఏపి ప్రజలకు ఏం సమాధానం చెబుతారో ఏం సర్ది చెప్పుకుంటారో చూడాలి.


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు