విశ్వ బ్రాహ్మణుల ఆగ్రహం

 కెటిఆర్ ఆఖరికి ఇలా సంజాయిషితన ప్రసంగాలకు తానే మురిసి పోతుంటాడు తెలంగాణ ముఖ్యమంత్రి తనయుడు టిఆర్ఎస్ పార్టి వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి అక్టింగ్ ముఖ్యమంత్రి  కెటిఆర్. బహుభాషల్లో తనకు తానే సాటినని గర్వపడుతుంటాడు. మైక్ అందుకుంటే చాలు ఏం మాట్లాడుతుంటాడో తనకు తానే   ఎమోషనల్ అయి పోతుంటాడు. తండ్రి అండగా దక్కిన అందలం కదా.

 ఏదిపడితే అది మాట్లాడితే ఎలా ఉంటుందో విశ్వబ్రహ్మణులు కెటిఆర్ కు రుచి చూపారు. చారి అనేది విశ్వబ్రాహ్మణుల నామధేయాల చివరన  ఉండే సింబాలిక్. మంత్రి కెటిఆర్ ఏ ఖయాల్లో ఉండి మాట్లాడాడో కాని చారి అట బోడి అట అంటూ బిజేపి సీనియర్ నేత నుద్దేశించి  చులకనగా మాట్లాడి చిక్కుల్లో పడ్డాడు. తెలంగాణ భవన్ లో కల్వకుర్తికి చెందిన కొందరు కాంగ్రేస్ పార్టి నేతలు టిార్ఎస్ లో చేరారు. ఈ సందర్బంగా కెటిఆర్ చేసిన వ్యాఖ్యలతో విశ్వ బ్రాహ్మణులు మనస్థాపానికి గురయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు తెలిపారు. కిటిఆర్ దిష్టి బొమ్మలు దగ్దం చేశారు. సోషల్ మీడియాలో విరుచుకుపడ్డారు. తెలంగాణ  కోసం తన శరీరాన్ని అగ్నికి ఆహుతి చేసిన అమరుడు శ్రీకాంత చారి త్యాగాన్ని గుర్తు చేస్తు కెటిఆర్ ను ట్రోల్ చేశారు. రాజకీయ నాయకులపై  ఆగ్రహం ఉంటే కులాన్ని ఇంతగా కించ పరుస్తారా అంటూ విమర్శలు చేశారు. తెలంగాణ ఉద్యమ మహోపాధ్యాయుడు డాక్టర్ కొత్తపల్లి జయశంకర్ ఎవరో తెల్సా  కెటిఆర్ అంటూ ప్రశ్నించారు.

విశ్వ బ్రాహ్మణుల దెబ్బకు కెటిఆర్ మైండ్ బ్లాక్ అయింది. దిగి వచ్చి తన మాటలు వెనక్కి తీసుకుంటున్నానని సంజాయిషి ఇచ్చారు. తాను చేసిన వ్యాఖ్యలపై కొందరు చేస్తున్న ప్రచారంలో  వాస్తవం లేదన్నారు. 

ఓ కులాన్ని లేదా ఒక వర్గాన్ని తక్కువ చేసి మాట్లాడే కుసంస్కారిని కాదన్నారు. కేవలం ఒక ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన ఒక నాయకున్ని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలకు ఎవరైనా బాధపడి ఉంటే ఆ మాటను ఉపసంహరించుకుంటున్నానని ప్రకటించారు. 

గిల్లడం సారి చెప్పడం అనేది మనకు బ్రిటిష్ వారి నుండి లభించిన ఆనవాయితి. కెటీఆర్ ఎంతగా వివరణ ఇచ్చుకున్నా విశ్వ బ్రాహ్మణులు మాత్రం ఆయన చులకన చేసి మాట్లాడిన మాటలు ఎలా మరిచి పోగల మంటూ మండిపడుతున్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు