మారిన జాతీయ చిహ్నం భావ రేఖలు - విపక్షాల అభ్యంతరాలు

  మారిన జాతీయ స్థూపం భావాలు
పార్లమెంట్ కొత్త భవణంపై గాండ్రిస్తున్న  సింహాల చిహ్నం


కొత్తగా నిర్మించిన పార్లమెంట్ భవణం పై ఏర్పాటు చేసిన జాతీయచిహ్నం అసలు రూపాన్ని మార్చివేసారని విమర్శలు వెల్లువెత్తాయి.  జాతీయ చిహ్నాన్ని ప్రధానమంత్రి  నరేంద్ర మోది ఆవిష్కరించారు. సారనాధ్ స్తూపం పై ఉన్న సింహాల రూపాన్ని జాతీయ స్థూపంగా అధికారికంగా గుర్తించారు. కరెన్సి నోట్లతో సహా ఇతరత్రా ఎక్కడ అధికారిక చిహ్నం ముద్రించినా ఏర్పాటు చేసినా సారనాధ్ లోని సామ్రాట్ అశోక చక్రవర్తి  ఏర్పాటు చేసిన సింహాల స్థూపాన్ని ప్రామాణికంగా తీసుకుంటున్నారు. కాని పార్లమెంట్ భవణం పై ఏర్పాటు చేసిన చిహ్నం సారనాధ్ స్థూపానికి భిన్నంగా ఉందనే అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. 

కాంస్యంతో తయారు చేసిన స్థూపాన్ని  ప్రధాన మంత్రి నరేంద్ర మోది సోమవారం  ఆవిష్కరించినప్పటి నుండి సోషల్ మీడియాలో వార్ నడుస్తోంది. అయితే కావాలనే కొత్తగా వివాదం తేవనెత్తేందుకు విపక్షాలు కుట్ర చేసాయని భారతీయ జనతా పార్టి శ్రేణులు విమర్షిస్తున్నాయి.

కొత్త పార్లమెంట్ భవనంపై ఏర్పాటు చేసిన జాతీయ చిహ్నాన్ని (Ashokan Lions) అపహాస్యం చేశారని తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు ప్రధాని నరేంద్ర మోదీపై విమర్శలు గుప్పించారు. గాంభీర్యంగా, నిబ్బరంగా ఉండాల్సిన విధంగా కాకుండా గర్జించే, దూకుడుగా కనిపించే సింహాన్ని పెట్టారని ఆరోపణలు చేశారు. ఇది మ‌న జాతీయ చిహ్నాన్ని అవ‌మానించ‌డమేనని, ఇది సిగ్గుచేటని... తక్షణమే ఈ చిహ్నాన్ని మార్చాలని రాజ్యసభ ఎంపీ జ‌వ‌హ‌ర్ సిర్కార్ డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా రెండు చిత్రాలను పోస్ట్ చేస్తూ "అసలు ఎడమ వైపున ఉంది. మనోహరమైనది, నమ్మకంగా ఉంది. కుడివైపున ఉన్నది మోడీ వెర్షన్, కొత్త పార్లమెంటు భవనం పైన పెట్టినది. మొరటుగా, అనవసరమైన దూకుడుగా..అసమానంగా ఉంది. సిగ్గు చేటు వెంటనే మార్చండి." అంటూ జవహార్ సిర్కార్ ట్వీట్ చేశారు. అలాగే గ‌త జాతీయ చిహ్నం, ప్ర‌స్తుత చిహ్నాన్ని ప‌క్క‌ప‌క్క‌న ఉంచిన ఫోటో ఇమేజ్‌ను లోక్‌సభ ఎంపీ మ‌హువా మొయిత్రా కూడ ట్వీట్ చేశారు.



అసలు స్థూపం లో ఉన్న సింహాల ముఖాలు ప్రశాంతంగా కనిపిస్తే కొత్తగా పార్లమెం్ట భవణంపై నిర్మించిన సింహాల ముఖాలు గాండ్రిస్తున్నట్లు కనిపిస్తున్నాయి. అసలు చిహ్నానికి కొత్త చిహ్నానికి  భావంలో చాలా భిన్నమైన సారూప్యతలు ఉన్నాయి.

జాతీయ చిహ్నాన్ని ప్రధాని ఆవిష్కరించడంపై  సీపీఎం, కాంగ్రెస్, ఎంఐఎంలు అభ్యంతరాలు లేవనెత్తాయి. స్పీకర్ చేతుల మీదిగా జరగాల్సిన ఆవిష్కరణను ప్రధాన మంత్రి నరేంద్ర మోది ఎట్లా చేస్తారని ప్రశ్నించారు.  ప్రధాన మంత్రి రాజ్యాంగ నిభందనలు ఉల్లంఘించారని ఆరోపించారు.

నూతన పార్లమెంటు భవనంపై జాతీయ చిహ్నమైన మూడు సింహాల గుర్తును ప్రధాని నరేంద్ర మోదీ ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. అయితే, ఈ నూతన మూడు సింహాల చిహ్నం సారనాథ్ లోని అశోకస్థూపంపై ఉన్న మూడు సింహాల గుర్తుతో ఏ మాత్రం పోలిక లేకుండా ఉందని కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ విమర్శించారు. సారనాథ్ లోని అశోకస్థూపంపై ఉన్న సింహాల స్ఫూర్తిని నూతన జాతీయ చిహ్నం కొంచెం కూడా ప్రతిబింబించేలా లేదని, పూర్తిగా విరుద్ధంగా ఉందని వ్యాఖ్యానించారు. జాతీయ చిహ్నానికి ఇది దారుణ అవమానం అని జైరాం రమేశ్ పేర్కొన్నారు. 

లోక్ సభలో కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ అధిర్ రంజన్ చౌదరి కూడా దీనిపై విమర్శలు చేశారు. "నరేంద్ర మోదీ గారూ ఓసారి ఆ సింహం ముఖం చూడండి. సారనాథ్ లోని మహోన్నత స్థూపంపై ఉన్న సింహానికి ప్రతినిధిలా ఉందా? లేకపోతే గిర్ అడవుల్లో తిరిగే సింహం ముఖాన్ని వక్రీకరించినట్టు ఉందా?" అంటూ వ్యంగ్యం ప్రదర్శించారు

కొత్త పార్లమెంట్ ప్రభుత్వ సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్‌ను టాటా ప్రాజెక్ట్సు నిర్మిస్తోంది.  




కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు