కాకతీయ వారసుడు కమల్ చంద్ర భంజ్ దేవ్ కు ఘనస్వాగతం పలికిన ఓరుగల్లు

 


 కాకతీయరాజుల వారసుడు కమల్ చంద్ర భంజ్ దేవ్ తన పూర్వీకులు రాజ్యం ఏలిన ఓరుగల్లు గడ్డపై గురువారం అడుగుపెట్టాడు. కాకతీయ సప్తాహోత్సవాల పేరిట వారం రోజుల పాటు జరిగే కాకతీయ ఉత్సవాల్లో భాగంగా కమల్ చంద్ర భంజ్ దేవ్ ను ప్రభుత్వం  ప్రత్యేక అతిథిగా ఆహ్వానించింది. 

భద్రకాళి అమ్మవారి ఆలయ తోరణం వద్ద కమల్ చంద్ర భంజ్ దేవ్ కు మంత్రులు శ్రీనివాస్ గౌడ్, సత్యవతి రాథోడ్, చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధి హనుమంతు, కుడా చైర్మన్ సంగం రెడ్డి సుందర్ రాజ్, మేయర్ గుండు సుధారాణి, పోలీస్ కమీషనర్ తరుణ్ జోష్ తదితరులు ఘనస్వాగతం పలికి ఆలయం వరకు ఊరేగింపుగా తీసుకు వెళ్లారు. భద్రాకాళి ఆలయంలో కమల్ చంద్ర భంజ్ దేవ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భద్రకాళి సరస్సు గట్టున మొక్కలు నాటారు.

చారిత్రక ఖిలా వరంగల్ సందర్శించారు. గుర్రం బగ్గీపై భంజ్ దేవ్ ను ఖిల్లా వీధుల గుండా ఊరేగించారు. భంజ్ దేవ్ ను తిలకించేందుకు జనాలు ఆసక్తి చూపారు. కాకతీయుల వారసుడు ఎట్లా ఉంటాడో చూడాలని బారిలు దీరారు.

అనంతరం హన్మకొండ లోని వేయిస్తంభాల ఆలయం సందరర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అగ్గలయ్య గుట్ట మెట్ల దారిని సందర్శించారు.

తన పూర్వీకులు ఏలిన గడ్డకు రావడం తనకెంతో సంతోషం కలిగించిందని  కమల్ చంద్ర భంజ్ దేవ్ అన్నారు. కాకతీయు రాజులు ఎప్పుడు ప్రజల క్షేమం కోరే వారని రైతులు, కర్షకులు, ఆదివాసీలు, అన్ని వర్గాల ప్రజలు బాగుండాలని నీటి పారుదల రంగాలకు అత్యధిక ప్రాధాన్యత నిచ్చారని అన్నారు.  ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని భద్రకాళి అమ్మవారిని వేడుకున్నానని అన్నారు.



మూలాలతో కనెక్ట్ అవ్వడం..భావోద్వేగంగ ఉంది
భాంజ్ దేవుడు

సోషల్ మీడియాలో స్పందించిన వారసుడు

బస్తర్‌కు ఈరోజు చారిత్రాత్మకమైన రోజు. 1323లో, మన పూర్వీకుడు రాజా అన్నందేవ్ వరంగల్ నుండి బస్తర్ వైపు తరలి కొత్తగా రాజధాని ఏర్పాటు చేసుకుని  రాజ్యాన్ని విస్తరించాడు.
ఈ రోజు ఆ చారిత్రాత్మక సందర్భానికి 700 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం మరియు జ్యోతి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించే కాకతీయ వైభవం వేడుకలలో హైదరాబాద్ (వరంగల్)లో ఉన్నాను.
ఇక్కడికి వచ్చినప్పుడు, చాలా సుహృద్భావ వాతావరణంలో లభించిన ఘనమైన స్వాగతం చూసి నేను చాలా ఉప్పొంగిపోయాను. ఏది ఏమైనప్పటికీ, మీ మూలాలతో కనెక్ట్ అవ్వడం, మీ వ్యక్తుల మధ్య ఉండటం ఎల్లప్పుడూ చాలా భావోద్వేగంగా ఉంటుంది.

నమస్కారం వరంగల్! నమస్కారం బస్తర్!

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు