పోటా పోటీ ఫ్లెక్సీలకు జరిమాన

 బీజేపీకి రూ.20 లక్షలు, టీఆర్ఎస్‌కు రూ.3 లక్షలు దండగ

పోటా పోటీలతో నగరంలో ఫ్లెక్సీలు వేళ్లాడ దీసినందుకు టి ఆర్ ఎస్, బిజెపి పార్టీలు భారీ మూల్యం చెల్లించు కోవాల్సి వచ్చింది.  నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలకు భారీ జరిమానా విధించింది.  


బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల సందర్భంగ హైదరాబాద్‌లో రెండు పార్టీల మద్య  ఫ్లెక్సీల వార్ జరిగింది. టీఆర్ఎస్-బీజేపీ పోటాపోటీ ఫ్లెక్సీలు,హోర్డింగులతో నగరమంతా గులాబీమయంగా, కాషాయవనంగా మారింది. ప్రధాని మోదీ సహా సమావేశాలకు వచ్చే ముఖ్య నేతలకు స్వాగతం పలుకుతూ బీజేపీ నేతలు ఫ్లెక్సీలు, కటౌట్లు ఏర్పాటు చేశారు. అదే సమయంలో సాలు దొర సెలవు దొర అంటూ ఫ్లెక్సీలతో కేసీఆర్‌ను టార్గెట్ చేశారు.

బీజేపీకి కౌంటర్‌గా టీఆర్ఎస్ కూడా ఎక్కడి కక్కడ ఫ్లెక్సీలు, హోర్డింగ్స్ ఏర్పాటు చేసింది. మెట్రో పిల్లర్లు, బస్టాప్స్‌ను ఫ్లెక్సీలు, హోర్డింగ్స్‌తో నింపేసింది. తెలంగాణలో కేసీఆర్ పాలనలో సాధించిన ప్రగతిని చాటుతు.. అదే సమయంలో మోదీ పాలనా తీరును ఎండగట్టేలా సాలు మోదీ సంపకు మోదీ.. బైబై మోదీ స్లోగన్స్‌తో ఫ్లెక్సీలు వేలాడదీసారు. కొన్నిచోట్ల టీఆర్ఎస్ హోర్డింగులపై బీజేపీ కార్యకర్తలు మోదీ ఫోటోతో ఉన్న బ్యానర్లు అతికించారు. దీనిపై గులాబీ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి.

టీఆర్ఎస్-బీజేపీ మధ్య ఇలా ఫ్లెక్సీల పంచాయితి జరుగుతుండగా మరోవైపు జీహెచ్ఎంసీ జరిమానాలను విధించింది. నిబంధనలకు విరుద్దంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, హోర్డింగ్స్‌పై జరిమానాల జాబితాలు సిద్ధం చేసింది. ఇప్పటివరకూ బీజేపీకి రూ.20 లక్షలు, టీఆర్ఎస్‌కు రూ.3 లక్షలు జరిమానా విధించింది.ఫ్లెక్సీల జగడంపై సామాన్యుల నుండి విమర్షలు వచ్చాయి. దాంతో తమ పని తాము చేస్తున్నామంటు  జీహెచ్ఎంసీ ఎన్‌ఫోర్స్‌మెంట్, విజిలెన్స్ అధికారులు  జరిమానాలు విధించారు.కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు