ప్రధానికి ప్రశ్నలు సంధించిన కెసిఆర్

 


ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు ఒక్కటైనా పూర్తి చేశారా?.. చేస్తే ఏం చేశారో చెప్పండి?... నేను కాదు ప్రజలు అడుగుతున్నారంటు తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ప్రశ్నలు సంధించారు.

శనివారంహైదరాబాద్ కు వచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి సిఎంకెసిఆర్ ప్రోటోకాల్ మేరకు ఆహ్వానం పలకక పోగా  జలవిహార్ లో రాష్ట్ర పతి అభ్యర్థిగా పోటి చేస్తున్న యశ్వంత్ సిన్ఙాతో బహిరంగ సభ ఏర్పాటు చేశారు.

 సభా ముఖంగా కెసిఆర్ అనేక ప్రశ్నలు సందించారు. తన ప్రశ్నలకు మోది జవాబులు చెప్పాలన్నారు.

దేశీ బొగ్గుకు టన్ను రూ.4 వేలైతే 30 వేలు ఎందుకు పెట్టాలి? రూపాయి విలువ ఎందుకు దారుణంగా పడిపోతోంది? చైనా 16 ట్రిలియన్ డాలర్లు జీడీపీ సాధిస్తే మనకేమైంది? 5 ట్రిలియన్ డాలర్లు కూడా ఎందుకు సాధించలేకపోయారు? మేకిన్ ఇండియా ద్వారా ఏం సాధించారో చెప్పాలి? రైతు చట్టాల్ని ఎందుకు వెనక్కి తీసుకున్నారో చెప్పాలి? శ్రీలంకలో సేల్స్‎మేన్‎గా ఎందుకు మారారో చెప్పాలి? ఫియట్, పోర్డ్, హార్లీ డేవిడ్సన్ వంటి కంపెనీలు ఎందుకు వెళ్లాయని ప్రశ్నించారు.

మోదీ ఇచ్చిన హామీల్లో ఒక్కటీ నెరవేరలేదు. టార్చిలైట్ వేసి వెతికినా మోదీ హామీలు నెరవేర్చినట్లు కనిపించవు. వ్యవసాయంలో పెట్టుబడి ఖర్చులు భారీగా పెరిగాయి. డీజిల్ సహా అన్ని ధరలు విపరీతంగా పెంచేశారు. ఇవి చాలదన్నట్లు వ్యవసాయ చట్టాలు తెచ్చి రైతులను ఇబ్బంది పెట్టారు. వాటిపై రైతులు సుదీర్ఘంగా పోరాటం చేశారు. ఉద్యమంలో కొందరు రైతులు మృతి చెందారు. మృతి చెందిన రైతుల కుటుంబాలకు రూ. 3 లక్షలు అందించాం. వారికి సాయం చేస్తే భాజపా చులకనగా చూసింది. ఉద్యమిస్తున్న రైతులపై జీపుతో ఎక్కించారు. రైతు ఉద్యమకారులను ఉగ్రవాదులు అన్నారు. మోదీ పాలనలో దేశ ప్రతిష్ఠను మసకబారేలా చేశారు. ప్రభుత్వ వ్యవస్థలను దుర్వినియోగం చేశారు. రైతులు, సైనికులు, ఉద్యోగులు, నిరుద్యోగులు ఇబ్బంది పడుతున్నారు.

"మోదీ పాలనలో ఏ ఒక్కరూ సంతోషంగా లేరు.... ప్రధానిగా కాకుండా.. దేశానికి సేల్సీ గా మోదీ వ్యవహరిస్తున్నారు. మోదీ శాశ్వతంగా పదవిలో ఉంటానని అనుకుంటున్నారు. పదవులు ఎవరికీ శాశ్వతం కాదు.. మార్పు వచ్చి తీరుతుంది" అని కేసీఆర్ వ్యాఖ్యానించారు. శ్రీలంక చేసిన ఆరోపణలపై ప్రధాని మౌనమెందుకు?

“ద్రవ్యోల్బణం పెరిగింది.. జీడీపీ పడిపోయింది. మోదీతో నాకు ఎలాంటి వ్యక్తిగత విభేదాలు లేవు. శ్రీలంక విషయంలో స్పందించకుంటే దోషిగానే చూడాల్సి వస్తుంది. మోదీ తీరుతో శ్రీలంక ప్రజలు నిరసనలు తెలిపారు.

శ్రీలంకలో మోడీ మిత్రుడి కోసం పవర్ ప్రాజెక్టు కట్టబెట్టేందుకు సేల్స్ మెన్ గా దిగజారిపోయారన్నారు. అమెరికా అధ్యక్షుడి ఎన్నికలో హోస్టన్ కు వెళ్లినప్పుడు అబ్‎కీ బార్ ట్రంప్ సర్కార్ అంటూ చతికిలపడ్డారని అదేమైనా అహ్మదాబాద్ మున్సిపల్ ఎన్నికనా అక్కడ ఇండియా పరువు తీశారన్నారు. డాలర్ తో పోలిస్తే రూపాయి విలువ అధ్వానంగా ఎందుకు తయారైందో చెప్పాలన్నారు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు