బాబుకు తెలంగాణలో తగ్గని ఆదరణ

అర్దరాత్రి వరకు బాబు కోసం ఎదురు చూసిన జనం

తెలంగాణ అభివృద్దికి ఎంతో చేశామన్న బాబు

జీనోమ్ వ్యాలీతో హైదరాబాద్ కు  బ్రాండ్ ఇమేజ్

 

భద్రాచలం కరకట్ట వద్ద బాబుచాలా కాలం తర్వాత తెలుగు దేశం పార్టి అధి నేత చంద్రబాబు నాయుడు తెలంగాణ లో గురు, శుక్రవారం (జూలై 28,29 )రెండు రోజుల పాటు పర్యటించారు.  ఆంధ్ర, తెలంగాణ వరద ముంపు ప్రాంతాల సందర్శనలో భాగంగా రెండు రాష్ట్రాల సరిహద్దు గ్రామాలలో ఆయన పర్యటన సాగింది. చంద్రబాబు నాయుడు వస్తున్నాడని తెల్సి అర్ద రాత్రి అయినా ఆయన రాక కోసం ఎదురు చూశారు. పోలవరం ముంపు గ్రామాల్లో పర్యటించిన అనంతరం బూర్గం పాడు నుండి భద్రాచలం చేరుకున్నాడు. ముత్తగూడెం వద్ద తెలుగుదేశం తెలంగాణ అధ్యక్షుడు బక్కని నరసింహులు, ఇతర నేతలు పార్టీ అధినేతకు స్వాగతం పలికారు. ఖమ్మం జిల్లా సత్తుల్లిలోనూ పార్టీ నాయకులు, అభిమానులు ఘన స్వాగతం పలికారు.  పర్యటనలో బాగా అలిసిపోయి నప్పటికి చంద్రబాబు నాయుడు తన రాక కోసం ఆర్ద రాత్రి వరకు వేచి ఉన్న జనాలను చూసి కాన్వాయ్ నిలిపి వారితో కొద్ది సేపు మాట్లాడారు. తెలంగాణ ప్రాంతానికి తెలుగు దేశం హయాంలో చాలా చేశామని అన్నారు. ఎన్టీఆర్ ను తెలుగు ప్రజలు ఎన్నటికి మరిచి పోలేరని ఆయన పేరు చరిత్రలో నిలిచి పోయిందని అన్నారు. భద్రాచలం ఐటిసి కర్మాగారానికి ఎంతో ప్రాత్సాహం ఇచ్చామని అట్లాగే సింగరేణి అభివృద్దికి కూడ తోడ్పాటు నందించామని జీనోమ్ వ్యాలీతో హైదరాబాద్ కు  బ్రాండ్ ఇమేజ్ తెలుగు దేశం పాలనలోనే వచ్చిందని అన్నారు.  శుక్రవారం ఉదయం భద్రాద్రి అలయాన్ని సందర్శించారు.  అనంతరం కరకట్ట సందర్శించారు. 20 ఏండ్లక్రితం కరకట్ట నిర్మించామని కరకట్ట కారణంగానే భద్రాచలంకు భారి ముంపు తప్పిందని అన్నారు.ఎటపాక, కూనవరం, విఆర్ పురం మండలాల్లోని తోటపల్లి, కోతులగుట్ట, కూనవరం, రేఖపల్లి ప్రాంతాల్లో  పర్యటించి మంపు గ్రామాల ప్రజలను పరామర్శించారు. ముంపు గ్రామాలప్రజలను సిఎం జగన్ గోదాట్లో ముంచేసాడని చంద్రబాబు నాయుడు విమర్శించాడు. 


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు