లండన్ లో ఘనంగా పోచమ్మ బోనాల సంబరాలు - వరంగల్ ఎన్ ఆర్ ఐ ఫోరం

ప్రత్యేక అతిథిగా హాజరైన ఈస్ట్ హామ్  ఎంపీ స్టీఫెన్ టిమ్స్
బోనాల పండగలో స్పెషల్ - హైదరాబాద్ దర్బార్ రెస్టారెంట్ బిర్యాని 
ఆడిపాడిన వరంగల్ ఎన్ఆర్ ఐలు





ఈస్ట్ హామ్ ఈస్ట్ లండన్ మహానగరం లో  తెలంగాణ సంస్కృతిని చాటే పోచమ్మ బోనాలు వరంగల్ ఎన్నారై ఫోరమ్ ఆధ్వర్యం లో కన్నుల పండుగగా ఘనంగా నిర్వహించారు.

వరంగల్ ఎన్నారై ఫోరం అధ్వర్యంలో నిర్వహించిన పోచమ్మ బోనాలకు మహాలక్ష్మి మందిరంలో ప్రత్యేకమైన పూజలు నిర్వహించారు.  బోనమెత్తిన వరంగల్ ఆడపడుచులు  శ్రీ మహాలక్ష్మి ఆలయం నుండి ఈస్ట్ హామ్ పురవీధుల గుండా బోనాలు ప్రదర్శిస్తు టౌన్ హాల్ వరకు తరలి వచ్చారు.

ఈ  కార్యక్రమంలో సుమారు 1500   ఎన్నారై లు పాల్గొన్నారు. వరంగల్ ఎన్ ఆర్ ఫోరం లండన్ - యుకె అధ్యక్షులు శ్రీధర్ నీల, వ్యవస్తాక అధ్యక్షులు కిరణ్ పసునూరి అధ్వర్యంలో  పోచమ్మ బోనాలుఘనంగా నిర్వహించారు.



ఈ కార్యక్రమానికి ముఖ్య అథితిగా ఈస్ట్ హామ్ ఎంపీ స్టీఫెన్ టిమ్స్, లండన్ కన్జర్వేటివ్ కౌన్సిలర్ సబ్యుడు ఉదయ్ అరేటి, ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వీరితో పాటు  10 మంది లోకల్ కౌన్సిలర్లు కూడ హాజరై బోనాల పండగ తిలకించారు. 

ఎంపి  స్టీఫెన్ టిమ్స్ ప్రసంగిస్తూ వరంగల్ ఎన్నారై ఫోరమ్ నిర్వహిస్తున్న  అనేక స్వచ్ఛంద కార్య క్రమాలను గుర్తుచేసి అభినందించారు. వరంగల్ నగరంలో లూయీ పాచ్య్యర్ అంధుల

 పాఠశాల దత్తత తీసుకోవడం ఫై హర్షం వ్యక్తం చేసారు వరంగల్ ఎన్నారై ఫోరమ్ సబ్యులు తమ మాతృభూమి సంస్కృతి సాంప్రదాయాలను మర్చిపోకుండా తమ సంతతికి పరిచయం చేయడం చాలా గర్వంగా ఉందని కొనియాడారు. 



భారత సంతతి ఎన్ఆర్ ఐ లండన్ కన్జర్వేటివ్ మెంబర్ ఉదయ్ ఏరేటి  ప్రసంగిస్తూ భారతీయ  హిందూ ధర్మం చాలా విశిష్టమైందని అందులో భాగంగా విదేశాల్లో  బోనాల పండుగను కన్నుల పండుగగా  నిర్వహించి నందుకు  అభినందనలు తెలిపారు. 

ఈ కార్యక్రమాల్లో బ్రిటన్ కి చెందిన మేలిసా అనే యువ సైంటిస్ట్ భారతదేశం లో  హిందూ ధర్మం  పండుగల  ప్రాముఖ్యత గొప్పతనాన్ని  తన మాట పాటలు మరియు నృత్యం ద్వారా ప్రదర్శించి అందరిని అకట్టుకున్నారు.

ఎన్ ఆర్ ఐ ఫోరం అధ్యక్షులు   శ్రీధర్ నీల, వ్యవస్థాపక అధ్యక్షులు కిరణ్ పసునూరి, ప్రధాన కార్యదర్శి నాగ ప్రశాంతి, వైస్ ప్రెసిడెంట్ జయంత్ వద్దిరాజు ,ఉపాధ్యక్షులు భాస్కర్ పిట్టల,  వంశీ మునుగంటి , ఈస్ట్ లండన్ ఇంచార్జి మధు వంగర, జాయింట్ సెక్రటరీప్రవీణ్ బిట్ల, నిఖిల్ రాపోలు ,భాస్కర్  నీల , విశ్వనాధ్ కొక్కొండ . దినేశ్ లింగ బత్తిని , భాస్కర్ మామిడి శెట్టి,  యశ్వంత్ నూక, శ్రీనివాస్ మునిగోటి,   మహిళా విభాగం ప్రతినిదులు  రజిత గుండు , మంజుల పిట్టల తదితరులు పాల్గొన్నారు.



కార్యక్రమంలో సుమారు ౩౦ మంది ప్రాంతీయ కళాకారులూ భారతీయ సాంస్కృతిక ప్రదర్శనలు ఇచ్చారు.   భారత నాట్య ప్రదర్శనలతో పాటు నాటకాలు , నృత్యాలు ప్రదర్శించి అలరించారు.  చిన్న పెద్ద తర తమ భేదం లేకుండా అందరూ మనస్సు విప్పి  ఒడిశిపోని ముచ్చట్లతో  కంచి కి చేరని కథనాలు చెప్పుకుని ఉర్రూతలూగించే పాటలతో మై మరిచి పోయారు. 

బోనాల పండగ సంబరాల సందర్భంగా హైదరాబాద్ కు చెందిన దర్బార్ రెస్టారెంట్ అప్టన్ పార్క్ లండన్ నిర్వాహకులు రమేశ్, వెంకట్ ఎన్ఐలందరికి ఉచితంగా చికెన్ బిర్యాని వడ్డించారని వారికి ఎన్ఆర్ ఐ లండన్ ఫోరం అధ్యక్షులు శ్రీధర్ నీల ఫోరం సబ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

 తెలంగాణ కు చెందిన చేనేత వస్త్రాల స్టాల్ల్స్, జవెలెరీ , ఫోటో ఎగ్జిబిషన్  నిర్వహించారు . పోతరాజు విన్యాసం  ప్రదర్శనలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. 



తమ అద్భుత మైన పాటలతో ఆకట్టుకున్న గాయకులు స్వాతిరెడ్డి, కారుణ్యలను ఆవార్డులతో సత్కరించారు. కారుణ్యకు లండన్ నైటింగేల్ ఆవార్డును అట్లాగే స్వాతి రెడ్డికి లండన్ గాన కోకిల ఆవార్డులను ఇచ్చి సత్కరించారు.



ఒకే వేదిక మీద దాదాపు 1500 మంది వరంగల్ ఎన్ ఆర్ ఐలు, స్నేహితులను , బంధువులనను కలుసుకోవడంతో అందరూ వరంగల్ లోనే ఉన్నట్లు అనుభూతిక పొందారు.  బోనాల పండుగ నిర్వహణ ఏర్పాట్లు  ఘనంగా చేసిన కోర్ టీం సబ్యులను పేరు పేరునా అధ్యక్షులు శ్రీధర్ నీల, వ్యవస్థాపక అధ్యక్షులు  కిరణ్ పసునూరి అభినందించారు. ఆహుతులు కూడ వారికి ప్రత్యేక అభినందనలుతెలిపారు. 







కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు