ప్రారంభమైన బిజెపి కార్యవర్గ సమావేశాలు
హెచ్‌ఐసీసీలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ప్రధాని మోదీ, అమిత్‌షా, నడ్డా, జాతీయ నేతలు హాజరయ్యారు. హైదరాబాద్ చేరుకున్న ప్రధానికి గవర్నర్ తమిళసై.. ప్రభుత్వం నుంచి మంత్రి తలసాని..పార్టీ నేతలు స్వాగతం పలికారు. బేగంపేట నుంచి హెలికాప్టర్ లో హెచ్ఐసీసీ కి చేరుకున్నారు. ఆ వెంటనే సమావేశాలకు హాజరయ్యారు. పార్టీ జాతీయాధ్యక్షుడు నడ్డా సమావేశాలను ప్రారంభించారు. తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రధానితో సహా నడ్డా కు స్వాగతం పలికారు. హైదరాబాద్ లో దిగిన వెంటనే ప్రధాని మోదీ తాను డైనమిక్ సిటీకి వచ్చానంటూ ట్వీట్ చేసారు. పార్టీ కార్యవర్గ సమావేశాలకు హాజరవుతున్నట్లు వెల్లడించారు.బేగంపేట నుంచి హెలికాప్టర్ లో హెచ్ఐసీసీ కి చేరుకున్నారు. ఆ వెంటనే సమావేశాలకు హాజరయ్యారు. పార్టీ జాతీయాధ్యక్షుడు నడ్డా సమావేశాలను ప్రారంభించారు. తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్.కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రధానితో సహా నడ్డా కు స్వాగతం పలికారు.
కార్యవర్గ సమావేశాలను బిజెపి నేతలు కీలకంగా భావిస్తున్నారు. 2024 లో మూడో సారి అధికారం నిలుపు కోవడంతో పాటు దక్షిణాది రాష్ట్రాలలో పట్టు సాధించేందుకు అనుసరించ బోయే వ్యూహాలను చర్చించనున్నారు. ఇక, ప్రత్యేకించి తెలంగాణలోనూ పార్టీ బలోపతం పైన మార్గనిర్దేశనం చేయనున్నారు.
జేపీ జాతీయ కార్యవర్గ సమావేశంలో కీలక అంశాలపై చర్చించారు. పార్టీ ఆర్థిక తీర్మానాన్ని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రవేశపెట్టారు. పార్టీ ఖర్చులు, ఆస్తులు విరాళాలపై చర్చించారు. రానున్న అసెంబ్లీ ఎన్నికలపై నేతలు చర్చించారు. గుజరాత్, కర్ణాటక రాష్ట్రాల్లో పార్టీ పరిస్థితిపై సమీక్ష చేశారు.
0 కామెంట్‌లు
Please Do not enter any spam link in the comment box