ఖాకీ కీచక పర్వం -మహిళపై అత్యారం

 హైదరాబాద్ లో కీచక పోలీస్ దారుణం

మహిళను కిడ్నాప్ చేసి అత్యాచారం

భర్తపైనా దాడి చేసి న సిఐ

భార్యభర్తల చేతుల్లో గంజాయిపాకెట్లు పెట్టి ఫోటోలు

కేసు నమోదు - సిఐ ని సస్పెండ్ చేసిన ఉన్నతాధికారులుహైదరాబాద్ లో ఓ పోలీస్ అధికారి దారుణానికి ఒడిగట్టాడు. రక్షణగా నిలవాల్సిన అధికారే నేరస్తుడిగా మారి ఓ మహిళను  కిడ్నాప్ చేసి అచ్యారానికి పాల్పడ్డాడు. మహిళ భర్తపై దాడిచేసి గాయపరిచాడు. చేతుల్లో గంజాయి పాకెట్లు పెట్టి ఫోటోలు తీసాడు.

నగరంలోని మారేడ్ పల్లి పోలీస్ స్టేషన్ లో ఇన్స్ పెక్టర్ గా పనిచేస్తున్న నాగేశ్వర్ రావు  మహిళను కిడ్నాప్ చేసి నగరం శివారులో ఓ లాడ్డిలో ఆమెను భందించి అత్యాచారానికి పాల్పడ్డాడని భాదితు రాలు ఫిర్యాదు చేసారు.  భాదితురాలిని కారులో గుర్తు తెలియని ప్రదేశానికి తీసుకు వెళ్తుండగా ఇబ్రహీంపట్నం దగ్గర కారు ప్రమాదానికి గురైంది. దాంతో ఆ మహిళ సిఐ  చెర నుండి తప్పించుకుని వనస్థలి పురం పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు ప్రాథమిక విచారణ జరిపి సిఐ పై కేసు నమోదు చేసారు.  సి.ఐ పై 452,372(6),307,448 సెక్షన్లతో పాటు  30  ఆర్ముడ్ ఆక్ట్ 1959 కింద కేసు నమోదు చేశారు. గతంలో బెదిరించి తనను తన భర్తను టాస్క్ ఫోర్స్ కార్యాలయానికి తీసుకు వెళ్లి హింసించి చేతుల్లో గంజాయి పాకెట్లుపెట్టి ఫోటోలు తీసారని ఆరోపించారు.  

పోలీసు శాఖకు తలవంపులు తెచ్చిన ఈ ఘటనపై ఉన్నతాధికారులు స్పందించారు. సిఐ నాగేశ్వర్ రావును సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారి చేశారు. నాగేశ్వ‌ర్ రావును విధుల నుంచి త‌ప్పిస్తూ సీపీ సీవీ ఆనంద్ ఉత్త‌ర్వులు జారీ చేశారు. బ‌క్రీదు, బోనాల పండుగ బందోబ‌స్తు దృష్ట్యా కార్ఖానా సీఐ నేతాజీని మారేడుప‌ల్లి ఇంచార్జీ సీఐగా సీవీ ఆనంద్ నియ‌మించారు.  సి.ఐ ని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు.కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు