పంతుళ్ల ఆస్తులపై విద్యాశాఖ వివాదాస్పద ఉత్తర్వులు



ఏటా ఆస్తుల వివరాలుప్రకటించాలని హుకూం

ఉపాధ్యాయుల ఆస్తులు వెల్లడించాలని తెలంగాణ సర్కార్ కీలక ఉత్తర్వులు జారి చేసింది. ఏదో ఒక చోట ఓ ఉపాధ్యాయుడు బడికి వెళ్లకుండా పాఠాలు చెప్పకుండా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి రాజకీయాలు నెరిపాడన్న ఒక్క సాకుతో మొత్తం ఉపాధ్యాయ వర్గాన్ని తప్పు పట్టే రీతిలో ఉత్తర్వులు ఉన్నాయన్న  విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కనీసం ఉపాధ్యాయ సంఘాలతో చర్చించకుండా ఏకపక్షంగా ఉత్తర్వులు జారి చేయడం పట్ల ఉపాధ్యాయ సంఘాలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. నల్గొండ జిల్లా దేవరకద్ర మండలం గుంటిపల్లి పాఠశాల ప్రధానోపాధ్యాయుడు జావీద్ పై వచ్చిన ఆరోపణలను పరిగణ లోకి తీసుకుని మొత్తం ఉపాధ్యాయ సమాజాన్ని నిందల పాలు చేయడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు. ఉపాధ్యాయ వృత్తి అంటే  లంచాలు పుచ్చుకుని   పాఠాలు బోధించేది కాదని ఎవరైనా విధులు విస్మరించి అక్రమాలకు పాల్పడితే నిఘా పెట్టి చర్యలు తీసుకోవడంలో ఎలాంటి అభ్యంతరాలు ఉండ బోవని అంటున్నారు. బడా తిమింగలాలను వదిలి పెట్టి ఉపాధ్యాయుల  స్థిర చర  ఆస్తులు    వివరాలు వెల్లడించాలని ఆస్తులు కొనాలంటే ముందస్తుగా అనుమతులు పొందాలని ఉత్తర్వుల్లో పేర్కొనడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.

ఉాపాధ్యాయ వృత్తికి సమాజంలో గౌరవ ప్రదమైన స్థానం ఉంది. మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అంటూ గురువులకు మాతాపితల స్థాయిని ఇచ్చిన సమాజం మనది. ఆలాంటి గురువులను అవమానించే రీతిలో  తెలంగాణ సర్కార్ ఉత్తర్వులు ఉన్నాయని ఉపాధ్యాయులు అవేదన వ్యక్తం చేస్తున్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు