మంటల్లో ఆహుతైన టాటా నెక్సాన్‌ ఈవీ

 


ఎలక్ట్రిక్ వాహనాల విషయంలో  డిమాండ్ ఓ వైపు పెరుగుతుంటే మరో వైపు  వాహనాలు తగలబడి భయాలు కూడ పెరుగుతున్నాయ. టూ వీలర్ వాహనాలు అనేకం ప్రమాదాలకు గురి కాగా తాజాగా ముంబై లో ఓ కారు మంటల్లో ఆహుతి అయింది. టాటా నెక్సాన్ ఇవి కారులో ఉన్ట్లు ఉండి మంటలు చెల రేగి వాహనం పూర్తగా కాలి పోయింది.  ఈ అగ్నిప్రమాదానికి గల కారణాలు  ఇంకా తెలియాల్సి ఉంది. అయితే ఈ ఘటనలో ఎలాంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అటు మంటలు చెలరేగిన నెక్సాన్ఈవీ యజమాని ఇప్పటికే టాటా మోటార్స్‌తో సహకరించడానికి అంగీకరించారు.  కారును ఇప్పటికే కంపెనీకి అప్పగించగా, దీన్ని  పూణేలోని టాటా ఆర్‌ అండ్‌ డీ కేంద్రానికి  తరలించారు.

నెక్సాన్‌ అగ్నిప్రమాదం  ఘటనపై  దర్యాప్తు ప్రారంభించినట్టు వెల్లడించింది టాటా మోటార్స్‌. ప్రస్తుతం వివరణాత్మక దర్యాప్తు జరుగుతోందనీ ప్రమాదానికి దారితీసిన అంశాలను గుర్తించిన  తర్వాత పూర్తి ప్రకటన చేస్తామని టాటా ప్రతినిధి తెలిపారు. 2020లో లాంచ్‌ చేసిన  టాటా నెక్సాన్‌ఈవీ విక్రయాలు 30 వేలకు పైగా నమోదయ్యాయి.  


కాగా ఓలా, ప్యూర్ఈవీ తదితర ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు బ్యాటరీల కారణంగా అగ్నిప్రమాదాలకు గురయ్యాయి. బ్యాటరీ నాణ్యత విషయంలో సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం ప్రమాదాలకు కారణమని నిపుణులు చెప్పారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు