అత్యాచార కేసులో ఆరుగురు అరెస్ట్

 హోం మంత్రి మనవడి ప్రమేయం లేదన్ని పోలీసులు

 బాలికతో అసభ్యంగా ప్రవర్తిండాన్న  ఆరోపణపై ఎమ్మెల్యే కుమారుడి అరెస్ట్ 

నిందుతులకు ఖఠిన శిక్షలు పడేలా పూర్తి సాక్షాధారాలు రొమేనియా బాలిక పై జరిగిన అఘాయిత్యం కేసులో పోలీసులు ఆరుగురిని అరెస్ట్ చేశారు. ఇందులో నలుగురు మైనర్లని తెలిపారు. కేసులో హోం మంత్రి మనవడి ప్రమేయం లేదని క్లీన్ చిట్ ఇచ్చారు. అయితే అతడి ప్రమేయం ఉన్నట్లు  ఆధారాలు చూపితే విచారిస్తామని చెప్పారు. ఎమ్మెల్యే కుమారుడికి అఘాయిత్యం కేసుతో సంభందం లేదని కాని బాలికతో కారులో అసభ్యంగా ప్రవర్తించినందుకు అరెస్టు చేశామని పోలీసులుతెలిపారు. 

మంగళవారం రాత్రి హైదరాబాద్  సిటి పోలీస్ కమీషనర్ సి.పి ఆనంద్ మీడియా సమావేశంలో నిందుతుల అరెస్ట్ వివరాలు వెల్లడించారు ప్రధాన నిందితుడు సాదుద్దీన్‌ మాలిక్‌ కాగా, మిగతా నలుగురు మైనర్లుగా పేర్కొన్నారు. అత్యాచారానికి ముందే కారు దిగి వెళ్లిపోయిన మరో మైనర్‌ను ఆరో నిందితుడిగా చేర్చినట్లు చెప్పారు. జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెంబర్‌ 44, పెద్దమ్మ గుడి వెనకాల ఇన్నోవా కారులో అత్యాచారం జరిగినట్లు వివరించారు. తొలుత ఓ మైనర్‌, ఆ తర్వాత ఇతర మైనర్లు, చివరగా సాదుద్దీన్‌ అత్యాచారానికి పాల్పడ్డాడని పేర్నొన్నారు. బాలిక మెడ, శరీరంలోని ఇతర భాగాలపై తీవ్ర గాయాలయినట్లు చెప్పారు.

మైనర్లను అనుమతించిన పబ్‌లపైనా చర్యలు తీసుకుంటామని సీపీ చెప్పారు. రాజకీయంగా ఎన్నో ఆరోపణల మధ్య అతి జాగ్రత్తగా కేసు దర్యాప్తు చేశామన్నారు. పోక్సో యాక్ట్‌ ఉన్నందున ప్రతి చిన్న విషయాన్ని క్షుణ్నంగా తనిఖీ చేస్తూ విచారించామన్నారు. 

మైనర్ బాలులకు వాహనాలు ఇచ్చిన వారి తల్లిదండ్రులపై కూడ పోలీసుల కేసులు నమోదు చేశారు. నిందుతులల సంఖ్య ఇంకా పెరిగే 

ఈ కేసులో నిందితులకు 20 ఏళ్ల కారాగార శిక్షతో పాటు ఉరి శిక్ష కూడ పడవచ్చని సిపి తెలిపారు. నిందితులు శిక్ష నుండి తప్పించుకోలేరని పూర్తి సాక్షాధారాలు సేకరించామని చెప్పారు. 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు