జూన్ 10 నుండి రాజ్ భవన్ లో గవర్నర్ ప్రజాదర్బార్

 


రాష్ట్రంలో ప్రజా సమస్యలు వినే వారు కరువయ్యారు.  ముఖ్యమంత్రి కెసిఆర్ కు ప్రజా సమస్యలు ఆలకించే ఓపిక లేదు. ప్రగతి భవన్ గేట్లు ప్రజల కోసం ఎన్నడూ తెరుచు కోలేదు.  ఎవరికి సమస్యలు విన్నవించాలో అర్దం కాని అయోమయ పరిస్థితి రాష్ట్రంలో నెల కొంది. ఈ నేపద్యంలో రాష్ట్ర గవర్నర్ ప్రజా దర్భార్ నిర్వహించేందుకు పూనుకున్నారు. జూన్ 10 నుండి ప్రజా దర్భార్ నిర్వహించాలని నిర్ణయించినట్లు రాజ్ భవన్ వర్గాలు తెలియ చేశాయి. ఈ నెల 10న ఉదయం 12 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ప్రజా దర్భార్ నిర్వహించనున్నారు. మహిళలకు సంభందించిన సమస్యలతో తొలి దదర్బార్ ప్రారంభం కానుంది. అప్పాయింట్ మెంట్ అవసరం అయిన వారు  040–23310521 నంబర్‌కు ఫోన్‌ లేదా  rajbhavan&hyd@gov.in ద్వారా సంప్రదించ వచ్చు.

ముఖ్యమంత్రి కెసిఆర్ కు రాష్ట్ర గవర్నర్ కు మద్య అంతరం పెరిగిన సమయంలో  గవర్నర్ నిర్వహించ తలపెట్టిన  ప్రజా దర్బార్ పై సర్వత్రా ఆసక్తి నెల కొంది. 

ముఖ్యమంత్రి కెసిఆర్ రాజ్ భవన్ వైపు కన్నెత్తి చూడటం లేదు. అంతే కాక గవర్నర్ ను ఏ మాత్రం లెక్క చేయడం లేదన్న విమర్శలు ఉ్ననాయి. గవర్నర్ పై  కోపంతో  బడ్జట్ సమావేశాల ప్రారంభంలో ఆనవాయితీగా కొనసాగే ప్రసంగాన్ని కూడ రద్దు చేశారంటే ఏ స్థాయిలో వివాదాలు నెల కొన్నాయో అర్దం చేసుకోవచ్చు. రాష్ట్రంలో ఉన్నతాధికారులు కూడ గవర్నర్ కు జవాబు దారిగా వ్యవహరించడం లేదు.  సిఎం కుమారుడు మంత్రివర్గంలో  ఉన్న కెటిఆర్ ఆయితే పలు మార్లు రాజకీయ విమర్శలు చేశాడు.  గవర్నర్ కూడ రాష్ట్రంలో  నెల కొన్న్ పరిస్థితులపై  ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ఫిర్యాదు చేసారు. 

వాస్తవానికి ప్రజా దర్బార్ గత రెండేళ్ల క్రతమే ప్రారంభించాలనవి గవర్నర్  నిర్ణయించగా కరోనా కారణంగా వాయుదా వేశారు. జూన్ నుండి నిర్వహించే ప్రజా దర్బార్ పట్ల ప్రజల స్పందన ఏ మేరకు  ఉంటుందో సమస్యలు ఏ మేరకు పరిష్కారం కానున్నాయో అధికారుల స్పందన జవాబు దారి తనం ఎట్లా ఉంటుందో ననే విషయాలపై ఆసక్తి నెల కొంది.కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు