అంబేడ్కర్ బౌద్ధ ధర్మాన్నే ఎందుకు స్వీకరించారు?



అంబేడ్కర్ బౌద్ధ ధర్మాన్నే

ఎందుకు స్వీకరించారు?

  
ఈ ప్రశ్న చాలా ముఖ్యమైనది.....
అందరూ తెలుసుకోవలసినది......
Dr అంబెడ్కర్ దృష్టిలో అసలు మతానికి ఎటువంటి లక్షణాలు ఉండాలని వాంచించాడో తెలుసుకుందాం.....


1.మతం అనేది శాస్త్రానికి అనుగుణంగా ( సైన్సు ) ఉండాలి.

2.మార్పుకు అనుగుణంగా ఉండాలి.

3.నీతిని ప్రభోదించేదిగా ఉండాలి.
      
4.సమానత్వం, స్వేచ్ఛ, సౌభ్రాతృత్వం అనే మానవీయ విలువలు కలిగినదిగా ఉండాలి.
     
5.హేతువుకు బద్ధమై ఉండాలి.
      
6.సత్యాన్ని ప్రబోధించేదిగా , సత్యాన్ని ప్రేమించేదిగా ఉండాలి.
       
7.పేదరికాన్ని సమర్దించకూడదు.
       
8.దౌష్టాన్ని, నేరాన్ని రూపుమాపుటకి దోహదపడతాయి.
        
9.మానవ జీవితాన్ని నడిపించే సాంఘిక శక్తిగా ఉండాలి.
        
10.మతం మనిషి కోసమే ఉండాలి.
         
11.ఆత్మ, మోక్షం, స్వర్గం నరకాలకు స్థానం ఉండకూడదు.
          
12.దేవుడికి స్థానం ఉండకూడదు.
   
పై లక్షణాలన్నీ బౌద్ధంలో ఉన్నట్లు డా: అంబెడ్కర్ గుర్తించాడు.సమత,కరుణ, ప్రజ్ఞను ప్రభోదించేది బౌద్ధమే.అదుకే బౌద్ధం స్వీకరించాడు.
ప్రపంచాన్ని ప్రభావితం చేసే మతాలు క్రైస్తవం, ఇస్లాం, బౌద్ధం. మిగతా  మతాలు మోక్షదాతలు ఉన్నారని ప్రబోధించాయి.బుద్ధుడు స్థాపించిన బౌద్ధమతం మాత్రం మార్గదాతనే కానీ మోక్షదాతను కాదని ప్రబోధించింది.తాను ప్రబోధించింది గుడ్డిగా నమ్మకుండా పరీక్షించుకొని ఆచరించాలని ప్రబోధించాడు.సత్యాన్ని సత్యంగాను , అసత్యాన్ని అసత్యంగా తెలుసుకో మన్నాడు.సమాజాన్ని ఐక్యంగా ఉంచడానికి ఒక నైతిక భావనగా మతం ఎంతో అవసరం అని బౌద్ధం భావించింది. అందుకే దానికి దోహదం చేసే బౌద్ధాన్ని స్వీకరించాడు అంబెడ్కర్. గౌతమ బుద్ధుని బోధనాల్లోని విశిష్ట లక్షణాలను అంబేద్కర్ ఈ  క్రింది విధంగా గుర్తించాడు.
  
1.స్వేచ్ఛా సమాజానికి మతం అవసరం.
    
2.ప్రతి మతమూ ఆచరించడానికి అర్హమైనది కాదు.
     
3.మతమనేది జీవిత సత్యాలకు సంబంధించినదై ఉండాలి.
      
4.ఆత్మ, స్వర్గం, నరకం వంటి సిద్ధాంతాలకు, ఊహాగానాలకు సంబంధించినది కాకూడదు.
        5.దేవుడిని మతానికి కేంద్రబిందువుగా చేయడం తప్పు.
      
6.ఆత్మకు విముక్తి కలుగచేయడం మతానికి కేంద్రబిందువుగా చేయడం తప్పు.
     
7.పశువులను బలి యివ్వడం అనేది మతానికి ప్రధాన విషయంగా చేయడం తప్పు.
    
8.నిజమైన మతం మనిషి హృదయాలలో వుంటుంది.శాస్తౄలలో కాదు.
    
9.మానవుడు, నీతి ఈ రెండు మాత్రమే మతానికి కేంద్రబిందువుగా వుండాలి.అలా కాని పక్షంలో ఆ మతం క్రూరమైన ఒక మూడ నమ్మకం మాత్రమే అవుతుంది.
   
10.నీతి అనేది కేవలం జీవిత దార్శికంగా ఉన్నంత మాత్రాన సరిపోదు.భగవంతుడనే వాడు  లేడు కాబట్టి నీతి మాత్రమే జీవితాన్ని శాసించేదిగా ఉండాలి.
    
11.ప్రపంచాన్ని పునర్మించి సుఖం సంతోషాలు కల్పించడమే మతం యొక్క లక్ష్యంగా వుండాలి కాని ప్రపంచ పుట్టుక దాని అంతం గురించి వివరించడానికి మాత్రం కాదు.
   
12.పరస్పరం ప్రయోజనాల మధ్య తలయెత్తుతున్న వైరుధ్యాల వల్లనే ప్రపంచంలో అశాంతి, దుఃఖం సంభవిస్తున్నాయి. అష్టాంగ మార్గం అనుసరించడం ఒక్కటి మాత్రమే ఈ శాంతిని, దుఃఖాన్ని ప్రారతోలడానికి సరైన మార్గం.
  
13.స్వంత ఆస్థి అనేది కొందరిని బలవంతులను చేసి మరి కొందరికి దుఃఖాన్ని కలిగిస్తుంది.
  
14.దుఃఖానికి కారణమౌతున్న మూల అంశాన్ని నిర్మూలించడం ద్వారా దుఃఖాన్ని తొలగించడం సమాజం యొక్క మంచి కోసం తప్పని సరి.
    
15.మానవులంతా  సమానులు.
     
16. మనిషిలోని ప్రజ్ఞను బట్టి మాత్రమే అతనుని గుర్తించాలి గాని పుట్టుకను బట్టి కాదు.
    
17. ఉన్నతమైన ఆదర్శాలు కలిగి ఉండటమే ముఖ్యం గాని ఉన్నత వంశంలో పుట్టడం కాదు.
    
18.అందరి పట్ల స్నేహభావం లేదా సోదరభావాన్ని  ఎన్నడూ విస్మరించకూడదు.చివరికి శత్రువు పట్లకూడా.
   
19. విద్యను అభ్యసించిడానికి ప్రతిఒక్కరికీ హక్కు ఉంది.బ్రతకడానికి మనిషికి ఆహారం ఎంత అవసరమో విద్యకూడా అంతే అవసరం.
  
20.సత్పృవర్తన లేని విద్య ప్రమాదకరమైనది.
    
21. ప్రశ్నించడానికి వీలుకానిదంటూ ఏదీ లేదు.ఎప్పటికీ ఒకే విధంగా ఉండేది కూడా ఏదీ ఉండదు.
    
22. దేనినీ అదే అంతిమంగా భావించరాదు.
    
23.ప్రతిదీ హేతువాదానికి నిలబడాలి.
    
24.శాశ్వతమైనదీ, సనాతనమైనదీ అంటూ ఏదీ లేదు.ప్రతీది మార్పు చెందవలసిందే.మానవుడు నిరంతరం మార్పుకు గురౌతూనే వుంటాడు.
  
25.సత్యంకోసం, ధర్మం కోసం కాకపోతే యుద్ధం చేయడం నేరం.
   
26.విజేతకు పరాజితుడి పట్ల కూడా నిర్వర్తించవలసిన  బాధ్యతలు వున్నాయి.
     ఇంతటి మహోన్నతమైన బోధనలు చేసిన వారు ప్రపంచంలో మరో మతబోధకుడెవ్వరూ లేడని డా: అంబెడ్కర్ "ప్రజల సామాజిక జీవనంలో ఎంతో అధునాతన సిద్ధాంతాలతో, ఎన్నో అంశాలను గ్రహించే బోధనలు చేసిన బుద్ధునితో, మనిషికి ఈ ప్రపంచంలో బ్రతికి ఉన్నప్పుడే మోక్షం కలుగ చేయాలి గాని, చనిపోయిన తరువాత స్వర్గం వాగ్ధానం చేయడానికి కాదని ప్రధానంగా కృషి చేసిన బుద్ధునితో పోల్చడానికి మరో మత బోధకుడు దొరకడం కష్టం". అని స్పష్టం చేసాడు.అందుకే డా: అంబెడ్కర్ 1956 అక్టోబర్ 14 న నాగపూర్ లో 6 లక్షల మంది అనుమాయలతో బౌద్ధం స్వీకరించాడు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు