ముగ్గురు అన్ లైన్ క్రికెట్ బెట్టింగ్ రాయుళ్ళ అరెస్ట్

  పెద్ద మొత్తంలో డబ్బు స్వాధీనంవరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో అన్ లైన్ ద్వారా బెట్టింగ్ నిర్వహిస్తున్న ముగ్గురు సభ్యుల ముఠాను టాస్క్ ఫోర్స్ మరియు కేయూసి పోలీసులు సంయుక్తంగా కల్సి మంగళవారం అరెస్టు చేసారు.


వీరిలో ఇద్దరు ప్రధాన బుకీలతో పాటు బెట్టింగ్ పాల్పడుతున్న ఒక నిందితుడు వున్నాడు. వీరి నుండి పోలీసులు 20 లక్షల 80వేల ఏడు వందల రూపాయల నగదుతో పాటు ఒక కారు, నాలుగు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.

పోలీసులు అరెస్టు చేసిన వారిలో 1. మాడిశెట్టి ప్రసాద్, తండ్రి పేరు వెంకటేశ్, వయస్సు 40, గోపాల్‌పూర్, హన్మకొండ జిల్లా 2. కోత్తురు రాజు, తండ్రి పేరు రామదాసు, మల్లంపల్లి, ములుగుజిల్లా, 3.బుర్ర నాగరాజు, తండ్రి పేరు స్వామి, పర్కాల, హన్మకొండ జిల్లాకు చెందిన వారు వున్నారు.

ఈ అరెస్ట్ కు సంబంధించి వరంగల్ పోలీస్ కమిషనరేట్ పోలీస్ కమిషనర్ డా. తరుణ్ బోషి వివరాలను వెల్లడిస్తూ పోలీసులు అరెస్టు చేసిన ప్రధాన బుకీ మాడి శెట్టి ప్రసాద్ కేయూసి పోలీస్ స్టేషన్ పరిధిలోని గోపాలపూర్ ప్రాంతంలోని వెంకటేశ్వర కాలనీలోని తన ఇంటిని అడ్డా మార్చుకోని మరో ప్రధాన బుకీ అయిన కొత్తూరు రాజు తో కల్సి గూగల్ ప్లే స్టోర్ లో అందుబాటులో వున్న క్రికెట్ బెట్టింగ్ యాప్ ద్వారా వచుట్టుప్రక్కల
ప్రాంతాల్లోని యువతను క్రికెట్ బెట్టింగ్ తో పాటు మూడు ముక్కల ఆటలో పాల్గొనే విధంగా ప్రోత్సహించేవాడు. నిందితులు రోజు వారి జరిగే అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ కు సంబంధించి వివరాలను బెట్టింగ్ రాయుళ్ళ సమాచారం అందిస్తారు. క్రికెట్ బుకీ బెట్టింగ్ రాయుళ్ళుకు అనుకూలంగా మ్యాచ్ ఫలితాలు వస్తే వారు పందెం పెట్టిన మొత్తానికి రెండింతలు డబ్బును బుకీ అందజేసేవాడు. ఈ క్రికెట్ బెట్టింగ్ వ్యవహారానికి సంబంధించిన లావాదేవిలు మొత్తం నిందితుడు గూగుల్ పే, ఫోన్ పేల ద్వారా నిర్వహించేవారు. ఈ బెట్టింగ్ వ్యవహారాన్ని గత కొద్ది కాలంగా రహస్యంగా నిర్వహిస్తున్నారు. ఈ బెట్టింగ్ వ్యవహారాన్ని మొత్తాన్ని నిర్వహిస్తునందుగాను ప్రధాన బుకీలకు ఐదు నుండి ఇరువై శాతం వరకు బెట్టింగ్ యాప్ సంస్థ కమీషను అందజేసేవారు. పోలీసులు అరెస్టు చేసిన ప్రధాన బుకీపై గతంలో కేయూసి పోలీస్ స్టేషన్లో రెండు కేసులు, హన్మకొండ పోలీస్ స్టేషన్లో ఒక కేసు నమోదు చేయడం జరిగింది.
ఈ క్రికెట్ బెట్టింగ్ పై పోలీసులకు సమాచారం రావడంతో టాస్క్ ఫోర్స్ ఇంచార్జ్ అదనపు డిసిపి వైభవ్ గైక్వాడ్ అధ్వర్యంలో టాస్క్ ఫోర్స్ పోలీసులు బెట్టింగ్ నిర్వహిస్తున్న మామూనూర్ ప్రాంతంలో ఆకస్మిక దాడులు నిర్వహించి నిందితులు అరెస్టు చేసారు. అరెస్టు చేసిన నిందితులను తదుపరి విచారణ నిమిత్తం టాస్క్ ఫోర్స్ పోలీసులు కేయూసి పోలీస్ స్టేషన్‌కు అప్పగించి కేసులను నమోదుచేయించారు. ఈ క్రికెట్ బెట్టింగ్ ముఠాను పట్టుకోవడంలో ప్రతిభ కనబరచిన అదనపు డిసిపి వైభవ్ గైక్వాడ్, టాస్క్ ఫోర్స్ ఇన్ స్పెక్టర్లు,శ్రీనివాస్ జీ సంతోష్.ఎస్.వి లవణ్ కుమార్, కెయూసి ఎస్.ఐ సంపత్, ఏఏఓ సల్మాన్‌షా, టాస్క్ ఫోర్స్ హెడ్ కానిస్టేబుళ్ళు సోమలింగం, మాధవరెడ్డి, స్వర్ణలత, కానిస్టేబుళ్ళు రాజేష్, ఆలీ, బిక్షపతి, శ్రీను, రాజు, శ్రవణ్ కుమార్, హోంగార్డ్ విజయ్ లను పోలీస్ కమిషనర్ అభినందించారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు