అస్సాం ప్రజల మెప్పు పొందిన ఐఏఎస్ అధికారి కీర్తి జల్లి

 


అస్సాం లో పనిచేస్తున్న  తెలంగాణ బిడ్డ ఇండియన్ సివిల్ సర్వీసెస్ అధికారిణి  కీర్తి జల్లి  తన సేవల ద్వారా గ్రామీణుల ప్రశంసలు అందుకున్నారు. అస్సాంలో భారి వర్షాల కారణంగా కాచర్ అనే జిల్లాలో వరదలు పలు గ్రామాలను ముంచెత్తాయి. డిప్యూటి కమీషనర్ హోదాలో పనిచేస్తున్న కీర్తి జల్లి వరద ముంపు గ్రామాలకు వెళ్లి సహాయక చర్యలతో అక్కడి ప్రజలను ఆదుకుంది. చీరకట్టులో అధికారిణి వరదమయం,  బురద మయంగా మారిన గ్రామాలలో తిరిగి ప్రజల ఇబ్బందులు తెల్సుకుని తక్షణ సహాయక చర్యలు చేపట్టడంతో  గ్రామస్తులు ప్రశంసిస్తున్నారు. ఎన్నడూ ఉన్నతాధికారులను చూడని మారు మూల గ్రామాల వారు ఈ అధికారి తమ గ్రామంలోకి వచ్చి అందరిని పలుకరించి సమస్యలు తెల్సుకోవడం వారికి ఎంతో ఆనందం కలిగించింది. ఆమె పర్యటన ఫోటోలు తీసి సోషల్ మీడియాలో  ల పంచుకుని ప్రశంసలు తెలియ చేశారు. 

కొద్ది రోజుల క్రితం  స్టేడియంలోకి తన పెంపుడు కుక్కతో వాకింగ్ కోసం వెళ్లిన ఓ ఐఏఎస్ అధికారి స్టేడియం మత్తాన్ని ఖాలి చేయించిన వార్త చూసి ఇలాంటి అధికారులు కూడ ఉంటారా అని జనం ఆశ్చర్యం వ్యక్తం చేశారు.  ఓ ఐఏఎస్ అధికారిణి అయిన జల్లి కీర్తి ప్రజా సేవకు ప్రాధాన్యత నిచ్చి వరద ప్రాంతాలను సందర్శించి వారికి అవసరం అయిన సహాయక చర్యలు చేపట్టి అధుకోవడం చూసి అదికారులు అంటే ఇట్లా ఉండాలని అభినందనలు తెలియ చేససారు.  


అస్సాంలోని కాచర్ జిల్లాలో వరదలు తీవ్ర ప్రభావం చూపాయి. జిల్లావ్యాప్తంగా 259 సహాయ శిబిరాలు ఏర్పాటు చేసి  54,000 మందికి పైగా ప్రజలకు  ఆశ్రయం కల్పించారు. బోర్‌ఖోలా డెవలప్‌మెంట్ బ్లాక్‌తోపాటు పలు గ్రామాలను  కీర్తి జల్లి  సందర్శించారు.  బురద మయం అయిన  ప్రాంతాలలో కాళ్లకు చెప్పులు లేకుండా నడవడం చూసి ఆయా గ్రామాల ప్రజలు సెల్ ఫోన్లలో ఫోటోలు తీసి ఆమెతో సెల్ఫీలు దిగుతూ సంబరపడిపోయారు. 

ఈ సందర్భంగా కీర్తి జల్లి మాట్లాడుతూ లోతట్టు ప్రాంతాలను సందర్శించి వాస్తవ సమస్యలను అంచనా వేయాలని తాను స్వయంగా సందర్శించి పరీశీలించానని అన్నారు. క్షేత్ర స్థాయి పరిశీలన  అనేది ఎంతో ఉపయోగపడుతుందని  జిల్లా యంత్రాంగం వరదల నివారణకు ముందు ముందు చేపట్టే కార్యాచరణకు  ఉపకరిస్తుదని అన్నారు.  

గత 50 సంవత్సరాలుగా తాము ఇదే సమస్యను ఎదుర్కొంటున్నామని స్థానిక ప్రజలు  ఆమెకు వివరించారు. ఇప్పటి వరకు ఏ అధికారి తమ వద్దకు వచ్చి సమస్యలు తెల్సుకోలేదని మీరే మొదటి సారిగా తమ గ్రామాలకు వచ్చారని  వారు చెప్పారు.   ఉధృతంగా ప్రవహించే బరాక్ నది వరదల వల్ల ప్రతి ఏటా వరద సమస్య తలెత్తి నష్టం సంభంవిస్తోంది. భవిష్యత్ లో వరద నష్టం చాలా వరకు తగ్గించేందుకు అవసరం అయ్యే చర్యలుచేపడతామని ఆమె తెలిపారు.  జిల్లా డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ ఇచ్చిన నివేదిక మేరకు ఈ సంవత్సరం 291 గ్రామాలలో వరద నష్టం జరిగింది.  163,000 మంది ప్రజలు వరదల బారిన పడ్డారు. కాచర్లలో 11,200 ఇళ్లు దెబ్బతినగా, 5,915 హెక్టార్లలో పంట నీట మునిగింది.

కార్తి జల్లి ఎన్నికల  సమయంలో ప్రజలకు ఓటుహక్కు విషయంలో మంచి అవగాహన కల్గిగించినందుకు రాష్ట్ర పతి చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. రక్త హీనతో బాధపడిన పిల్లలకు తల్లులకు ప్రత్యేకంగా ఆహారం అంద చేసి ప్రశంసలు అందుకున్నారు. కరోనా మహమ్మారి విజృంభించిన సమయంలో వివాహం ఈమె వివాహం జరగంది.  విధులకు అటంకం కలుగ కూడదని ఆడంబరాలకు వెళ్లకుండా సాదా సీదాగా పెండ్లి చేసుకుని సెలవు తీసుకోకుండా  విధులు నిర్వహించారు.

కీర్తి జల్లి ది తెలంగాణ రా ష్ట్రం  లోని హైదరాబాద్ నగరం. ఆమె వరంగల్ నిట్ లో విద్యాభ్యాసం చేశారు. 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు