ఆచార్యకు తెలంగాణ సర్కార్ వెసులు బాటు

 


మెగాస్టార్ చిరంజీవి నటించిన ఆచార్య మూవీకి తెలంగాణ సర్కార్ వెసులుబాటు కల్పించింది. టికెట్ల ధరలు పెంచుకునేందుకు అనుమతి ఇచ్చింది. మల్టిఫ్లెక్స్ ధియేటర్లతో పాటు ఎసి థియేటర్లలో టికెట్ల ధరలు పెరగనున్నాయి. ఆచార్య సినిమాపై మెగాస్టార్ అభిమానులు భారి అంచనాలు పెట్టుకున్నారు. చిరంజీవి తనయుడు రాం చరణ్ ఈ సనిమాలో తండ్రితో కల్సి అభిమానులకు కనువిందు చేయనున్నాడు.  కొరటాల శివ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ సినిమా ఏప్రిల్ 29 న విడుదల కానుంది.  ప్రమోషన్స్ వర్క్ లో సినిమా బృందం బిజీగా ఉంది. సినిమాకు టికెట్ల ధరలు పెంచుకునే వెసులు బాటు కల్పించాలని చెసిన విజ్ఞప్తి మేరకు తెలంగాణ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.


సినిమా వుడుదల అయ్యే రోజు 29 నుండి మొదలు మే 5 వరకు ధరలు పెంచుకునేందుకు వెసులుబాటు కల్పిస్తూ ప్రభుత్వం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.  ఈ ఉత్తర్వుల మేరకు ఒక్కో టికెట్ పై మల్టీఫ్లెక్స్‌లో రూ.50, సాధారణ ఏసీ థియేటర్లలో అయితే రూ.30 పెంచుకోవచ్చు. అంతేకాకుండా నాలుగు షోలకు అదనంగా ఐదో షో వేసుకునేందుకు కూడ అనుమతులు ఇచ్చారు. ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కథను మలుపు తిప్పే సిద్ధ అనే స్టూడెంట్ లీడర్ పాత్రలో కనిపించనున్నాడు. తండ్రి తనయులైన చిరంజీవి, రామ్ చరణ్ పూర్తి స్థాయి  హీరోలుగా నటిస్తోన్న ఫస్ట్ మూవీ కావడంతో ఈ సినిమా కోసం అభిమానులు చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు