గవర్నర్ల వ్యవహార తీరుపై మండిపడ్డ కెసిఆర్


 గవర్నర్ల వ్యవహార తీరుపై తెలంగాణ సిఎం కెసిఆర్ పార్టి ప్లీనరీలో  విమర్శలు చేశారు. బిజేపి యేతర రాష్ట్రాలలో గవర్నర్లు వ్యవహరిస్తున్న తీరును తుర్పార పట్టారు.

 గతంలో జరిగిన ఘటనలతో పాఠాలు నేర్చుకోకుండా పాత పద్దతిలోనే వ్యవహరించడం సరైంది కాదని అన్నారు. గవర్నర్లు రాజ్యాంగానికి వ్యతిరేకంగా పని చేస్తున్నారా లేక రాజ్యాంగానికి కట్టుబడి పని చేస్తున్నారా అని  ప్రశ్నించారు.

"దేశంలో గలీజు రాజకీయాలు నడుస్తున్నాయి... ఈ దేశంలో అనేక మంది మంచి  రాజకీయ నాయకులు ఆచరించి చూపెట్టారు.. మహారాష్ట్ర, తమిళనాడు, బెంగాల్, కేరళలలో గవర్నర్లతో పంచాయితీ. 

 స్వర్గీయ ఎన్.టి.రామారావు గారు నిష్కల్మషంగా ప్రజలకు ఏదన్నా మంచి చేద్దామని పార్టీ పెట్టారు. ఆ రోజు యువకులుగా మేము ఆ పార్టీలో పని చేరాం. ఎటువంటి కిరికిరి లేకుండా 200 మంది ఎమ్మెల్యేలతో ఆయన అధికారంలోకి వచ్చారు.  ఇదే దుర్మార్గమైన గవర్నర్ల వ్యవస్థను వినియోగించి ఆయనను పదవి నుంచి తొలగించారు.  తెలుగు ప్రజలు కాంగ్రెస్ మెడలు వంచి మళ్ళీ ఎన్.టి.రామారావును తిరిగి నియమించేదాకా పోరాడారు.  ఎన్.టి. రామారావు ను తొలగించిన గవర్నర్ అవమానపడి ఇక్కడి నుంచి తొలగించబడ్డాడు. దాన్నుంచి దేశం గుణపాఠం నేర్చుకోవాలి కదా.  దీనికి ఉల్టాగా నేడు దేశంలో ఏ జరుగుతోంది.  నేడు దేశంలో రాజ్యాంగ సంస్థల గతి ఏమవుతుంది. రాజ్యాంగ ప్రతిపత్తి ఏమవుతుంది. రాజ్యాంగ రక్షణలు ఏమవతున్నాయి.  మృగాల్ల లాగా దేశ రాజధానిలో తుపాకులు, కత్తులు పట్టుకునే పరిస్థితా.. ఇది భారత రాజ్యాంగ స్ఫూర్తా " అంటూ ప్రశ్నించారు. 

మహారాష్ట్ర గవర్నర్ కు మహారాష్ట్ర కేబినెట్ 12 ఎమ్మెల్సీల కోసం తీర్మానం చేసి పంపితే  ఏడాది వరకు ఫైల్ గవర్నర్ వద్దే పెట్టుకొన్నాడు.. తమిళనాడులో శాసనసభ బిల్లు పాస్ చేసి పంపితే  తమిళనాడు గవర్నర్ పెడ ధోరణితో వ్యవహరిస్తున్నాడని విమర్శించారు. 


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు