ఉక్రెయిన్ లో హృదయ విదారక దృష్యాలు


 రోడ్లపై చెల్లాచెదురుగా మృత దేహాలు- పస్తులతో  తండి కోసం  అల్లాడుతున్న జనం-రష్యా దాడి తరువాత ఉక్రెయిన్‌లో హృదయ విదారక దృష్యాలు

 రష్యా దాడి అనంతరం ఉక్రెయిన్ లో అల్ల కల్లోల పరిస్థితులు నెల కొన్నాయి.  రోడ్లపై ఎక్కడ పడితే అక్కడ చెల్లా చెదురుగా మృత దేహాలు తండి కోసం అల్లాడుతు తిరిగుతున్న జనం ఏడ్చేందుకు సైతం కన్నీళ్లు  రాక నిశ్చేష్టులైన మనుషులు. ఇది ప్రస్తుతం ఉక్రెయిన్ లో కనిపిస్తున్న దృష్యాలు  మారియుపోల్ నగరంలో దాదాపు 430,000 జనాభా ఉంటుంది. 

  మారియుపోల్‌లో రష్యా దాడి తర్వాత వీధుల్లో పడి ఉన్న శవాలతో విధ్వంసకర  దృశ్యాలతో  వాతావరణం భయానకంగా మారింది.  రోజుల తరబడి తిండి తిప్పలు లేక ఆకలితో అలమటిస్తున్న జనం ఇప్పుడు ఆహారం కోసం దుకాణాల తాళాలు పగుల కొట్టి ఎగు బడుతున్నారు. ఓ వైపు బాంబులు దాడి జరుగుతుంటే మరో వైపు ప్రాణాలు అర చేతిలో పెట్టుకుని ఆకలి దప్పులకు దూరంగా వేలాది మంది  నేలమాళిగల్లో  రోజుల తరబడి దాక్కుని ఆకలి,  దాహం తీర్చుకోవడానికి పడరాని పాట్లు పడుతున్నారు.  మంచును కరిగించి నీరు తాగడం అలవాటు చేసుకున్నారు.  పరిస్థితులు ఇంకా కొద్ది రోజులు ఇట్లాగే కొన సాగితే బాంబుల దాడిలో కన్నా ఆకలితో చనిపోయే వారే ఎక్కువ సంఖ్యలో ఉంటారు.

అంతర్జాతీయ వార్తా సంస్థలు వెల్లడిస్తున్న కథనాలు చదువుతుంటే హృదయం ధ్రవిస్తోంది. నేలమాళిగలో మహిళలు,  పిల్లలు చిమ్మ చీకటిలో  నూనె దీపం వెలుతురులో  ఏడుస్తున్న దృష్యాలు చూస్తుంటే వారి కష్టాలు ఎప్పటికి గట్టెక్కనున్నాయో అర్దం కాని పరిస్థితి.

నేలమాలిగలో  చిక్కుకున్న ప్రజలకు రోజుల తరబడి ఊరట లభించలేదు. ప్రజలను సురక్షిత కారిడార్ ద్వారా తరలించడానికి వారికి  ఆహారం, నీరు, మందులను అందించడానికి చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. కాన్వాయ్ నగరానికి చేరుకునేలోపే రష్యా బలగాలు కాల్పులు జరిపాయని ఉక్రెయిన్ అధికారులు తెలిపారు.

ఉక్రెయిన్‌పై రష్యా దాడి చేసి దాదాపు రెండు వారాలు గడిచింది. అజోవ్ సముద్రంలో ఉన్న మారియుపోల్‌ను చాలా రోజులుగా రష్యా దళాలు చుట్టుముట్టాయి. ఉక్రెయిన్ ఉప ప్రధాన మంత్రి ఇరినా వెరెష్‌చుక్ మాట్లాడుతూ మారియుపోల్ "వినాశకరమైన పరిస్థితి"లో ఉందని అన్నారు.

ఉక్రెయిన్‌ నుంచి ఇప్పటివరకు దాదాపు రెండు లక్షల మంది వసలు పోయారని ఐరాస అధికారులు తెలిపారు.  ఆర్థికపరంగా రష్యాను ఏకాకిని చేసేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ రష్యా చమురు దిగుమతులపై నిషేధాన్ని ప్రకటించారు. బహుళజాతి చమురు, గ్యాస్ కంపెనీ షెల్ రష్యా నుండి చమురు మరియు సహజ వాయువును ఇకపై కొనుగోలు చేయబోమని ప్రకటన చేసింది. 

అదే సమయంలో, మెక్‌డొనాల్డ్స్, స్టార్‌బక్స్, కోకా-కోలా, పెప్సికో మరియు జనరల్ ఎలక్ట్రిక్ వంటి అనేక ప్రపంచ బ్రాండ్‌లు ఉక్రెయిన్ దాడికి ప్రతిస్పందనగా రష్యాలో తమ వ్యాపారాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించాయి.


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు