యశోద ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన సిఎం కెసిఆర్


వైద్య పరీక్షల్లో అన్ని నార్మల్ - వారంరోజుల పాటు విశ్రాంతి అవసరమన్న వైద్యులు


తెలంగాణ సీఎం కేసీఆర్  వైద్య పరీక్షల అనంతరం యశోదా ఆసుపత్రి నుండి శుక్రవారం సాయంత్రం డిశ్చార్జి అయ్యారు.  సోమాజిగూడలోని యశోద ఆస్పత్రికి వైద్య పరీక్ష కోసం సోనవారం ఉదయం వెళ్లారు.  రెండు రోజులుగా సిఎం కెసిఆర్  ఎడమ చేయి, నొప్పిగా అనిపిస్తోందని నీరసంగా ఉన్నారని ఆసుపత్రికి వైద్య పరీక్షల కోసం వెళ్లారని సీఎంవో వర్గాలు తెలిపాయి.  యశోదా ఆసుపత్రిలో  డాక్టర్ ఎంవీ రావు నేతృత్వంలోని వైద్యుల బృందం ఆయనకు సంపూర్ణ వైద్య పరీక్ష నిర్వహించారు. హార్ట్ యాంజియోగ్రామ్, సిటీ స్కాన్ పరీక్షలతో పాటు ఇతర అన్ని పరీక్షలు చేశారు.

 సిఎం కేసీఆర్ సతీమణి శోభ, మంత్రి కేటీఆర్, కూతురు కవిత, సంతోష్, హరీష్ రావు, మనవడు హిమాన్షు  తదితరులు అందరూ వైద్య పరీక్షలు పూర్తి అయ్యే వరకు ఆసుపత్రిలోనే ఉండంతో  కార్యకర్తలు ఆందోళన చెందారు. ఆయితే వైద్య పరీక్షల అనంతరం కెసిఆర్ ఆసుపత్రి నుండి డిశ్చార్జి అయ్యారన్న వార్తతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.  ఈ మేరకు కేసీఆర్​ ఆసుపత్రి నుంచి బయటికి వస్తున్నట్లు తెలంగాణ సీఎంవో ట్విటర్​లో వీడియో పోస్టు చేసింది.

 వారం రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు ముఖ్యమంత్రికి సూచించారు. కేసీఆర్‌ను పరీక్షించిన డాక్టర్ విష్ణురెడ్డి,  డాక్టర్లు ఎంవీ రావు, ప్రమోద్ కుమార్  కుమార్ మీడియాతో మాట్లాడారు.

 సీఎం కేసీఆర్ రెండు మూడు రోజులుగా నీరసంగా ఉందని ఆసుపత్రికి వైద్య పరీక్షల కోసం వచ్చారన్నారు. రెండు రోజులు  డాక్టర్లు ఇంట్లోనే చికిత్స అందించారని  ఐతే ఇవాళ ఎడమ చేయి నొప్పిగా ఉందని చెప్పారని దాంతో  ఆస్పత్రికి వచ్చి వైద్య పరీక్షలు చేయించుకుంటే మంచిదని చెప్పడంతో  ఇక్కడికి వచ్చారని తెలిపారు.  కరోనరీ యాంజియోగ్రామ్ తో పాటు సి.టి స్కాన్ ఇతప వైద్య పరీక్షలు చేశామన్నారు.కెసిఆర్ కు వైద్య పరీక్షల్లో ఏ ఆటంకాలు కనిపించ లేదని అన్ని నారామల్ గా ఉన్నాయని ఈసీజీ టెస్ట్‌ కూడా నార్మల్‌గా ఉందని  గుండెకు సంబంధించి కొన్ని ఇతర పరీక్షలు కూడా చేశామని తెలిపారు. 

కార్డియక్ ప్రాబ్లమ్స్ ఏమీ లేవని అయితే  ఎందుకు ఎడమ చేయిలో నొప్పి  వస్తుందో తెలుసుకునేందుకు సర్వైకల్ స్పైన్ ఎంఆర్ఐ, బ్రెయిన్ ఎంఆర్‌ఐ పరీక్షలు కూడ చేశామని వైద్యుల వివరించారు.  సర్వైకల్ స్పాండిలోసిస్ కొద్దిగా ఉన్నట్లు తేలిందని ఇది  వయసుతో పాటు వస్తుందని మెడ నరంపై ఒత్తిడి పడడం వల్ల ఎడమ చెయ్యికి నొప్పి వచ్చిందని  బీపీ, షుగర్ కూడా ప్రస్తుతం బాగానే ఉన్నాయన,. కిడ్నీ, లివర్ ఫంక్షన్స్ నార్మల్‌గానే ఉన్నాయని తెలిపారు. వారం రోజుల పాటు విశ్రాంతి అవసరమని సూచించామని వైద్యులు చెప్పారు. 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు