ఐజీగా పదోన్నతి పొందిన వరంగల్ పోలీస్ కమిషనర్ డా. తరుణ్ జోషి

 


వరంగల్ పోలీస్ కమిషనర్ గా విధులు నిర్వహిస్తున్న  డా. తరుణ్ జోషి  ఐజీగా పదోన్నతి పొందారు. ఆయన పోలీస్ కమీషనర్ గా ఐజి హోదాలో కొనసాగుతారు.  ఈ మేరకు శనివారం  రాష్ట్ర ప్రభుత్వం  ఉత్తర్వులు  జారీచేసింది.

ఐజీగా పదోన్నతి పొందిన డా.తరుణ్ జోషి వరంగల్  పోలీస్ కమిషనర్ గా ఏప్రిల్ 7 వ తేదిన  భాధ్యతలు స్వీకరించారు. హరియాన రాష్ట్రానికి చెందిన డా.తరుణ్ జోషి డెంటల్ వైద్యులుగా డిగ్రీ పూర్తి చేసి అనంతరం  ప్రజా సేవ చేయాలనే లక్ష్యంతో  ఐపి ఎస్.గా ఎంపికయ్యారు.

2004 ఐపిఎస్ బ్యాచ్ కు చెందిన తరుణ్ జోషి శిక్షణ అనంతరం  గోదావరి ఖని ఏఎస్పీగా మరియు ఆదిలాబాద్  ఓఎస్డీగాను పనిచేసారు.2009 మరియు 2010 సంవత్సరంలో వరంగల్ ఓఏస్డీగా పనిచేసారు. అ తర్వాత వైజాగ్ సిటి ఎస్పీగాను, గ్రేహౌండ్స్, నిజామాబాద్, హైదరాబాదు  సెంట్రల్ జోన్ , ఆదిలాబాద్ ఎస్పీగా పనిచేసారు.డీ.ఐ.జీ పదోన్నతిపై హైదరాబాదు  స్పెషల్ బ్రాంచ్ జాయింట్ కమిషనర్  పనిచేసిన  అనంతరం వరంగల్ పోలీస్ కమిషనర్ గా భాద్యలు స్వీకరించారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు