చంద్రబాబు రసం పీల్చే పురుగు - మంత్రి కన్నబాబు

 


టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పై  మంత్రి కన్నబాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. చంద్రబాబు నాయుడు మరో రసం పీల్చే పురుగని దుయ్యబట్టారు. బుధవారం కన్నబాబు మీడియాతో మాట్లాడారు.   తామర పురుగుతో రైతులు తీవ్రంగా నష్టపోయారని  2019లో లేవలేని స్థాయిలో బాబుకు  ప్రజలు పురుగు మందు కొట్టారని విమర్శించారు. పోగాలం ఎవరికి దాపురించిందో 2019 నుంచి చూస్తున్నామన్నారు. రాష్ట్రాన్ని బాబు  భ్రష్టు పట్టించారని ఆరోపించారు. రాష్ట్ర ప్రయోజనాలు అంటే రియల్ ఎస్టేట్ ప్రయోజనం అనుకున్నారన్నారని విమర్శించారు. సొంత మనుషుల చేత భూములు కొనిపించి అమరావతి పెట్టారన్నారు. తోటలు తగలబెట్టి భూములు లాక్కొన్నారన్నారని అన్నారు. భూముల వ్యాపారం ద్వారా వచ్చిన డబ్బులతో రాజకీయం చేయడం చంద్రబాబుకు అలవాటని ఆగ్రహం వ్యక్తం చేశారు.

రిటైర్డ్ జస్టిస్ చంద్రు వ్యాఖ్యలపై చంద్రబాబు ఎందుకు  మండిపడుతున్నారని ప్రశ్నించారు. చంద్రు వాస్తవాలు మాట్లాడినందుకే చంద్రబాబు తప్పుపడుతున్నారన్నారని అన్నారు. అచ్చెన్నాయుడు తప్పెటగూళ్ళు బ్యాచ్ పులివెందులలో గెలుస్తాం అంటున్నారన్నారని ముందు కుప్పం సంగతి చూసుకోవాలని  ఆయన హితవు పలికారు. న్యాయస్థానం టు దేవస్థానం పాదయాత్రకు ఎవర స్పాన్సరో అందరికి తెలుసన్నారు. రాజధాని కోసం భూములా, భూముల కోసం రాజధానా అన్న అంశంపై చర్చ జరగాలని కన్నబాబు పేర్కొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు