ఉద్యోగాల భర్తీకి నోటిఫికిషన్ జారి చేయకుంటే ఉద్యమిస్తాం- బండి సంజయ్

 


నెల రోజుల్లోగా కొత్త ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేయ లేని  పక్షాన పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని భారతీయ జనతా పార్టి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ సిఎం కెసిఆర్ ను హెచ్చరించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు బండి సంజ‌య్ శుక్రవారం బ‌హిరంగ‌ లేఖ రాశారు. ఉద్యోగ నియామకాలపై ఎప్పటికప్పుడు నిరుద్యోగులను మభ్యపెడుతున్నారని విమర్శించారు. వివిద ప్రభుత్వ శాకల్లో ఉన్న ఖాళీలపై శ్వేతపత్రం విడుదల చేయాయలని వెంటనే నియామకాల ప్రక్రియ చేపట్టాలని లేఖలో  డిమాండ్ చేసారు. ఉద్యోగ, ఉపాధ్యాయుల రీఅలాట్ మెంట్ కోసం జారీ చేసిన 317 జీవో ప్రభుత్వ అనాలోచిత చర్యకు  నిదర్శనమని.. ప్రభుత్వ నిర్ణయంతో ఉద్యోగ, ఉపాధ్యాయులు స్థానికతను కోల్పోయే ప్రమాదమ‌న్నారు.  జోన్లు, మల్టీ జోన్లకు అనుగుణంగా సర్వీసు రూల్స్‌ను రూపొందించ లేదని లేఖలో పేర్కొన్నారు. కేసీఆర్ నిర్ణయాలతో న్యాయపరమైన సమస్యలు తలెత్తే అవకాశం ఉందని లేఖలో తెలిపారు. 317 జీవోతో కొన్ని జిల్లాల్లో ఉద్యోగ నోటిఫికేషన్లు వచ్చే అవకాశం లేదన్నారు. స్థానికత, సీనియార్టీ ఆధారంగా జిల్లాలకు సర్ధుబాటు చేసే అంశంపై ఉపాధ్యాయ, ఉద్యోగులతో చర్చించాలన్నారు. రాష్ట్రపతి ఉత్తర్వులకు అనుగుణంగా 3 ఏళ్లలోపు ఉద్యోగులను సర్దుబాటు చేస్తామని 2018లో 124 జీవో జారీ చేసినా గడవు ముగిసేదాక సీఎం ఆ ఊసే ఎత్తకపోవడం దారుణమ‌ని ఆగ్ర‌హం వ్యక్తం చేశారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు