బండి సంజయ్ పర్యటనలో ఉద్రిక్తత

 కాన్వాయ్‌పై గుడ్లు, రాళ్లతో దాడి - పోలీసుల లాఠి చార్జి



 
బిజెపి చీఫ్ బండి సంజయ్ మిర్యాల గూడ, సూర్యపేట పర్యటన ఉద్రిక్తతలకు దారి తీసింది. బండి సంజయ్ పర్యటనను వ్యతిరేకిస్తు టిఆర్ఎస్ పార్టి కార్యకర్తలు నల్ల జెండాలు ప్రదర్శించి నిరసన తెలిపారు. ప్రధానవ మంత్రి నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బండి గో బ్యాక్ అంటూ నరేంద్ర మోది డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. టిఆర్ఎస్ పార్టి కార్యకర్తలను అడ్డుకునేందుకు బెజెపి కార్యకర్తలు ప్రతిఘటించారు. దాంతో పలు చోట్ల ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ క్రమంలో బండి సంజయ్ వాహనంపై టీఆర్ఎస్ కార్యకర్తలు కోడిగుడ్లతో దాడి చేశారు.  కాన్వాయ్‌పై దాడికి నిరసనగా నార్కెట్‌పల్లి అద్దంకి జాతీయ రహదారిపై బైఠాయించిన బీజేపీ శ్రేణులు నిరసన వ్యక్తం చేశారు. పోలీసులు జోక్యం చేసుకుని ఇరువర్గాలను హెచ్చరించి అక్కడి నుండి బలవంతంగా పంపించారు.

  బీజేపీ నేతలు టీఆర్‌ఎస్‌ నేతలు బాహాబాహీకి దిగారు. మోదీ డౌన్ డౌన్ అంటూ టీఆర్‌ఎస్‌, కేసీఆర్‌  డౌన్ డౌన్ అంటూ బీజేపీ నేతలు నినాదాలు చేశాయి. ఈ క్రమంలో బండి సంజయ్ వాహనంపై టీఆర్ఎస్ కార్యకర్తలు కోడిగుడ్లతో దాడి చేశారు.  కాన్వాయ్‌పై దాడికి నిరసనగా నార్కెట్‌పల్లి అద్దంకి జాతీయ రహదారిపై బైఠాయించిన బీజేపీ శ్రేణులు నిరసన వ్యక్తం చేశారు. దీంతో జిల్లా ఎస్పీ రంగనాధ్ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సంఘటన స్థలానికి చేరుకొని  పోలీసులను అప్రమత్తం చేశారు.

సూర్యాపేట జిల్లాలో కూడ   టీఆర్ఎస్ కార్యకర్తల ధర్నా నిర్వహించారు.  నేరేడుచర్ల మండలం చిల్లెపల్లి వద్ద ధర్నా నిర్వహించి బండి సంజయ్ గో బ్యాక్   అంటూ నినాదాలు చేశారు. అదే సమయంలో బెజిపి కార్యకర్తలు అక్కడికి చేరుకుని టిఆర్ఎస్ కు వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో ఉద్రిక్తత నెల కొంది. టిఆర్ఎస్ కార్యకర్తలు బిజెపి వాహనాలపై రాళ్ల దాడికి పాల్పడ్డారు.    పోలీసులు భారి సంఖ్యలో చేరుకుని లాఠి చార్జి చేసి వారిని చెల్లాచెదురు చేశారు.

ఉద్రక్తతల మద్యే బండి సంజయ్ ఐకెపి కేంద్రాలు సందర్శించి రైతులతో మాట్లాడారు. రైతుల పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్‌ గజినిలా మారాడని   బండి సంజయ్‌ ధ్వజమెత్తారు. ఓసారి పత్తి వేయమంటడు...ఓ సారి వరెయ్యమంటడు..మరోసారి వద్దని రైతులను తప్పుదారి పట్టిస్తున్డని బండి సంజయ్ మండిపడ్డారు. రైతులు పండించిన ప్రతి గింజను తెలంగాణ ప్రభుత్వం కొనాల్సిందేనని ఆయన డిమాండ్‌ చేశారు. తన పర్యటనను అడ్డుకునేందుకు టిఆర్ఎస్ పార్టి శ్రేణులు గొడవలు సృష్టించారని అన్నారు. రైతులపై రాళ్లతో దాడి చేస్తారా.? అని మండి పడ్డారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు