భోరున ఏడ్చిన చంద్రబాబు - సిఎం అయినంకనే అసెంబ్లీలో అడుగు పెడతానంటూ శపథం


 ఎపి రాజకీయాలు ఎప్పుడు హాట్ గానే ఉంటాయి.  అసెంబ్లీలో ఇక అడుగుపెట్టేది లేదని పెడితే సిఎం అయున తర్వాతే అడుగు పెడతానంటూ  విపక్ష నేత టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు భోవోద్వేగ ప్రకటన చేసాడు. శుక్రవారం  అసెంబ్లీలో ప్రకటించి అనంతరం   మీడియా సమక్షంలో తన శపథం వెల్లడించారు. ఈ సందర్భంగా చంద్రబాబు భోరమన్నాడు. తొమ్మిదేళ్ల పాటు ఉమ్మడి రాష్ట్రానికి అట్లాగే విభజిత ఆంధ్ర  ప్రదేశ్ కు తొలిముఖ్యమంత్రి అయి 5 సంవత్సరాలు పాలన చేసిన చంద్రబాబు విలపించడం రాజకీయ వర్గాల్లో  కల కలం రేపింది. 

" ఈ హౌస్‌లో పడరాని అవమానాలు పడిన తర్వాత బాధాకరమైన సందర్భాలున్నాయి. వ్యక్తిగతంగా, పార్టీ పరంగా విమర్శించారు. ఇన్ని సంవత్సరాలుగా ఏ పరువు కోసం పని చేశానో.. ఇన్నేళ్లుగా బతికామో.. నా కుటుంబం, నా భార్య విషయం కూడా తీసుకొచ్చి(మాట్లాడుతుండగానే మైక్ కట్ చేసిన స్పీకర్) అవమానించారు. మళ్లీ సీఎం అయ్యాకే అసెంబ్లీలో అడుగు పెడతా" అని చంద్రబాబు శపథం చేశారు.

చంద్రబాబు నాయుడు పూర్తిగా ఫ్రస్ స్టేషన్ లో ఉన్నాడని చంద్రబాబు కుటుంబ సబ్యుల గురించి ఎక్కడా కూడ వైసిపి సబ్యులు సభలో మాట్లాడ లేదని సిఎం జగన్  స్పష్టం చేశారు. సభలో చంద్రరాబే వాతావరణం చెడ గొట్టారన్నారు. టీడీపీ హయాంలో జరిగిన వంగవీటి మోహన రంగా హత్య, మాధవరెడ్డి హత్య, మల్లెల బాబ్జీ ఆత్మహత్య చేసుకుంటూ రాసిన లేఖపై కూడా చర్చ జరగాలని అధికారపార్టీ సభ్యులు మాట్లాడడం అవామరపర్చినట్లు ఎట్లా అవుతుందని జగన్ ప్రశ్నించారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు