కలిమిడిగా పోరాడేందుకు ఆదివాసి సంఘాల ఐక్యకూటమి

 ఒక్కటైన  33 తెగలు
ఐక్య ఉద్యమంలో - చారిత్రక ఘట్టం ఆరంభం


ఆదివాసి హక్కులు కోసం విడి విడిగా పోరాడుతున్న పలు సంఘాలు ఐక్య కూటమిగా ఏర్పడ్డాయి. మహనీయుడు ప్రపంచ మేధావి ఆదివాసీ, మూల నివాసుల రక్షకుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్   రూపొందించిన భారత రాజ్యాంగం ద్వారా 5,6 షెడ్యూల్స్ ద్వారా ఆదివాసి తెగలకు లభించిన హక్కులను కాపాడుకోవడానికి తెలంగాణ రాష్ట్రంలోని  33 గిరిజన తెగలు ఏకమయ్యాయి. తమ ప్రజల హక్కుల కోసం రాజ్యాంగబద్ధమైన పోరాటాలకు  ఇక తుడుం మోగించనున్నాయి.

1997 సంవత్సరం జూలైలో  ఏర్పడిన లంబాడీ హక్కుల పోరాట సమితి(LHPS), 1997ఆగస్టులో   ఏర్పడిన ఎరుకల హక్కుల పోరాట సమితి(YHPS),1997 నవంబర్ లో 31 తెగలతో ఏర్పడిన ఆదివాసీ హక్కుల పోరాట సమితి(AHPS) సంఘాలు ఐడెంటిటీ  (మొదటి దశ), అలయన్స్ (రెండవ దశ),ఆల్టర్నేటివ్ (మూడవ దశ)  లక్ష్యంతో  ఏర్పడిన సంఘాలు 24 సంవత్సరాల అనంతరం 2021 నవంబర్ 14 న రెండవ దశ అయిన అలయన్స్ ఉద్యమానికి నాంది పలికాయి.

 చరిత్రలో నూతన ఘట్టం మొదలైందంటూ ఆదివాసిసంఘాల నేతలు హర్షం వ్యక్తం చేశారు. తెలుగు నేలపై  సమ్మక్క ,సారలమ్మ ,రాంజీగోండు , కొమరం భీమ్, గంటందొర, మల్లుదొర లాంటి  గిరిజన యోధుల త్యాగం వృధా కాదని పేర్కొన్నారు.   ఆదివాసీల హక్కుల సాధన కోసం జల్, జంగిల్, జమీన్ ల కోసం తమ జీవితాలను  త్యాగం చేశారని   ఈ క్రమంలోనే మహనీయుడు ప్రపంచ మేధావి ఆదివాసీ, మూలనివాసుల రక్షకుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్   రూపొందించిన భారత రాజ్యాంగం ద్వారా 5,6 షెడ్యూల్స్ ద్వారా ఆదివాసి తెగలకు లభించిన హక్కులను కాపాడుకోవడానికి తెలంగాణ రాష్ట్రంలోని  33 గిరిజన తెగలు ఏకమయ్యాయి కాదు తమ ప్రజల హక్కుల కోసం రాజ్యాంగబద్ధమైన పోరాటాలకు సిద్ధం అయ్యామని పేర్కొన్నారు.

 ఉమ్మడి రాష్ట్రంలో తమ జాతి ప్రజల కోసం పోరాడిన సంఘాలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత ఆ జాతి ప్రజలు రెండు రాష్ట్రాలలో ఉండటం మూలంగా అవి ఆలిండియా సంఘాలుగా అభివృద్ధి చెందాయి. తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర వరకు విస్తరించాయి.  ఆలిండియా ఎరుకల హక్కుల పోరాట సమితి(AIYHPS),  ఆలిండియా లంబాడీ హక్కుల పోరాట సమితి(AILHPS), ఆల్ ఇండియా ఆదివాసి హక్కుల పోరాట సమితి(AIAHPS),  గోండ్వానా సంక్షేమ పరిషత్(GSP) సంఘాలుగా అభివృద్ధి చెంది  తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలలో  రాష్ట్ర కమిటీలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది.

14-11-2021న 4 సంఘాల 33 తెగల  తెలంగాణ రాష్ట్ర కమిటీ ల సమావేశము హైదరాబాద్ లో జరిగింది


 ఈ సమావేశం అజెండాలో 4 అంశాల మీద చర్చించడం జరిగింది.   జీవో నెంబర్: 3 ఆదివాసి ప్రాంతంలో యధావిధిగా అమలు చేయాలని  పోడు భూములపై ఆదివాసీలకు పట్టాలు ఇవ్వాలని,  గిరిజన జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్ అమలు జరపాలని,  తెలంగాణ 33 జిల్లాల లో మైదాన ప్రాంత ITDA లు ఏర్పాటు చేయాలని తదితర విషయాలపై సుదీర్ఘంగా చర్చించారు.

సమావేశంలో నాలుగు సంఘాలకు సంబంధించిన 33 తెగల ఉమ్మడి ఉద్యమ సంఘాల రాష్ట్ర నేతలు పాల్గొన్నారు. 

త్వరలోనే వరంగల్ జిల్లా కేంద్రంగా 33  ఆదివాసి తెగల సంఘాలతో  రాష్ట్ర జనరల్ బాడీ సమావేశాన్ని నిర్వహించి భవిష్యత్తు కార్యాచరణ ప్రకటించాలని నిర్ణయించినట్లు ఆలిండియా లంబాడి హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షులు వి. దాసురాం నాయక్,  ఆలిండియా ఎరుకల హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షులు విలిగి ప్రబాకర్ ఎరుకల తెలిపారు.

సమావేశంలో పాయం సత్యనారాయణ (GSP) రాష్ట్ర అధ్యక్షులు, కొమురం బుచ్చయ్య (AHPS) రాష్ట్ర నాయకులు,  రాజేష్ నాయక్(AILHPS-TS) రాష్ట్ర అధ్యక్షులు, prakash rathod (AILHPS-TS ) అధ్యక్షులు, రేవెల్లి శంకర్ ఎరుకల(AIYHPS-TS) అధ్యక్షులు, వి అంజయ్య ఎరుకల(AIYHPS -TS) ఉపాధ్యక్షుడు,  వీరితో పాటు అన్ని (AIYHPS,AILHPS,AIAHPS,GSP) సంఘాల రాష్ట్ర కమిటీ నాయకులు, జిల్లాల అధ్యక్షులు పాల్గొన్నారు. 

 ప్రత్యేక ఆహ్వానితులుగా డాక్టర్ కుమార్ BAMCEF  తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు అంసోల్ లక్ష్మణ్ BMP తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు