రైతుల మహా పాద యాత్రతోనే మూడు రాజధానుల బిల్లుపై వెనక్కి తగ్గారా ?


ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి హఠాత్తుగా మూడు రాజధానుల బిల్లు ఉహసంహరించు కోవడం వెనక పెద్ద చర్చే జరుగుతోంది. రెండేళ్లుగా కనసాగుతున్న రైతుల పోరాటం వారు చేపట్టిన పాద యాత్రతో  కీలక దశకు చేరింది. మరో వైపు హై కోర్టులో కేసు సైతం జగన్ సర్కార్ కు ఇబ్బందిగానే పరిగణించింది.

దాంతో  సోమవారం జగన్ మోహన్ రెడ్డి  ఎవరూ ఊహించని రీతిలో బిల్లు వెనక్కి తీసుకుంటున్నట్లు  ప్రకటించారు.  బిల్లు ఉపసంహరణకు జగన్ చెప్పిన కారణాలు వేరే ఉన్నాయి. నాటి  శ్రీబాగ్‌ ఒడంబడిక స్పూర్తితో, వెనకబడ్డ ఉత్తరాంధ్ర సహా అన్ని ప్రాంతాలూ కూడా సమాన అభివృద్ధి చెందాలన్న ఆకాంక్షతో వికేంద్రీకరణ బిల్లుల్ని ప్రవేశపెట్టామని జగన్ తెలిపారు. 

రాజధానుల వికేంద్రీకరణ బిల్లు ఆమోదం పొందిన వెంటనే మూడు ప్రాంతాలకూ న్యాయం చేసేలా మూడు రాజధానుల ప్రక్రియ ప్రారంభమై ఉంటే, ఈ రోజుకు దాని నుంచి మంచి ఫలితాలు  వచ్చేవని అన్నారు.  వికేంద్రీకరణకు సంబంధించి అనేక  అపోహలు, అనేక అనుమానాలు, అనేక కోర్టు కేసులు, న్యాయపరమైన వివాదాలు, దుష్ప్రచారాలు.. ఇలా ఈ రెండేళ్ల కాలంలో వీటినే ప్రచారాలు చేశారని అన్నారు. అందరికీ న్యాయం చేయాలన్న ప్రభుత్వ సదుద్దేశాన్ని పక్కనపెట్టి, కొందరికి అన్యాయం జరుగుతుందన్న వాదనను కూడా కొంతమంది ముందుకు తోసారని అన్నారు. 

ప్రభుత్వ సదుద్దేశాన్ని విపులంగా వివరించేందుకు, చట్టపరంగా గానీ, న్యాయపరంగా గానీ అన్ని సమాధానాలను బిల్లులోనే పొందుపరచేందుకు, బిల్లుల్ని మరింత మెరుగుపరిచేందుకు అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని, మళ్లీ పూర్తి, సమగ్రమైన, మెరుగైన బిల్లుతో సభ ముందుకు తీసుకువస్తామని జగన్ తెలిపారు.

 రైతులతో  ఒప్పందం చేసుకున్న  సిఆర్ డిఏ చట్టాన్ని కూడ రద్దు చేయడంతో  గత రెండేళ్లుగా మహిళలు, రైతులు ఉద్యమ బాట పట్టారు. న్యాయస్ధానం టూ దేవస్ధానం పేరుతో రైతులు మహా పాదయాత్రను ప్రారంభించారు. అమరావతి నుంచి మొదలైన పాదయాత్ర తిరుమల వరకూ కొనసాగేలా యాత్ర చేపట్టారు. రైతుల యాత్రకు మద్దతు లభిస్తోంది. బిజెపి కూడ రైతుల యాత్రుక మద్దతు ప్రకటించింది. మరో వైపి హై కోర్టులో మూడు రాజధానుల బిల్లుపై  చర్చ జరుగుతోంది. 

సాగు చట్టాల పై ప్రధాన మంత్రి నరేంద్ర మోది తెచ్చిన బిల్లును వ్యతిరేకీస్తు రైతులు ఏడాదికాలంగా నిర్విరామంగా పోరాటం చేయడంతో బిల్లు రద్దు చేస్తున్నట్లు ప్రదాన మంత్రి ప్రకటించారు. అదే రీతిలో ఎపి సిఎం జగన్ మోహన్ రెడ్డి కూడ  రైతుల మహా పాద యాత్రతో దిగి వచ్చి మూడు రాజధానుల బిల్లు వెనక్కి తీసుకున్నారనే చర్చసాగుతోంది.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు