నవంబర్ 1 నుండి ట్రాఫిక్ నిబంధనలు కఠినం - -వరంగల్ పోలీస్ కమిషనర్ డా.తరుణ్ జోషి

 వరంగల్ కమిషనరేట్ పరిధిలో నవంబర్ 1నుండి ట్రాఫిక్ నియమనిబంధనలు కఠినం
  ట్రాఫిక్ నిబంధనలు పాటించని వాహనదారులకు జరిమానాలు తప్పవు - వరంగల్ పోలీస్ కమిషనర్ 

                                       

 వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పాటు ట్రై సిటి పరిధిలో రోడ్డు ప్రమాదాల నివారణలో భాగంగా రానున్న రోజుల్లో ట్రాఫిక్ నిబంధనలు పాటించని వాహనదారులపై కఠిన చర్యలు తీసుకునేందుకు వరంగల్ కమిషనరేట్ ట్రాఫిక్ పోలీసులు  సిద్ధమయ్యారు. దీనికి సంబంధించి వరంగల్ పోలీస్ కమిషనర్ గురువారం పత్రికా ప్రకటన విడుదల చేసారు.

వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఇకపై వాహనదారులు మద్యం సేవించి వాహనం నడపడం, సెల్ ఫోన్  లోమాట్లాడుతూ, ట్రిపుల్ డ్రైవింగ్, అపసవ్య మార్గంలో (రాంగ్ రూట్) వాహనం నడపటం మరియు హెల్మెట్ లేకుండా మరియు నాణ్యతలేని హెల్మెట్ ధరించి వాహనాలను నడపడం లాంటి ట్రాఫిక్ నియబంధనలను ఉల్లఘించిన వాహనదారులపై కఠినంగా వ్యవహరించడంతో పాటు వారిపై జరిమానాలు విధించబడుతాయని పోలీస్ కమిషనర్ తెలియజేసారు. ముఖ్యంగా వాహనానికి రిజిస్ట్రేషన్ చేయింకుండా వాహనం నడపడంతో పాటు, రిజిస్ట్రేషన్ నంబర్ ప్లేట్ లోని నంబర్లు కనిపించకుండా చేసే చర్యలకు పాల్పడుతూ రోడ్లపై నడిపే వాహనాలను నిలిపివేయడంతో పాటు వాహనదారుడిపై జరిమానా విధించబడుతుందని. అదే విధంగా

లైసెన్స్ లేని మైనర్లు వాహనం నడుపుతూ పోలీసులకు చిక్కితే సదరు మైనర్ తల్లిదండ్రులను బాధ్యులు చేసి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు, వాహనాన్ని అతివేగంగాను, అజాగ్రత్తగా వాహనం నడిపినా, పోలీసు వారి తనీఖీల్లో వాహనం వాహనాన్ని ఆపకుండా వెళ్ళి వాహనాలకు సంబంధించి వాహన యజమానులపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని పోలీస్ కమిషనర్ తెలిపారు.

ట్రాఫిక్ నిబంధనలు  పాటించని వాహనదారుల ఫోటోలు తీసి పంపండి


 రోడ్డు ప్రమాదాల నివారణలో భాగం ప్రజలను సైతం భాగస్వాములను చేయడం జరిగింది. ఇందు కోసం ప్రజలు చేయాల్సిందల్లా రోడ్లపై ట్రాఫిక్ నిబంధనలును ఉల్లఘిస్తూ వాహనాలను నడిపే వాహనదారుల వాహనాలను నంబర్ కనిపించే విధంగా తమ సెల్‌ఫోన్లో ఫోటోలు తీసి 9491089113 - 73826 29254 - 9440795211

 నంబర్లకు వాట్సప్ పంపింనయెడల సదరు వాహనదారులకు జరిమానాలను విధిస్తూ చలాన్లను జారీ చేయడం జరుగుతుంది. అదే విధంగా ఏవరైనా పోలీస్ అధికారులుగానీ పోలీస్ సిబ్బందిగాని ట్రాఫిక్ నిబంధనలు పాటించకుండా వాహనం నడిపే వాహనదారుల ఫోటోలు తీసి పంపించిన వారిపై తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందని వరంగల్ పోలీస్ కమిషనర్ ప్రజలకు పిలుపునిచ్చారు. వాహనదారులు తమ గమ్యం స్థానాలకు క్షేమంగా చేరుకోవడమే వరంగల్ కమిషనరేట్ పోలీసుల ప్రధాన లక్ష్యమని ఇది దృష్టిలో వుంచుకోని వాహనదారులు, ప్రజలు రోడ్డు ప్రమాదాల నివారణకు తమ వంతు సహకారాన్ని పోలీసులకు అందించాల్సిందిగా పోలీస్ కమిషనర్ ప్రజలను కోరారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు