కేంద్ర ఎన్నికల సంఘంపై కెసిఆర్ ఆగ్రహం

 కేంద్ర ఎన్నికల సంఘంపై  ఆగ్రహం



కేంద్ర ఎన్నిక‌ల సంఘంపై ముఖ్య‌మంత్రి కేసీఆర్ తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఈసీ కూడా రాజ్యాంగ ప‌రిధి దాటి ప్ర‌వ‌ర్తిస్తుంది అని ధ్వ‌జ‌మెత్తారు. టీఆర్ఎస్ ప్లీన‌రీలో సీఎం కేసీఆర్ అధ్య‌క్షోప‌న్యాసం చేశారు భార‌త ఎన్నిక‌ల సంఘం రాజ్యాంగ వ్య‌వ‌స్థ‌గా వ్య‌వ‌హ‌రించాలి. గౌర‌వాన్ని నిల‌బెట్టుకోవాలి. ఈ దేశంలో ఒక సీనియ‌ర్ రాజ‌కీయ నాయ‌కుడిగా, బాధ్య‌త గ‌ల పార్టీ అద్య‌క్షుడిగా, ఒక ముఖ్య‌మంత్రిగా భార‌త‌ ఎన్నిక‌ల సంఘానికి ఒక స‌ల‌హా ఇస్తున్నానని చిల్ల‌ర‌మ‌ల్ల‌ర ప్ర‌య‌త్నాలు మానుకోవాల‌ని హెచ్చ‌రించారు.

టీఆర్ఎస్ అధ్యక్షుడిగా కేసీఆర్ 9 వ సారి  ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.  కెసిఆర్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు పార్టి సీనియర్ నేత కె. కేశవరావు ప్రకటించారు. ఈ సందర్భంగా హైటెక్స్ ప్లీనరీలో  కెసిఆర్ కీలకోపన్యాసం చేశారు. తెలంగాణ ఉద్యమాన్ని అవహేళన చేసినప్పటికి పట్టుదలతో స్పష్టమైన లక్ష్యంతో  ఉద్యమాన్ని విజయపథం వైపు నడిపించామని  గుర్తు చేసారు. రాజీలేని పోరాటంతో తెలంగాణ సాధించుకున్నామని తెలంగాణ రాష్టాన్ని అన్ని రంగాలలో దేశంలోనే ఆదర్శవంతంగా తీర్చి దిద్దామన్నారు. పక్క రాష్ట్రాల వారు తెలంగాణ రాష్ట్రంలో కలపాలని కోరుతుండడమే తెలంగాణ అభివృద్ధికి నిదర్శనమన్నారు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు