కెసిఆర్ అట్లా చేస్తే లీటర్ పెట్రోల్ 60 కే - బిజెపి చీఫ్ బండి సంజయ్

 


హుజురాబాద్ ఉప పోరులో ప్రధాన రాజకీయ పక్షాలు పెట్రో, గ్యాస్ ధరలపై భగ్గు మంటున్నాయి. భారతీయ జనతా పార్టీ పుణ్యమా అంటూ పెట్రోల్, డీజిల్,గ్యాస్  ధరలు గతంలో లేని విదంగా విపరీతంగా పెరిగాయని కాంగ్రేస్, టిఆర్ఎస్ పార్టీలు ఈ ఆంశాన్ని ఎన్నికల ప్రధానాస్ర్తం చేసాయి. అయితే బిజెపి నేతలు వారి ప్రచారాన్ని కౌంటర్లతో తిప్పు కొడుతున్నారు. రాష్ర్టంలో కెసిఆర్ లీటర్ కు 41 రూపాయలు పన్నుల రూపంలో తీసుకుంటున్నాడని  అవి వదులు కుంటే లీటర్ పెట్రోల్ రూ 60 కే లభిస్తుందని  బిజెపి చీఫ్ బండి సంజయ్ తెలిపారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న బిజెపి నేతలు ఎంపి అర్వింద్, డి.కె అరుణ, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, అభ్యర్థి ఈటల రాజేందర్  తదితరులు టిఆర్ఎస్ నేతలకు ధీటుగా కౌంటర్లు ఇస్తున్నారు.

పెట్రోల్ డీజిల్ ధరలు కేంద్రంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోది పెంచారంటూ కాంగ్రేస్, టిఆర్ఎస్ దుష్ప్రచారం చేస్తోందని ఈ ధరల నియంత్రణ ఎవరి చేతుల్లో ఉండదని అంతర్ జాతీయంగా ముడి చమురు ధరను బట్టి హెచ్చుతగ్గులు ఉంటాయని బండి సంజయ్, అర్వింద్, కిషన్ రెడ్డి తమ ఎన్నికల ప్రచార సభల్లో పదే పదే స్పష్టత ఇచ్చారు. అంతే కాకుండా రాష్ర్ట ముఖ్యమంత్రి కెసిఆర్ లీటర్ పెట్రోల్ పై 41 రూపాయల పన్ను వసూలు చేస్తున్నాడని ఆ పన్ను వదులుకుంటే పెట్రోల్ ధరలు దిగివస్తాయని అన్నారు. ముందు ముఖ్యమంత్రి కెసిఆర్ తన పన్ను వదులుకుని కేంద్రాన్ని ప్రశ్నించాలని  డిమాండ్ చేసారు.

ముఖ్యమంత్రి కెసిఆర్ రైతుల గురుంచి ఎందుకు మాటాలడం లేదన్నారు.రైతులు పండించిన ధాన్యాన్ని కేంద్రమే కొంటుంటే.. రాష్ట్ర ప్రభుత్వం బ్రోకరిజం చేస్తోందంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కమలాపూర్‌ పేరును కమల్‌పూర్‌గా మార్చుతామని సంజయ్‌ ప్రకటించారు. 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు