యాదాద్రి ఆలయానికి భారీగా బంగారం విరాళాలు


 వచ్చే ఏడాది మార్చి  మాసంలో యాదాద్రి ఆలయం పున ప్రారంభం కానుంది.  ఆలయ విమాన గోపురానికి స్వర్ణ తాపడం కోసం విరాళాలు ఆహ్వానించడంతో భారీగా స్పందన లభిస్తోంది. అనేక మంది బంగారం విరాళంగా ప్రకటించారు. మంగళవారం యాదాద్రి ఆలయం సందర్శించి పనులు సమీక్షించిన ముఖ్యమంత్రి కెసిఆర్ గోపురం స్వర్ణతాపడం కోసం తమ కుటుంబం తరపున కిలో 16 తులాల బంగారం విరాళంగా ప్రకటించారు. ఎవ్వరు విరాళంగా ఇచ్చినా స్వీకరిస్తామన్నారు. రాష్ట్రంలో 12 వేల 769 గ్రామపంచాయతీలు ఉన్నాయని, ఆ గ్రామాల్లో పూజలు చేసి డబ్బు ఇవ్వాలని సూచించారు. ప్రతి గ్రామం నుంచి రూ.11 వచ్చినా సరిపోతుందని, ఆ డబ్బుతో రిజర్వ్ బ్యాంక్ నుంచి బంగారం కొంటామని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ పిలుపుతో యాదాద్రి ఆలయానికి విరాళాలు వెల్లువెత్తున్నాయి. చిన జీయర్ స్వామి ట్రస్ట్ నుండి కిలోబంగారం విరాళంగా ప్రకటించారు. తెలంగాణ రాష్ర్టంతో పాటు ఇతర రాష్ట్రాల నుండి కూడ  విరాళాలు వచ్చే అవకాశం ఉందని అంచనా వేశారు. హెటిరో గ్రూప్ 5 కిలోల బంగారం విరాళంగా ప్రకటించగా  ప్ర‌ణీత్ గ్రూప్ ఎండీ న‌రేంద్ర కుమార్ 2కిలోల బంగారాన్ని విరాళంగా ప్ర‌క‌టించారు.  మంత్రి మ‌ల్లారెడ్డి 2 కిలోలు, మ‌ర్రి జ‌నార్థ‌న్ రెడ్డి 2 కిలోలు, హ‌రీష్‌రావు, కావేరీ సీడ్స్, ఎమ్మెల్యే అరిక‌పూడి గాంధీ , ఎమ్మెల్యే హ‌నుమంత‌రావు , ఎమ్మ‌ల్యే కృష్ణారావు, టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్కాసుమ‌న్,  ఎమ్మెల్సీలు కె.నవీన్‌ కుమార్‌, శంభీపూర్‌ రాజు,చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి, జ‌ల‌విహార్ ఎండీ, కేవీ వివేకానంద కిలో చొప్పున బంగారాన్ని విరాళంగా ప్ర‌క‌టించారు.   కడప జిల్లా చిన్న మండెం జడ్పీటీసీ సభ్యురాలు, వ్యాపారవేత్త మోడెం జయమ్మ ఒక్కొక్కరు కిలో బంగారం చొప్పున ఇస్తామని ప్రకటించారు. ఇప్పటికే యాదాద్రి ఆలయానికి బుధవారం వరకు  30 కిలోల వరకు బంగారం విరాళంగా ప్రకటించారు.

గోపురం తాపడానికి 125 కిలోల బంగారం అవసరమని ప్రతిపాదనలు సిద్దం చేశారు. 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు