ఈటలను గెలిపిస్తే కెసిఆర్ కు వచ్చేదదే --తేల్చి చెప్పిన ఎంపి అర్వింద్

హుజురాబాద్ ఉప పోరులో  ఏం జరుగుతుందో స్పష్టం  చేసిన  కమలం ఎంపి అర్వింద్




హుజురాబాద్ ఉప ఎన్నికల పోరు పీక్ స్టేజికి చేరుకోగా వివిద పార్టీల నేతలు ఎవరి టాలెంట్ ను వారు ప్రదర్శిస్తున్నారు. మాటకు మాట తూటాలై పేలుతున్నాయి. అధికార టిఆర్ఎస్ పార్టి  బిజెపి నేతల మద్య  అయితే 'ఈంట్ కా జవాబు పత్తర్ సే' అంటూ కౌంటర్లతో కార్నర్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి.

టిఆర్ఎస్ పార్టి ఎమ్మెల్యేలు, మంత్రులు ప్రస్తుతం హుజురాబాద్ లో గల్లి గల్లీకి తిరుగుతున్నారు. వీరితో పాటు వివిద కార్పోరేషన్ల చైర్మన్లు, ఎంపీలు కూడ అక్కడే ఠికాన వేశారు. బిజెపి అభ్యర్థి ఈటల రాజేందర్ ను ఓడించేందుకు టిఆర్ఎస్ పార్టీ నేతలు ఏ అవకాశాన్ని జార విడుచు కోవడం లేదు. 

హుజురాబాద్ కు ఉప ఎన్నికలు రావడం ఏమో కాని ఆ నియోజక వర్గం ప్రజలకు నిధుల వరద పోటెత్తుతోంది.  దళిత భందు పథకంతో పాటు అనేక సంక్షేమ పథకాలతో ఓటర్లను అకట్టుకునే ప్రయత్నాలతో పాటు ఈటలను గెలిపిస్తే ఏం వస్తదని  టిఆర్ఎస్ నేతలు ఓటర్ల మూడ్ ను మార్చే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈటల రాజేందర్ గేలిస్తే  ఆయన ఒక్కరే లాభ పడతారని కాని టిఆర్ఎస్ అభ్యర్థిని గెలిపిస్తే మొత్తం నియోజకవర్గం ప్రజలకు లాభం కలుగుతుందని ముఖ్యమంత్రి కెసిఆర్ ఇంకా చాలా నిధులు మంజూరు చేస్తారని అన్ని విధాలా ఆదుకుంటారని ఊదర గొడుతున్నారు.

అయితే బిజెపి నేతలు ఊరుకుంటారా... వారికి కౌంటర్లు ఇస్తూ ఈటల కారణంగానే హుజురాబాద్ లో ఉప ఎన్నికలు వచ్చాయని ఈటల కారణంగానే నిధులు పథకాలు వచ్చాయని  ఇవన్ని ఈటల వల్లే  జరుగుతున్నాయని పేర్కొంటున్నారు. బిజెపి చీఫ్ బండి సంజయ్, ఎంపి అర్వింద్, ఈటల రాజేందర్ గెలుపు కోసం హుజురాబాద్ నియోజక వర్గం కలియ తిరుగుతూ ఎన్నికల ప్రచారం చేస్తున్నారు.

బండి సంజయ్ తన ధోరణిలో కెసిఆర్ పై పంచ్ లు వేస్తూ ఓటర్లను అకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఎంపి అర్వింద్ పవర్ పంచ్ లతో టిఆర్ఎస్ నేతలకు ధీటుగా కౌంటర్లు ఇస్తూ ప్రచారం సాగిస్తున్నారు.

ఈటల గెలిస్తే ఏమస్తదని టిఆర్ఎస్ నేతలు చేసే ప్రచారానికి అర్వింద్ వారికి దిమ్మ తిరిగే టట్టు కౌంటర్ ఇచ్చాడు. 

ఈటల గెలిస్తే ఏమస్తదేంది ఈటెల గెలిస్తే కెసిఆర్ కు బుద్దొస్తదంటూ ఎన్నికల ప్రచారంలో  ఘాటుగా స్పందించారు. సిన్మాలల్ల మనం ఓటి చూస్తాం..గుట్టమీద నుండి పడో లేక పోతే రాయి తలిగో మెమోరి పోతది...మళ్ళా  లాస్ట్ లో ఎవడో ఒకడు గుంజి కొడితే మళ్ళి మెమోరి తిరిగి వస్తది.  హుజురా బాద్ లో ఇప్పడు అదే జరగ బోతోందంటూ అర్వింద్ పేర్కొన్నారు. హుజురాబాద్  దెబ్బతో కెసిఆర్ దవడ మీద పుచ్చుకున్నట్లు అయితదని ఆయన యాది మరిచిన వన్ని దెబ్బకు యాదికొస్తయని అర్వింద్ చెప్పారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు