చుక్కల మందుతో చక్కటి ఫలితాలు

 కరోనాను కట్టడి చేస్తున్న చుక్కల మందు

 


కరోనా వైరస్‌కు అడ్డుకట్ట వేసేందుకు భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన నాసల్ వ్యాక్సిన్ (బీబీవీ 154) మంచి ఫలితాలు కనబరుస్తున్నట్టు క్లినికల్ పరీక్షల్లో వెల్లడైంది.

ఈ చుక్కల మందు పూర్తి భద్రతను ప్రదర్శించడంతోపాటు మానవ శరీరంలోకి కరోనా వైరస్ చేరకుండా సమర్థంగా నివారించగలదని తొలి దశ క్లినికల్ పరీక్షల్లో తేలినట్టు సమాచారం. ఈ పరీక్షల ఫలితాలు త్వరలో వెల్లడికానున్నాయి. రెండు, మూడు దశల ప్రయోగాలు కూడా త్వరలోనే ప్రారంభించనున్నట్టు తెలుస్తోంది. కరోనా వైరస్ ముక్కు నుంచే శరీరంలోకి ప్రవేశిస్తుంది. అక్కడి నుంచి గొంతు, ఆపై ఊపిరితిత్తుల్లోకి విస్తరిస్తుంది. కాబట్టి ముక్కు ద్వారా వేసే ఈ చుక్కల టీకా అద్భుతంగా పనిచేస్తుందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఈ నాసల్ టీకాకు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వీకే పాల్ తెలిపారు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు