చిన్నారి పై హత్యాచార కేసు నిందితుడు ఆత్మహత్య

  


ఆరేళ్ల చిన్నారిపై హత్యాచారానికి పాల్పడిన కామాంధుడు రాజు ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.

చిన్నారి చైత్ర హత్యాచార కేసులో రాజు  నిందితుడు.
సైదాబాద్లో ఆరేళ్ల చిన్నారి చైత్ర పై హత్యాచారం కేసులో రాజు నిందితుడిగా ఉన్నాడు. గత 8 రోజులుగా రాజు కోసం పోలీసులు గాలిస్తున్నారు.

వరంగల్-ఘట్కేసర్ మార్గంలో స్టేషన్ ఘన్పూర్ వద్ద రైలు పట్టాలపై రాజు మృతదేహం గురువారం కనిపించింది. చేతిపై ఉన్న టాటూ ఆధారంగా రాజు మృతదేహాన్ని గుర్తించి నట్లు పోలీసులు తెలిపారు.
చిన్నారి పై జరిగిన హత్యాచార ఘటన పై నిరసనలు వెల్లు వెత్తాయి. నిందితుడిని ఎన్కౌంటర్ చెయ్యాలని ఉరితీసి చంపాలని డిమాండ్ చేశారు. నిందితుడి కోసం 500 మందితో గాలింపు చేపట్టినా గత వారం రోజులుగా ఆచూకి లభించలేదు. రాజు రైలుకింద పడి ఆత్మహత్య కు పాల్పడడంతో స్థానికులు చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు