సజీవ దహనానికి పాల్పడిన దంపతుల అరెస్ట్

 


చిట్టి డబ్బులు అడిగినందుకు ఆగ్రహంలో సెల్ ఫోన్ షావుకు నిప్పు పెట్టి షాపు యజమానిని సజీవ దహనానికి పాల్పడిన అచల చిట్ ఫండ్ కంపెనీ ఏజెంట్ ను ఆయన భార్యతో పాటు హన్మకొండ పోలీసులు శనివారం అరెస్టు చేసారు.  వీరి నుండి పోలీసులు ఒక సెల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. 

ఈ కేసులో  ప్రధాన నిందితురాలు  గొడుగు కావ్య (28), భర్త  గొడుగు గణేష్ (30)  లను పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టగా మెజిస్ట్రేట్ రిమాండ్ కు ఆదేశించారు.  

వీరి అరెస్ట్ కు సంభందించి వరంగల్ పోలీస్ కమిషనర్ డా, తరుణ్ జోషి మీడియాకు వివరాలు వెల్లడించారు. 

గణేష్ అచల చిట్ ఫండ్ లో ఏజెంట్ గా పనిచేస్తున్నాడు. హన్మకొండ లో మొబైల్ షాపు నిర్వహిస్తున్న పిట్టల రాజు అనే వ్యక్తి చిట్టి వేయగా డబ్బులు ఇవ్వక పోవడంతో రాజు అనేక సార్లు అడిగి పోలీసులు 

రాజుతో పాటు గణేష్ ది ఒకే ఊరు కావడంతో అచల చిట్ ఫండ్ లో రాజు 5 లక్ష చిట్టి వేశాడు.  కొద్ది రోజుల అనంతరం భాధితుడు రాజు తన చిట్టీని పాడుకున్నాడు. పాడుకున్న డబ్బు కోసం భాధితుడు పలుమార్లు అచల చిట్ ఫండ్ యాజమన్యాన్ని సంప్రదించడంతో చిట్ ఫండ్ కంపెనీ మూడు బ్యాంక్ చెక్కులను అందజేయగా అందులో ఒక చెక్కుకు మాత్రమే కొంత మొత్తం డబ్బు రాగా మిగితా రెండు చెక్కులు బౌన్స్ అయినాయి. దీనితో భాధితుడు రాజు మిగితా చిట్టి డబ్బుల గురించి ఏజెంట్ గణేష్ ను భాధ్యుడిని చేస్తూ పలుమార్లు నిలదీసాడు.  రెండు రోజుల  క్రితం రాజు' నిందితుడు గణేష్ ఇంటి వెళ్ళి గట్టిగా నిలదీయడంతో వీరి ఇరువురి మధ్య ఘర్షణ జరిగింది. ఈ సంఘటనను మసస్సులో పెట్టుకోని పథకం ప్రకారం నిందితుడు గణేష్ ప్రోద్బలంతో గణేష్ భార్య కావ్య పెట్రోల్ బంక్ లో నింపుకున్న సీసాతో పాటు ఒక లైటర్‌ను తన బ్యాగ్ లో వేసుకుని వచ్చి కాంగ్రెస్ భవన్ ప్రక్క సందులోని భాధితుడి సెల్ ఫోన్ షాపుకు వెళ్ళి కోపంతో తన వద్ద వున్న పెట్రోల్ ను షాపులో చల్లడంతో పాటు భాధితుడు రాజుపై పోసి తనతో పాటు తెచ్చుకున్న లైటర్ తో నిప్పు అంటించింది. ఆ తర్వాత దంపతులు ఇద్దరూ పారి పోయారు.  ఈ సంఘటనలో రాజు 50 శాతం కాలి తీవ్రంగా గాయపడ్డాడు. ఆతని మంటలు ఆర్పేందుకు ప్రయత్నం చేసిన టైలర్ కూడ గాయపడ్డారు. వీరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

ఈ సంఘటనలో నిందితులు ఇద్దరిని శనివారం అరెస్ట్ చేశామని కమీషనర్ డాక్టర్ తరుణ్ జోషి తెలిపారు. ఎనుమాములకు వేళ్ళే కాశీబుగ్గ క్రాస్ రోడ్డు వద్ద ఉన్నట్లుగా పోలీసులకు పక్కా సమాచారం అందటంతో  నిందితుడులను అదుపులోకి తీసుకోని విచారించగా చేసిన నేరాన్ని అంగీకరించారని తెలిపారు. 

త్వరితగతిన నిందితులను పట్టుకోవడంలో  ప్రతిభ కనబరిచిన డిసిపి పుష్పా, హన్మకొండ ఎసిపి జితేందర్ రెడ్డి, హన్మకొండ ఇన్స్పెక్టర్ వేణుమాధవ్, ఎస్.ఐ రఘుపతి, కానిస్టేబుల్ భావుసింగ్, గౌస్పోషా, మహిళా కానిస్టేబుల్ జ్యోతిర్మయిలను పోలీస్ కమిషనర్ అభినందించారు. 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు