ఇళ్లు లేని దళిత కుంటుంబాలకు ఇళ్లు కట్టిస్తాం

 

హుజురాబాద్ నుండే ఉద్యమం మొదలు
దళిత భందు అవగాహన సదస్సులో సిఎం కెసిఆర్


ఇళ్లులేని దళిత కుటుంబాలు ఉండకూడదని ఇళ్లు లేని ప్రతి దలిత కుటుంబానికి ఇళ్లు కట్టిస్తామని ముఖ్యమంత్రి కెసిఆర్ అన్నారు. ప్రగతి భవన్ లో సోమవారం హుజురుబాద్ నియోజకవర్గానికి చెందిన దళితులతో దళిత భందు పథకంపై జరిగిన అవగాహన కార్యక్రమంలో సిఎం మాట్లాడుతు దళితులకు స్థలం ఉంటే ఇంటి నిర్మాణానికి ఆర్థిక సహాయం చేస్తామని తెలిపారు. హుజురాబాద్ లో ఆరంభించిన దళిత భందు పథకం రాష్ర్ట వ్యాప్తంగా అమలు చేస్తామన్నారు. దళిత భందు పథకం ఓ ఉద్యమంలా కొనసాగాలన్నారు. హుజురాబాద్ లో వంద శాతం ఇళ్ల నిర్మాణాలు పూర్తి కావాలన్నారు.  దళితుల కాలనీలలో అన్ని రకాల మౌలిక వసతులు కల్పించాలని వారం, పది రోజుల్లో హుజురాబాద్‌లో స్పెషల్‌ డ్రైవ్‌ చేపట్టి దళితుల అన్నిరకాల భూ సమస్యలను పరిష్కరించాలని అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు.  ఆధికారులను ఆదేశించారు.  అట్లాగే ఎస్సీల భూముల సమస్లు 10 రోజుల్లో పరిష్కరించాలని అన్నారు.భూసమస్యల పరిష్కారానికి ప్రత్యేక డ్రైవ్‌ చేపట్టాలని కలెక్టర్‌కు సూచించారు.

‘హుజూరాబాద్‌లో రేషన్‌కార్డులు, పింఛన్లు సహా అన్ని సమస్యలు పరిష్కరించాలి. ప్రతి ఎస్సీవాడలో అధికారులు పర్యటించాలి. వ్యాధులతో బాధపడుతున్న వారి వివరాలు గుర్తించి నివేదిక ఇవ్వాలి. వ్యాధిగ్రస్తులకు ప్రభుత్వమే ఉచితంగా వైద్యం అందిస్తుంది. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల నుంచి కేంద్రం, ఇతర రాష్ట్రాలు చేర్చుకుంటున్నాయి. దళితబంధు పథకాన్ని కూడా ఇతర రాష్ట్రాలు అనుసరించాలి’ అని  కేసీఆర్‌ అన్నారు.

సమావేశానికి సుమారు 450 మంది దళిత ప్రతినిదులు హాజరయ్యారు. దళిత భంద పథకం విధివిధానాలు, అమలు తదితర అంశాలపై వారితో చర్చించారు. 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు