జిమ్మెదారి కౌన్ - దేశంలో కరోనా సంక్షోభంపై ప్రధానిపై ప్రియాంక గాంధి విమర్శలు

 


కాంగ్రెస్‌ పార్టి జాతీయ కార్యదర్శి ప్రియాంక గాంధీ ప్రధాన మంత్రి నరేంద్ర మోది పై శనివారం ట్విట్టర్ లో జిమ్మెదారి కౌన్  హాశ్ టాగ్  పేరిట కాంపెయిన్ ప్రారంభించి విమర్శలు గుప్పించారు. ప్రధాని మోదీ  ప్రజల బాగోగులకన్నా   అధికార దర్పానికి ప్రాధాన్యత నిస్తారని, అలాగే వాస్తవాలకు బదులుగా ప్రచారానికే ఎక్కువ విలువ నిస్తారని ప్రియాంక ఆరోపించారు.  కరోనా హమ్మారిని అడ్డుకోవడంలో మోడీ ప్రభుత్వం వైఫల్యం చెంది సంక్షోభానికి కారణం అయిందని అన్నారు. దేశంలో ప్రజలు కరోనా భారిన పడి అల్లాడుతుంటే  ప్రధాని పిరికి పందలా వ్యవహరిస్తున్నారని, ఆయన కారణంగానే దేశ ఆర్థిక వ్యవస్థ క్షీణించిందని అన్నారు. ఈ సంక్షోభానికి ఎవరు బాధ్యత వహిస్తారని ప్రజలు ప్రధానిని ప్రశ్నించే సమయం ఆసన్న మైదని ప్రధాని అసమర్థ పాలన గురించి ప్రపంచమంతా తెలిసిందని దుయ్యబట్టారు. 

సంక్షోభం సమయంలో పాలకులు  వాస్తవాలు గుర్తించి ఎదుర్కోవడం, బాధ్యత వహించి  నివారణ చర్యలు చేపట్టడం ద్వారా ప్రజలు భరోసా కల్పించాల్సి ఉంటుందని  దురదృష్టవశాత్తు మోడీ ప్రభుత్వం వీటిని పట్టించుకోలేదని అన్నారు. కరోనా మహమ్మారి మొదలైనప్పటి నుండి వాస్తవాలను మరుగున పడేసి బాధ్యతల నుండి పారిపోయేందుకు యత్నించారని అన్నారు. దీంతో కరోనా సెకండ్‌ వేవ్‌ మరింత విజృంభించినా.. మోడీ ప్రభుత్వం చలించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.  వైరస్‌ ప్రజలపై క్రూరంగా విరుచుకుపడిందని, కారణంగా దేశంలో మరణాల సంఖ్య అధికమైందని అన్నారు. సెకండ్‌ వేవ్‌ ఉధృతిపై ప్రపంచవ్యాప్తంగా, భారత్‌లోని నిపుణులు చేసిన హెచ్చరికలను ప్రధాని మోడీ పట్టించుకుని ఉంటే  లేదా తన కేబినెట్‌ సూచనలను, లేదా కేంద్ర ఆరోగ్య కమిటీ సూచనలను పట్టించుకుని ఉంటే.. ఆక్సిజన్‌ కొరత, బెడ్స్‌, ఔషధాల కొరత రాకుండా తక్షణ చర్యలు చేపట్టేవారని అన్నారు. అలాగే మోడీ ర్యాంకింగ్‌లకు, తన ఇమేజ్‌ను పెంచుకునేందుకు కాకుండా ప్రజలకు ప్రాధాన్యత నిచ్చి వుంటే వ్యాక్సిన్‌ల కొరత వచ్చివుండేది కాదని అన్నారు. 

నిద్ర మత్తు నుండి మేల్కని 2020 వేసవిలోనే ప్రజలకు వ్యాక్సిన్‌లు ఇవ్వాల్సిందిగా ఆదేశాలిచ్చివుంటే  చాలా మంది ప్రాణాలను కాపాడి వుండేవారని అన్నారు.  మోది తన ఇమేజ్‌ను పెంచుకునేందుకు ప్రపంచవ్యాప్తంగా ఉచిత వ్యాక్సిన్‌లను పంపిణీ చేశారని దానికి బదులుగా ముందు తన దేశ ప్రజలను రక్షించి ఉంటే మరణాల సంఖ్య తగ్గేదని  వ్యాక్సిన్‌ల కోసం ప్రజలు బారులు తీరాల్సిన అవసరం ఉండేది కాదని అన్నారు. కరోనా నుండి ప్రాణాలు కాపాడుకునేందుకు అవసరమైన సూచనలను ప్రచారం చేయకుండా.. మీడియాను సైతం తన ఇమేజ్‌, ప్రచారం కోసం వినియోగించుకుంటున్నారని దుయ్యబట్టారు. ప్రముఖ కవి నిరాలా తన "కుల్లి భాత్‌" నవలలోని కొన్ని పంక్తులను ఉటంకించారు.

"గంగా నది జలాలు శవాలతో నిండిపోయాయి. చనిపోయినవారిని దహనం చేయడానికి శ్మశానవాటికలో కలప లేదు..రెప్పపాటులో నా కుటుంబం నా ముందు నుండి అదృశ్యమైంది. " అనే పంక్తులు వినిపించారు.  వందేళ్ల క్రితం స్ఫానిష్‌ ఫ్లూ మహమ్మారి కారణంగా బయటపడిన భయంకరమైన దృశ్యాలను ఆనాడు వివరించారని, అవి గతంలో జరిగాయని అన్నారు. ఇప్పుడు మనం ఆధునిక కాలంలో జీవిస్తున్నప్పటికీ..కరోనా సంక్షోభంలో మోడీ ప్రభుత్వ అసమర్థతతో వాటికన్నా భయంకరమైన ఆవాంచ నీయ పరిస్థితులను ఎదుర్కొంటున్నామని అన్నారు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు