సహారా, ఈఎస్ఐ కేసులే కెసిఆర్ కు చుట్టుకోబోతున్నాయా ?

 బండి సంజయ్ ఏ ఆధారాలతో కెసిఆర్ జైళు కెళ్లడం ఖాయమంటున్నారు ?


సిఎం కెసిఆర్ జైళు కెళ్లడం ఖాయం.. ఈ డైలాగు బిజెపి  చీఫ్ బండి సంజయ్ ది..ఆయన తెలంగాణ బిజెపి చీఫ్ గా భాద్యతలు చేపట్టినప్పటి నుండి చేసిన వ్యాఖ్యలు..ఇంతకి కెసిఆర్ ఏం చేశాడు... ఏ కేసులో ఆయనను జైళుకు పంపిస్తారు..సిబిఐ కేసులు నమోదు చేస్తారా లాంటి డౌట్లు అనేకం ఉన్నాయి. అయితే ఓ అడుగు ముందు రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజు బండి సంజయ్ మరో సారి కెసిఆర్ జైళు కెళ్లడం ఖాయమన్నారు.

 ఎప్పుడు జైలుకు పంపించాలనే దానిపై తమ వ్యూహం తమకుందని అన్నారు. బుధవారం  హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎం కేసీఆర్ సహారా, ఈఎస్ఐ కేసులకు సంభందించిన పూర్తి వివరాలు ఆరా తీస్తున్నామని చెప్పారు. వారం రోజులుగా సీఎం కేసీఆర్ కేసుల పైనే ఆరా తీస్తున్నామని... ఈ స్కాంలు చూశాకే సీఎం కేసీఆర్ ఎంత పెద్ద అవినీతిపరుడో తేలిపోయిందని వివరించారు. మంత్రులు.. ఎమ్మెల్యేలకు సంభందించిన  అవినీతి వివరాలను సేకరించామని తెలిపారు.  టీఆర్ఎస్ 18 మంది ముఖ్యనేతలకు సంభందించిన అవినీతిపై లీగల్ ఒపీనియన్ తీసుకున్నామని అన్నారు. 

 మాజీ మంత్రి ఈటల రాజేందర్ వారం రోజుల్లో బీజేపీలో చేరతారని బండి సంజయ్  స్పష్టంచేశారు. ఆయన ఎమ్మెల్యే పదవికి, పార్టీకి రాజీనామా చేయడానికి న్యాయపరమైన సలహా తీసుకుంటున్నారని పేర్కొన్నారు.

ఈటల బీజేపీలో చేరేందుకు కొన్ని కండీషన్స్ పెట్టినట్టు వచ్చిన వార్తలపై బండి సంజయ్ స్పందించారు.  ఎలాంటి హామీలు  లేకుండానే ఈటల బీజేపీలో చేరుతున్నారని వివరించారు. బీజేపీలో ఎవరు చేరినా.. ఎలాంటి హామీలు  ఉండవన్నారు.   బీజేపీ సిద్ధాంతాలతోపాటు ప్రధాని మోడీ పాలన విధానాలు నచ్చి ఈటల రాజేందర్ బీజేపీలో చేరుతున్నారని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమకారులకు బీజేపీ మంచి వేదిక అని భావిస్తున్నారని వివరించారు. సీఎం కేసీఆర్‌ను వ్యతిరేకించే వారికి బీజేపీ అండగా ఉండి పోరాటం చేస్తుందని బంజడి సంజయ్ స్పష్టం చేసారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు