కరోనా చికిత్సకు వచ్చి పోలీసులకు చిక్కిన మావోయిస్టులు

 


అడవుల్లో అజ్ఞాతంలో ఉండే నక్సలైట్లకు సైతం కరోనా భాదలు తప్పడంలేదు. ఇప్పటికే పలువురు నక్సలైట్లు కరోనా పాజిటివ్ తో చనిపోయారని చత్తీస్ ఘడ్ పోలీసులు ఇదివరకే ప్రకటించారు. తాజాగా కరోనా సోకిన నక్సలైట్లు చికిత్స కోసం వస్తు దారిలో పోలీసులకు దొరికి పోయారు.

 వరంగల్ నగరంలో మట్వాడా పోలీసులు ములుగు రోడ్ వద్ద వాహనాలను తనిఖీలు చేస్తుండగా  ఓ కారులో ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించారు. వారిని పోలీసులు ప్రశ్నించడంతో  పొంతన లేని సమాధానాలు ఇచ్చారు. దాంతో పోలీసులకు అనుమానాలు వేసి వారిని అదుపులోకి తీసుకుని పూర్తి వివరాలు రాబట్టారు. వారు వారు నిషేధిత సీపీఐ మావోయిస్టు పార్టీకి చెందిన దండకారణ్య స్పెషల్ జోన్ డివిజనల్ కమిటీ కార్యదర్శి గడ్డం మధుకర్ గా ఆయన  కొరియర్ బందుగ వినయ్‌గా  గుర్తించారు.

. మొత్తం 12 మంది కరోనా వైరస్ బారినపడినట్లు మావోయిస్టులు వెల్లడించారు. మావోయిస్టుల అరెస్టుకు సంబందించిన వివరాలను వరంగల్‌ నగర పోలీస్‌ కమిషనర్‌ తరుణ్‌ జోషి బుధవారం మీడియాకు వెల్లడించారు. కరోనా సోకిన వారందరూ బయటకు వస్తే తాము మెరుగైన వైద్యం అందించేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. కరోనా బారినపడిన 12 మంది పేర్లను కమిషనర్ తరుణ్ జోషి  వెల్లడించారు.

బడే చొక్కారావు అలియాస్ దామోదర్, కటకం రాజిరెడ్డి అలియాస్ ధర్మన్న, కట్టా రాంచంద్రారెడ్డి అలియాస్ వికల్స్, కున్‌కటి వెంకటయ్య అలియాస్ వికాస్, ముచ్చకి ఉజల్ అలియాస్ రఘు, కటకం సుదర్శన్ అలియాస్ ఆనంద్, తిప్పరి తిరుతి అలియాస్ దేవుజీ, యాప నారాయణ అలియాస్ హరిభూషణ్, ములా దేవేంద్రరెడ్డి, అలియాస్ మాస దడ, కొడి మంజుల అలియాస్ నిర్మల, పూసం పద్మ, కాకర్ల సునీత అలియాస్ బుర్రా 12 మంది అని పోలీసులు తెలిపారు. ఇటీవల చేపట్టిన నిరసన కార్యక్రమం లో మాస్ కాంటాక్టుల ద్వారా కరోనా సోకిందని పోలీసులు అనుమానిస్తున్నారు. బీజాపూర్ సిల్దూర్ గ్రామం వద్ద కొత్తగా ఏర్పాటు చేస్తున్న పోలీసు క్యాంపును వ్యతిరేకిస్తూ ఛత్తీస్ ఘడ్.. తెలంగాణ సరిహద్దులోని ప్రజలతో నిరసన కార్యక్రమాలను మావోయిస్టులు నిర్వహించారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు