గుడ్ న్యూస్ చెప్పిన ప్రధాన మంత్రి - ఇక వాక్సిన్ ఫ్రీ

 


ప్రధాన మంత్రి నరేంద్ర మోది దేశ ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పాడు. ఇక నుండిరాష్ట్రాలు వాక్సిన్ల కోసం ఖర్చు పెట్టకుండా కేంద్రమే పూర్తి ఖర్చులు భరించి వాక్సిన్ అందరికి అందేలా చేస్తుందని  ప్రకటించారు. 

సోమవారం దేశ ప్రజల నుద్దేశించి ప్రసంగించిన నరేంద్ర మోది వాక్సినేషన్ విషయంలో కేంద్రమే ఇక పూర్తి బాద్యత స్వీకరిస్తుందని తెలిపారు. నేరుగా కంపెనీల నుండి కేంద్రం వాక్సిన్ కొనుగోలు చేసి జూన్ 21 నుండి రాష్ట్రాలకు పంపిణి చేస్తుందని చెప్పారు. జూన్ 21 నుండి 18 ఏళ్లు నిండిన వారందరికి వాక్సిన్ ఇస్తామని తెలిపారు.  ఉత్పత్తి అయిన వాక్సిన్లలో 75 శాతం కేంద్రం కొనుగోలు చేసి రాష్ట్రాలకు ఇస్తుందని 25 శాతం వాక్సిన్ డోసులు  ప్రైవేట్ ఆసుపత్రులకు ఇస్తారని   అన్నారు.

ప్రస్తుతం దేశంలో ఏడు కంపెనీలు వాక్సిన్లు ఉత్పత్తి చేస్తున్నాయని చెప్పారు. తాను అధికారంలోకి వచ్చే నాటికి దేశం వాక్సిన్ల తయారీలో చాలా వెనుకబడి ఉందని తాను తీసుకున్న ముందుజాగ్రత్త చర్యల వల్ల చాలా మెరుగుపడిందని ఒక్క ఏడాది కాలంలో రెండు వాక్సిన్లు అభివృద్ధి చేశామని  తెలిపారు.

విమర్శలు వెల్లు వెత్తడంతోనే  కేంద్రం దిద్దు బాటుచర్యలు

వాక్సిన్ విషయంలో దేశంలో విమర్శలు వెల్లువెత్తడంతో కేంద్రం దిద్దు బాటు చర్యలకు ఉపక్రమించింది. సుప్రీం కోర్టుకూడ వాక్సిన్ ధరల వ్యత్యాసం విషయంలో  తప్పులు ఎత్తి చూపింది. ప్రతి పక్షాలు వివిద రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేంద్రం తీరును తప్పు పట్టాయి. కరోనా కట్టడి విషయంలో  వైఫల్యాలు మూటగట్టుకుని ఇమేజ్ కోల్పోయిన మోది  దేశంలో ఉచిత వాక్సినేషన్  నిర్ణయం తీసుకున్నాడని విశ్లేషకులు అభిప్రాయ పడ్డారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు