అనందయ్య కంటి చుక్కల మందుకు హై కోర్టు గ్రీన్ సిగ్నల్

 


ఆనందయ్య మందుల్లో కీలకమైందిగా భావిస్తున్న కంటి చుక్కల మందుకు హై కోర్టు అనుమతి ఇచ్చింది. 

గతంలో ఆనందయ్య ఇతర మందులకు అనుమతిచ్చిన ప్రభుత్వం.. కంట్లో వేసే చుక్కల మందు సహా కె మందుకు అనుమతి ఇవ్వలేదు. ఆయుష్ నివేదికకు సంబంధించి పూర్తి వివరాలు రాని నేపథ్యంలో వీటికి అనుమతి లభించలేదు. దీంతో ఆనందయ్య కోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో విచారణ చేపట్టిన ధర్మాసనం.. కరోనా బాధితులకు తక్షణమే కె మందు పంపిణీ చేయాలని స్పష్టం చేసింది. 

గతంలోనే ఆనందయ్య ఇచ్చే పి, ఎల్, ఎఫ్‌.. మందులకు ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. సీసీఆర్‌ఏఎస్‌ నివేదిక ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. వాటి పంపిణీని ఇప్పటికే ప్రారంభించారు ఆనందయ్య.. ఇప్పుడు తాజాగా కె మందుకు కూడా హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అనందయ్య కరోనా భాదితుల కోసం తాను తయారు చేసే మందులన్నించికి ప్రభుత్వం అనుమతులు ఇచ్చినట్లే. ఇప్పటికే మూడు రకాల మందులను నెల్లూరు జిల్లాలో ప్రభుత్వ పర్యవేక్షణలో పంపిణి  చేస్తున్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు